Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి
- ఇన్ ఫ్లో 58,954 క్యూసెక్కులు
- ఔట్ ఫ్లో 47,197 క్యూసెక్కులు
- పూర్తి సామర్థ్యం 9.657 టీఎంసీలు
- ప్రస్తుతం 4.554 టీఎంసీలు
నవతెలంగాణ - ధరూర్
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వరప్రదా యిని అయిన ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగు తుండగా గేట్లు మూసేసి విద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తున్నారు. ఎగువన నారాయణపూర్ నుంచి 20 వేల క్యూసెక్కులు, ఆల్మట్టి నుంచి 18 వేల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. దీంతో జూరాలకు 58,954 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రా జెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 9.657 టీ ఎంసీలు కాగా ప్రస్తుతం 4.554 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 43,914 క్యూసెక్కుల నీటిని ఉపయో గించి 6 యూనిట్లో 234 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. యథావిధిగా జూరాల నుంచి నెట్టెంపాడుకు 750 క్యూసె క్కులు, భీమా-1కు 650, భీమా-2కు 750 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 1060 క్యూ సెక్కు లు, కుడి కాల్వకు 469 క్యూసెక్కులు, కోయిల్‌సాగర్ కు-0 క్యూసెక్కులు, సమాంతర కాల్వకు 900 క్యూసె క్కుల నీరు విడుదల చేస్తున్నారు. మొత్తంమీద దిగువ ప్రాంతా నికి 47,197 క్యూసెక్కుల నీటిని వదిలినట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు.