Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హన్వాడ : డబ్బానీరు తాగడం వల్ల ప్రజలు అనారోగ్య బారిన పడుతున్నారని, అందువల్ల ప్రతి ఒక్కరూ మిషన్ భగీరథ నీరు తాగాలని మిషన్ భగీరథ ఏఈ యాదయ్య సూచించారు. బుధవారం ఇబ్రహీంబాద్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మిషన్ భగీరథ నీటిపై అవగాహన కల్పించి మాట్లాడారు. ఫిల్టర్ నీరు తాగడం వల్ల అనేక రోగాలొస్తాయన్నారు. వాటిలో రసాయ నాలు వాడడం వల్ల వాటి ప్రభావం ఎముకలపై పడి రోగాల బారిన పడే అవకాశం ఉందన్నారు. మిషన్ భగీరథ నీటిలో మనకు కావాల్సిన ఖనిజ లవణాలుంటాయని, అవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయన్నారు. పూర్వం చెరువులు, కుంటల నీటిని తాగేవారని, వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాలేదని గుర్తు చేశారు. ప్రస్తుత సమాజంలో డబ్బా నీటికి అలవాటు పడి అనేక రోగాల బారి నపడి ఆస్పత్రి పాలవుతున్నారని హెచ్చరించారు. అందువల్ల ప్రతి ఒక్కరూ తమ తమ ఇండ్లల్లో మిషన్ భగీరథ నీటిపై అవగాహన కల్పించాలని సూచిం చారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాసులు, యాదయ్య, కురుమూర్తి గౌడ్, యాదయ్య పాల్గొన్నారు.