Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లాను ముంచెత్తుతున్న వర్షాలు
- జలమయమైన పొలాలు, కాలనీలు
- ఆరుతడి పంటలకు అనుకూలం
- పత్తి, మిర్చి పంటలకు దెబ్బ
- వారం పాటు కురిస్తే పంటలకు తీవ్రనష్టం
- ఆందోళనలో అన్నదాతలు
- దెబ్బతిన్న పంటల పరిశీలనలో అధికారులు
ఉక్కపోతతో ఎండలు వీస్తే సాయంత్రం కాగానే వర్షాలు ప్రారంభమౌతున్నాయి. ఈ వర్షాలు మెట్ట పంటలకు ఊరటనిచ్చినా నల్లరేగడి భూములకు మాత్రం నష్టాన్ని మిగిల్చుతున్నాయి. ఇప్పటికే గద్వాల జిల్లాలోని అలంపూర్, ఉండవెల్లి, మానవపాడు, అయిజ మండలాల్లో కురిసిన భారీ వర్షాలకు పంట పొలాలు నీట ముని గాయి. ఇండ్లలోకి నీరు చేరి జన జీవనం స్తంభించిపోయింది. ఈ వర్షాలు ప్రజలకు ఇబ్బందులు కలిగించి నా రైతులకు మాత్రం లాభాన్ని చేకూర్చాయి. ఈ వర్షాలు వారం పాటు కురిస్తే మాత్రం మెట్ట, రేగడి అనే తేడాల్లేకుండా పంటలకు నష్టం వాటిల్లే ప్రమాదం లేకపోలేదు. ఇప్పటికే నీట మునిగిన పంటలను సంబంధిత శాఖ అధికారులు పరిశీలించి తగు సూచనలు చేశారు. వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండా లని అధికారులు, ప్రజా ప్రతినిధులు హెచ్చరిస్తున్నారు.
నవతెలంగాణ - మహబూబ్‌నగర్ ప్రాంతీయప్రతినిధి
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో సాధారణ వర్షపాతం కంటే అధికంగా నమోదైంది. ఏడాదిలో 631.5 మి||మీ||ల వర్ష పాతం నమోదైతే ఇప్పటి వరకు 249 మి||మీ||ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా అంతకు మించి 425.7 మి||మీ||ల వర్ష ఫాతం నమోదైంది. మంగ ళవారం 11 మి||మీ||ల వర్షపాతం నమోదైంది. ఇదే పరిస్థి తి కొనసాగితే మెట్ట, ఆరతడి పంటల దిగుబడి భారీగా తగ్గే అవకాశాలున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధిక వర్షాలతో వేలాది ఎకరాలు నీట మునిగాయి. పత్తి, మొక్క జొన్న పంటలు అధిక వర్షాలకు తెగుళ్లతో మురి గిపోయే అవకాశాలున్నాయి. గద్వాల జిల్లాలోని అలంపూర్, ఉండవెల్లి, మానవపాడు, అయిజ మండలాల్లో కురిసిన భారీ వర్షానికి పలు కాలనీలు జలమయమై జన జీవనం స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలను ప్రజా ప్రతి నిధులు, అధికారులు పర్యటించి పరిస్థితులపై ఆరా తీశారు.
మూడు లక్షల ఎకరాల దిగుబడి ప్రశ్నార్థకం
ఉమ్మడి జిల్లాలో రెండు లక్షల ఎకరాల పత్తి, మరో లక్ష ఎకరాలలో ఇతర పంటలు పూర్తిగా నీరు చిచ్చు లేచింది. నాగర్‌కర్నూల్, గద్వాల, మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాలో అత్యధికంగా నల్ల భూములున్నాయి. ఇక్కడ వాణి జ్య పంటలైన పత్తి, కంది, మొక్కజొన్న పంటలు సాగవు తాయి. నల్ల భూముల్లో అధిక వర్షాలు నీరు చిచ్చు లేపా యి. ఎర్ర, చౌట భూములు అదే స్థితిలో ఉన్నాయి. ఇక కూ రగాయల సాగు కుదేలైంది. టమోటా, బీరకాయ, చిక్కుడు, కాకర వంటి పంటలు నేలమట్టమయ్యాయి. అధిక వర్షాల నుంచి పంటలను ఎలా రక్షించుకోవాలనే విషయాలపై వ్యవసాయాధికారులు రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసవం ఉంది.
పరిశోధనల ఫలితాలేవి
జిల్లాలో పకృతి వైపరీత్యాలు వాటిల్లితే వచ్చే నష్టం నుంచి పంటలను ఏ విధంగా కాపాడుకోవాలో నిపుణులు చెప్పాల్సి ఉంది. పాలెం పరిశోధనలో అధిక వర్షాల ను తట్టుకునే వంగడాలను ఉత్పత్తి చేయాల్సి ఉంది. ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదనే విమర్శలున్నాయి. ప్రధానంగా అధిక వర్షాలు, తెగుళ్లు వంటి విపత్తుల నుంచి పంటలను ఎలా కాపాడుకో వాలో శాస్త్రవేత్తలు తెలియ జేయాల్సి ఉంది. నాగర్‌కర్నూల్ జిల్లా పరిధిలో పరిశోధన కేంద్రం ఉన్నా.. రైతులను చైతన్యం చేయడంలో పూర్తిగా విఫలమౌతున్నారనే ఆరోపణలతో కూడిన విమర్శలున్నాయి. ఇప్పటికైనా రైతులకు గిట్టుబాటు సాగు, పకృతి విపత్తు ల నుంచి పంటలను కాపాడుకునే విధంగా అవగాహన కల్పించాలని రైతు సంఘాలు కోరుతున్నాయి.
రైతులకు అవగాహన కల్పించాలి
అధిక వర్షాలతో మెట్ట పంటలు భారీగా నష్టం వాటిల్లుతోంది. ప్రధానంగా విపత్తుల నుంచి పంటలను కాపాడు కునేందుకు రైతులను చైతన్యం చేయాల్సి ఉంది. ఇప్పటికే నష్టపోయిన పంట పొలాలను పరిశీలించి బాధిత రైతులకు పంట నష్ట పరిహారం అందజేయాలి. రైతు చైత న్య అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి పంట నష్ట శాతాన్ని తగ్గిం చాలి.
- శ్రీనివాస్‌రెడ్డి, రైతుసంఘం జిల్లా కార్యదర్శి, నాగర్‌కర్నూల్