Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కనీస వేతనాలు రూ.26 వేలు చెల్లించాలి
- సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భాస్కర్
నవతెలంగాణ- కందనూలు
గ్రామ పంచాయతీ కార్మికులకు ఉద్యోగ భధ్రత కల్పించి, కనీస వేతనం రూ. 26 వేలు చెల్లిం చాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధానకార్యదర్శి పాలడుగు భాస్కర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం నాగర్‌కర్నూలు జిల్లా కేంద్రంలోని బాబు జగ్జీవన్‌రామ్ భవన్లో గ్రామ పంచాయతీ కార్మికులతో సమావేశం నిర్వహించారు. అనంతరం సీఐటీయూ ఆధ్వర్యంలో జీపీ కార్మికులు ర్యాలీగా కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని ధర్నా నిర్వహిం చి జాయింట్ కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ రాష్ట్రంలో వివిధ శాఖలు సంస్థలు కార్పొరేషన్లలో పనిచేస్తున్న పర్మినెంట్ ఉద్యోగులతో పాటు కాంటాక్ట్ అవుట్సోర్సింగ్ మరియు మిగతా శాఖల్లో పని చేస్తు న్న వారికి వేతనాలు పెంచుతూ ప్రభుత్వం జీవో నెంబర్ 64 జారీ చేసింది కానీ గ్రామపంచాయతీ సిబ్బంది వేతనాలపై ఎలాంటి నిర్ణయం తీసుకో లేదన్నారు. ప్రభుత్వం పునరాలోచించి గ్రామపంచా యతీ లో పనిచేస్తున్న సిబ్బంది కూడా రూ.26000 వేతనం అమలు చేయాలని, మల్టీపర్పస్ విధానాన్ని రద్ద చేయాలని డిమాండ్ చేశారు. కరోనా విపత్తులో తమ ప్రాణాలు సైతం లెక్కచేయకుండా ప్రజా రోగ్యం కోసం పనిచేసిన గ్రామపంచాయతీ సిబ్బం దికి పర్మినెంట్ చేయాలని, కారోబార్ బిల్ కలెక్టర్‌కు ప్రత్యేక స్టేటస్ ఇవ్వాలని, ఈఎస్ఐ, పీఎఫ్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రమాదంలో మర ణించిన కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని 8 గంటల పని దినాన్ని అమలు చేయా లని, ఆదివారం, పండుగ సెలవులు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాగంటి వెంకటయ్య, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి సుధాకర్ , సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.శ్రీనివాసులు జిల్లా ఉపా ధ్యక్షులు వర్ధం పర్వతాలు,పొదిల రామయ్య, మల్లేష్, అశోక్, శివరాములు, గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్లు మహేష్, మల్లేష్, లింగస్వామి, చిట్టమ్మ, రాములు, పార్వత మ్మ, సుల్తాన్, నరసమ్మ తదితరులు పాల్గొన్నారు.