Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్య, వైద్యం కోసం అధిక నిధులు ఖర్చు
- కోవిడ్ వల్ల అభివృద్ధికి ఆటంకం
- మహబూబ్నగర్ జడ్పీ చైర్మన్ స్వర్ణసుధాకర్రెడ్డి
తెలంగాణలో జరుగుతున్న అభివృధ్దిని చూసి ఫిదా అయ్యాను. నేను అనేక పార్టీలు చేసిన అభివృద్ధిని దగ్గరుండి పరిశీలన చేశాను. తెలంగాణ జరుగుతున్న అభివృధ్ది దేశంలోనే ఎక్కడ లేదు.అందుకే ఉద్యమ పార్టీ టీఆర్ఎస్లో చేరిపోయాను.పల్లెలు పట్టణాలుగా మారుతున్నాయి. దీనంతటికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టుదల రాజకీయ అనుభవం, ఉద్యమ కాలం నాటి నుంచి నేటి వరకు ఆయన ఎజెండా ఒక్కొకటి అమలు చేస్తున్నారు. ముఖ్యంగా విజన్ ఉన్న సిఎం మనకు ఉంటడం తెలంగాణ ప్రజల అదృష్టంగా భావించవచ్చు.
నవతెలంగాణ-మహబూబ్నగర్ ప్రాంతీయప్రతినిధి
నవతెలంగాణ: జడ్పీ చైర్మన్గా మీరు ఇప్పటి
వరకు చేసిన అభివృద్ది ఏమిటి ?
స్వర్ణ : మహబూబ్నగర్లో కేసీఆర్ పార్కు, ట్యాంకుబండు, రోడ్లు, అనేక సంక్షేమ పథకాలు మన కళ్లముందు ఉన్నాయి.మన మినిస్టర్ సైతం అనేక నిష్పక్షపాతంగా అభివృద్ధి చేస్తున్నారు. స్థాయి సంఘం సమావేశాలు పూర్తయ్యాయి. అనేక సమస్యలు సమావేశాల్లో చర్చకు వచ్చాయి. జడ్పీటీసీగా మనకు నిధులు పరిమితంగా ఉన్నా.. అభివృద్ధిలో ఎక్కడా రాజీపడటం లేదు. ముఖ్యంగా గత రెండేళ్లుగా కరోనా కారణంగా అభివృద్ధి క్షీణించింది. పరిమితమైన నిధుల వల్ల ప్రాధాన్యత క్రమంగా పనులు జరుగుతున్నాయి.
నవతెలంగాణ: జడ్పీటీసీలు హక్కుల విషయంలో గతంలో
రభాస జరిగింది. కదా దినిపై మీ అభిప్రాయం ?
స్వర్ణ : అవును నిజమే. వారు ఎంపీపీ పక్కనే కుర్చి వేయాలని చెబుతున్నారు. ఎంపీపీలు జడ్పీటీసీలకు గౌరవం ఇవ్వడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.కొత్త కలెక్టర్ కార్యాలయం ప్రారంభమైయితే మనకు కార్యాలయ సమస్యలు తీరుతాయి.
నవతెలంగాణ : సాహిత్యం విషయంలో
అనుభవం ఉంది కదా ?
స్వర్ణ : సాహిత్యంలో నాకు కాస్త అనుభవం ఉంది. 75వ స్వతంత్య్ర వేడుకల్లో రచయితలను గౌరవించాం. సాహిత్య సమావేశాలు ఏర్పాటు చేసి పరిచయ కార్యక్రమం చేశాం. మన జిల్లాలో అనేక మంది కవులు కళాకారులు ఉన్నారు. ఏదైనా సందర్బం ఉంటే దాన్ని ఆసరా చేసుకొని రచనలు కొనసాగిస్తాను. ఈ జిల్లాలో మంచి రచయితలు కళాకారులు ఉండటం మనకందరికి గర్వకారణం.
నవతెలంగాణ : మీ రాజకీయ ప్రవేశం గురించి చెప్పండి ?
స్వర్ణ :1980లో కాంగ్రెస్ నాయకురాలు నన్నపనేని రాజకుమారి ద్వారా కాంగ్రెస్ పార్టీలో చేరాను. గల్లా అరుణకుమారి, గీతారెడ్డి గారితో మించి పరిచయాలున్నాయి. మా వారు ఎన్టీఆర్ కాలంలోనే ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వాలని ప్రయత్నం చేశారు. అయితే ఎంపీపీగా అవకాశం ఇచ్చారు. మాకు అవసరం లేదని తిరస్కరించాం. దీంతో టీడీపీకి దూరమై కాంగ్రెస్లో చేరాం.. కాంగ్రెస్లో ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు. టీడీపీ, కాంగ్రెస్, పార్టీ ఏదైనా చిత్తశుద్దితో పనిచేశాను. అందుకే నాకు రాజకీయ అవకాశాలు వస్తున్నాయి.
నవతెలంగాణ: మరోసారి ఎమ్మెల్యేగా ప్రయత్నం చేస్తారా ?
స్వర్ణ : అవకాశం వస్తే... పోటీ చేయడానికి సిద్దమే. నాకు జడ్పీ చైర్మన్ ఎంపిక చేసి మంచి గౌరవం ఇచ్చారు. అది చాలు. పార్టీ ఏ బాద్యత ఇచ్చినా.. వీర సైనికురాలిగా కృషి చేసి విజయం కోసం పాటుపడుతాను.