Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాగంటి వెంకటయ్య
నవతెలంగాణ- మహబూబ్‌నగర్ కలెక్టరేట్
గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని గ్రామ పంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాగంటి వెంకటయ్య డిమాండ్ చేశారు. సోమ వారం భూత్పూర్ మండల కేంద్రంలో తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా మహాసభలు నిర్వహించారు. ఈ సభలకు ముఖ్య అతిథులుగా వెంకటయ్య, సిఐటియు రాష్ట్ర నాయకులు భూపాల్, కిల్లెగోపాల్, జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి ముఖ్య అతిథులుగా హాజరయ్యరు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీవో నెంబర్ నాలుగు ప్రకారంగా కనీస వేతనాలు చెల్లించాలని, 8 గంటల పనిని అమలుచేయాలని, వారాంతపు , పండుగ సెలవులు ఇవ్వాలని, సర్పంచులు పంచాయతీ సెక్రటరీలు, రాజకీయ నాయకుల కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని, గుర్తింపు కార్డులు, మహిళా కార్మికులకు ప్రత్యేక సౌకర్యాలు, సంవత్సరానికి రెండు జతల డ్రస్సులు, పనిముట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జడ్చర్ల మండలం ఆలూరు గ్రామంలో విధుల్లో ప్రమాదానికి గురై చనిపోయిన కష్ణయ్య కుటుంబానికి రూ.50 లక్షల రూపాయలు, దళిత బంధు పథకం, డబల్ బెడ్ రూమ్ ఇల్లు, భార్యకు ఉద్యోగం ఇవ్వాలని తీర్మానాలు చేశారు. మహాసభల ఆహ్వాన సంఘం నాయకులు స్థానిక మున్సిపల్ చైర్మన్ బస్వరాజ్‌గౌడ్, టిఆర్ఎస్ నాయ కులు మురళీధర్ గౌడ్ మాట్లాడుతూ కార్మికుల పోరాటాలను సమర్థిస్తూ వారి జీతాలు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామ పంచాయతీ వర్కర్స్ నూతన కమిటీని ఎన్నుకున్నారు. గౌరవాధ్య క్షులుగా వి.కురుమూర్తి, అధ్యక్షులుగా నల్లవెల్లి కురు మూర్తి, ప్రధాన కార్యదర్శిగా వెంకటేష్‌గౌడ్, సహా య కార్యదర్శిగా నారాయణ, మైబు, ఉపాధ్యక్షు లు గా రాజు, శేఖర్, ఆంజనేయులు, చంద్రమ్మ తో పా టు 35 మంది కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు. కార్యక్రమలో పంచాయతీ కార్మికు లు పాల్గొన్నారు.