Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ -వనపర్తి
ప్రజావాణి కార్యక్రమం ద్వారా అందిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష అధికారుల ఆదేశించారు. సోమవారం ఐడిఓసి సమావేశ మందిరంలో ఆమె ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారుల నుండి అందిన దరఖాస్తులను పరిశీలించి, జాప్యం లేకుండా వెంటనే పరిష్కరించాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమం ద్వారా దరఖాస్తుదారుల నుండి (30) ఫిర్యాదులను ఆమె స్వీకరి ంచారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) ఆశిష్ సంగ్వాన్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డి.వేణుగోపాల్, జిల్లా అధికారులుపాల్గొన్నారు.
ధరూర్ : ప్రజావాణి ద్వారా రైతుల నుండి వచ్చే భూ సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్ని మండలాల తహసీల్దార్లకు ఆదేశించారు. ప్రజా వాణి ద్వారా వచ్చే భూ దరఖాస్తులు ఎప్పటికప్పుడు పరిష్కరించి పెండింగ్ లో ఉండకుండా చూడాలని అధికారులకు ఆదేశించారు. ప్రజావాణి ద్వారా 56 ఫిర్యాదులు వచ్చాయన్నారు. 45 భూ సమస్యలు వచ్చాయని, 11 ఆసరా పెన్షన్లు ఇతర సమస్యలు వచ్చా యని తెలిపారు. వాటిని సంబందిత అధికారులకు పంపి సమస్య పరిష్కారమయ్యేలా చూస్తామని ఫీర్యాదుదారులకు హామీ ఇచ్చారు.
నారాయణపేట టౌన్ : జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాల యంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి పేట జిల్లా వివిధ ప్రాంతాల నుండి 4 ఫిర్యాదులు వచ్చినట్లు ఎస్పీ ఎన్. వెంకటేశ్వర్లు తెలిపారు. వచ్చిన ఫిర్యాదులను సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు పంపిస్తామన్నారు. చట్ట ప్రకారంగా వెంటనే పరిష్కరిస్తామని చేస్తామని తెలిపారు. అత్యవసర సమయంలో డయల్ 100కు ఫోన్ చేసి పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని తెలిపారు.
కందనూలు : ప్రజావాణి కార్యక్రమం ద్వారా స్వీకరించిన ఫిర్యాదులను జాప్యం లేకుండా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ రెవిన్యూ ఎస్. మోతిలాల్, జిల్లా అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్ ప్రజావాణి సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజావాణి కార్యక్రమం ద్వారా లబ్ధిదారుల నుండి స్వీకరించిన ఫిర్యాదులను జాప్యం లేకుండా వెంటనే పరిష్కరించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా (35) ఫిర్యాదులు స్వీకరించినట్లు ఆయన తెలిపారు. అదనపు కలెక్టర్ మోతిలాల్, పిడి డిఆర్డిఏ నరసింహారావు, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి భూపాల్ రెడ్డి ప్రజలనుండి వినతులు స్వీకరించారు. ఎస్పీ ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని పలు ప్రాంతాల నుండి 04 మంది ఫిర్యాదు దారులు వచ్చారు. ఫిర్యాదు దారులతో జిల్లా ఎస్పీ క మనోహర్ స్వయంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకుని సంబంధిత పోలీసు అధికారులకు ఫిర్యాదుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఎస్పీ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
వనపర్తి రూరల్ : వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎస్పీ నూతన సమీకృత కార్యాలయం నందు సోమవారం పోలీసుల ప్రజావాణి కార్యక్రమానికి 9 ఫిర్యాదులు వచ్చాయని జిల్లా ఎస్పీ కే అపూర్వరావు తెలిపారు. అయన స్వయంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటి పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు ఆదేశించారు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి 9 ఫిర్యాదులు లకు గాను రెండు భూసంబర్తమైన ఫిర్యాదులు ఒకటి భార్యాభర్తల కు సంబంధించిన ఫిర్యాదులు ఆరు పరస్పర గొడవలకు సంబంధించిన ఫిర్యాదులు అందయని ఆమె తెలిపారు.