Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పురుగుల అన్నంతో భోజనం
- విద్యార్థినుల పట్ల నర్సు చిన్నచూపు
- ఎస్ఓ, నర్సు వద్దంటూ విద్యార్థినుల నిరసన
- చక్రం తిప్పుతున్న నాన్ టీచింగ్ సిబ్బంది
- దిక్కుతోచనిస్థితిలో విద్యార్థినులు
విద్యార్థినులకు నాణ్యమైన విద్యనందించే కేజీబీవీలో గందరగోళం నెలకొంది. అధికార పార్టీ నేతల అండదండలతో నాన్ టీచింగ్ సిబ్బంది చక్రం తిప్పడం, ఉపాధాయులు, ఉపాధ్యాయేతరుల మధ్య రాజకీయ రణం నడుస్తుండడం, పురుగుల అన్నం పెడుతున్న ఎస్ఓ పట్టించుకోకపోవడం, ఎవరికి అనారోగ్యమొచ్చిని నర్సు పట్టించుకోక పోవడం, అందుకు నర్సుకు ఎస్ఓ అండదండలుండడంతో విద్యార్థినులు వారి మధ్య నలిగిపోతున్నారు. వీరి తీరుపై విసుగు చెందిన విద్యార్థినులు బుధవారం ప్రత్యేకాధికారిణి, నర్సు వద్దంటూ పాఠశాల ఆవరణలో భోజనం చేయకుండా నిరసన చేపట్టారు. ఈ క్రమంలో వార్తను కవరేజ్ చేసేందుకు వెళ్లిన పాత్రికేయులను లోపలికి రానివ్వకుండా అడ్డుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
నవతెలంగాణ - పెంట్లవెళ్లి
మండల కేంద్రంలోని కేజీబీవీలో రాజకీయ రణరంగం నడుస్తోంది. పాఠశాలలో 291 మంది విద్యార్థి నులున్నారు. పాఠశాల ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు పాలు, పండ్లు అందించలేదు, వండే అన్నంలో కూ డా పురుగులు రావడం, ఉడికీ ఉడకని కూరలు, అన్నంతో విద్యార్థినులు అవస్థలు పడుతున్నారు. ఇలాంటి ఘటనల తో రాష్ట్రంలో అనేక మంది విద్యార్థినులు ఆస్పత్రి పాలౌతు న్నా నేటికీ ఈ ఘటనలకు ఎస్ఓలు ఆజ్యం పోస్తున్నారనే విమర్శలున్నాయి. విద్యార్థినుల ఆరోగ్య విషయాలపై ప్రత్యే క దృష్టి సారించాల్సిన నర్సు సరిగా రాకపోవడం, వచ్చిన విద్యార్థినులను పట్టించుకోకపోవడం వంటివి చేస్తుంది. ఒక వేళ అనారోగ్యంతో బాధపడే పిల్లలుంటే వారికి కాలం చెల్లిన మందులిచ్చి తప్పుకోవడం చేస్తోంది. ఈమెకు ఎస్ఓ అండదండలున్నాయనే విమర్శలున్నాయి. అంతేకాకుండా ఇక్కడ అధికార పార్టీ నేతల అండతో విధుల్లో చేరిన నాన్ టీచింగ్ సిబ్బంది వారి పేరు చెప్పుకుంటూ చక్రం తిప్పుతు న్నారు. దీంతో ఉపాధ్యాకులు, ఉపాధ్యాయేతరుల మధ్య రా జకీయ రణం నడుస్తోంది. వీరి తీరుపై విసుగు చెందిన విద్యార్థినులు బుధవారం పాఠశాల ఆవరణలో భోజనాలు చేయకుండా నిరసన తెలిపారు. తమకు ఎస్ఓ, నర్సులు వద్దంటూ పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ తమ బాధను వెల్లగక్కారు. ఈ క్రమంలో విద్యార్థినుల సమస్యలను కవరే జ్ చేసేందుకు వెళ్లిన పాత్రికేయులకు అనుమతి లేదని, ఇక్కడ అమ్మాయి లున్నారంటూ చెప్పుకురావడంపై పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. అందువల్ల జిల్లా ఉన్న తాధికారులు స్పందించి విద్యార్థినులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిస్కరించాలని ప్రజా సంఘాల నాయకులు కోరుతున్నారు.
వైద్యం అందడం లేదన్నది వాస్తవమే
పాఠశాలలో విద్యార్థులకు సక్రమంగా వైద్యం అదండంలేదన్న మాట వాస్తవమే, అందుకు బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. నాన్ టీచింగ్, టీచింగ్ మధ్య గ్రూపు తగాదాలున్నాయన్న విషయంపై విచారణ చేస్తాం. విధులు సక్రమంగా నిర్వహించని వారిపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాను. విద్యార్థినులకు మంచి భోజనం అందేలా చూస్తాం.
- సూర్య చైతన్య, ఎస్ఓ
సిబ్బందిపై చర్యలు తీసుకోవాలి : ప్రజాసంఘాల నాయకులు
పాఠశాలలో విద్యార్థినుల బాగోగులు మరచి గ్రూపు రాజకీయాలు చేస్తున్న వారిపై, పురుగుల అన్నం వడ్డిస్తున్నా పట్టించుకోని ఎస్ఓ, పిల్లలను వైద్య పరంగా పట్టించుకోని నర్సుపై చర్యలు తీసుకోవాలని సీపీఐ(ఎం) జిల్లా నాయకులు డి.ఈశ్వర్, బీఎస్పీ నియోజకవర్గ అధ్యక్షులు మునిస్వామి, మాలల చైతన్య సమితి రాష్ట్ర వ్యవస్థాపకులు మూల కేశవులు డిమాం డ్ చేశారు. బుధవారం వారు పాఠశా లను సందర్శించారు. భోజనాన్ని పరిశీలించి అనారోగ్యా నికి గురైన పిల్లలతో మాట్లాడి సమస్యను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు, ఉపాధ్యాయే తరు ల మధ్య గ్రూపు తగాదాలు నడుస్తున్నా ఎస్ఓ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. వీరి కారణంగా మధ్యలో విద్యార్థినులు నలిగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్ల అధికారులు స్పం దించి విద్యార్థినుల ఇబ్బందులకు కారకులైన వారందరిపై చర్యలు తీసుకోవాలని కోరారు.