Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమరచింత : గత వారం రోజులుగా ధూమ్ పాయి కుంట లో అర్హులైన లబ్ధిదారులు గుడిసెలు వేసుకున్న టీఆర్ఎస్ ప్రభుత్వం పటించుకోవడంలేదని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి, వైస్ చైర్మన్ జి ఎస్ గోపి అన్నారు. సోమవారం అమరచింత మున్సిపాలిటీ కేంద్రంలోని గుడిసెలు వేసుకున్న నిరసన తెలుపుతున్న లబ్ధిదారులతో ఆయన మాట్లాడుతూ. ధూమ్పాయి కుంటలో గుడిసెలు వేసుకొని మాకు పొజిషన్, హద్దుల హక్కు పత్రాలను ఇవ్వాలని నిరసన చేశారు. ధూమ్ పాయి కుంటలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో 25 సంవత్సరాల క్రితం పేదలకు14.37 గుంటల భూమి లో రెండు సెంట్లు ల ఫ్లాట్ లను ఇవ్వడం జరిగిందని అన్నారు. కానీ ఐదు సంవత్సరాలు గడుస్తున్న ఇచ్చిన ప్లాట్లకు పొజిషన్ హద్దులు చూపించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు.ప్రభుత్వం ఇచ్చిన ప్లాట్లకు పొజిషన్ హద్దులు చూపించి అదే ఫ్లాట్లోనే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిచో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో వివిధ రూపాలలో ఆందోళన కార్యక్రమాలను చేపడతామని ఆయన ప్రభుత్వానికి హెచ్చరించారు. కార్యక్రమంలో మండల నాయకులు బి వెంకటేష్, ఆర్యన్ రమేష్ ,ఎస్ అజయ్, బుచ్చన్న, విష్ణు శ్రీను లక్ష్మణ్ లబ్ధిదారులు పలువురు పాల్గొన్నారు.