Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ- మక్తల్
భారతమాల బాదిత రైతులకు న్యాయం చేయాలి. సీపీఐ జిల్లా కార్యదర్శి కొండన్న డిమాండ్ చేశారు. సర్వేను అడ్డుకుని, ''రాస్తారోకో'' చేపట్టిన రైతులు. భారతమాల జాతీయ రహదారి విస్తరణ కోసం జరుగుతున్న సర్వేలో అక్రమాలు జరిగినా యని ఆదివారం నారాయణపేట జిల్లా మఖ్థల్ మండలం దాసర్ దొడ్డి గేట్ దగ్గర జాతీయ రహదారిపై రైతులతో కలిసి సర్వే అధికారులను నిలు వరించి, రాస్తారోకో నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ మఖ్తల్-దాసర్ దొడ్డి రోడ్యం మద్యన 4.5 కిలోమీటర్ల పరిధిలో ఉన్న కేవలం 5 మంది రీయల్ ఏస్టేట్ దళారుల భూములను కాపాడటానికి వాస్తవ పాత సర్వేకు విరుద్దంగా 50 మందికి పైగా రైతుల భూములను అన్యాయంగా , అధికంగా సేకరిస్తున్నారని కొండన్న ఆరోపించారు.మఖ్తల్-మాగనూర్-టైరోడ్ మద్యన రహదారి పక్కన భూములు బహిరంగ మార్కెట్లో ఎకరాకు సుమారు కోటి రూపాయల ధరలు పలుకు తుండగా అధికారులు మాత్రం 5-10 లక్షల రూపా యలు ఇస్తామనడం అన్యాయమైన విషయమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు , ప్రభుత్వం వాస్తవిక పాత సర్వే ప్రకారం రోడ్డుకిరువైపులా సమానంగా భూమిని తీసుకోవాలని , బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం ధర చెల్లించి భూసేకరణ చేయాలని కొండన్న డిమాండ్ చేశారు.ఈ రాస్తారోకో కార్యక్రమంలో భారతమాల భూ బాదిత రైతులు శ్రీనివాసులు, నర్సిములు,ఎల్లయ్య, గొల్ల నర్సింహ, లక్ష్మీనారాయణ, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.