Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొల్లాపూర్ రూరల్ : ఎస్ఎఫ్ఐ రాష్ట్రం మహా సభలను జయప్రదం చేయాలని డివిజన్ కార్యదర్శి అఖిల మండల కార్యదర్శి రామకష్ణ అన్నారు. కొల్లాపూర్ పట్టణ కేంద్రంలో ఎస్ఎఫ్ఐ మహా సభల గోడపత్రిక విడుదల చేశారు. డివిజన్ కార్యదర్శి అఖిల మండల కార్యదర్శి రామకష్ణ మాట్లా డుతూ సెప్టెంబర్ 14,15,16 తేదీల్లో కరీంనగర్ పట్టణ కేంద్రంలో, శుభం గార్డెన్స్ లో ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలు నిర్వహించునున్నట్టు తెలిపారు.ఈ కార్యక్రమంలో శివ వంశి వినరు చందు భాను బన్నీ పాల్గొన్నారు
అచ్చంపేట : ఈనెల 14,15,16 తేది లలో కరీంనగర్ లో జరుగనున్నా ఎస్ఎఫ్ఐ 4.వ రాష్ట్ర మహాసభలు విజయవంతం చేయాలని (భారత విద్యార్థి ఫెడరేషన్) ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అమ్రాబాద్ మండలం అధ్యక్షుడు ఎండి సయ్యద్ పిలుపునిచ్చారు. సోమవారం మన్నానూర్ లో ర్యాలీ, ఎస్ఎఫ్ఐ జెండా ఆవిష్కరణ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ పేద విద్యార్థుల కోసం పని చేస్తుందన్నారు. కార్యక్రమంలో నాయకులు సుల్తాన్ ,శివ, అఖిల్,మండల్కమిటీనాయకులు పాల్గొన్నారు.
కోడేరు : మండల కేంద్రంలోని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాలుగో మహాసభలను జయప్రదం చేయాలని జిల్లా ఉపాధ్యక్షులు వి రాజేష్ అన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని విద్యార్థులతో కలిసి ఎస్ఎఫ్ఐ నాయకులు వాల్ పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షులు వి రాజేష్ మాట్లాడుతూ ఈనెల 14, 15 ,16 తేదీల్లో కరీంనగర్ లోని రేకుర్తి లో శుభం గార్డెన్స్ లో ఈ మహాసభ లు నిర్వహిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు,ఎస్ఎఫ్ఐ నాయకులు శ్రీకాంత్ ,వెంకటేష్, నరేష్, తదితరులు పాల్గొన్నారు.
కందనూలు: నాగర్ కర్నూల్ పట్టణ కేంద్రంలో ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర 4 వ, మహాసభలను జయప్రదం చేయాలని మహాసభ వాల్ పోస్టర్స్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లిఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం తారా సింగ్ మాట్లాడుతూ 2022 సెప్టెంబర్ 14,15,16 తేదీలలో కరీంనగర్ జిల్లా కేంద్రంలో మహాసభలు నిర్వహించనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు గణేష్ నాయకులు అభిలాష్ బన్నీ, శివ, కార్తీక్ వంశీ ,వినరు తదితరులు పాల్గొన్నారు.