Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ధరూర్
జోగులంబగద్వాల జిల్లాలో బతుకుదెరువు కోసం వీధి వ్యాపారాలు చేస్తున్న వారికి భారత్ ఆత్మ నిర్భర్‌లో భాగంగా ప్రధానమంత్రి స్వనిధి పథకం కింద ఇచ్చే రుణ పరిమితిని రూ.50 వేలకు పెంచు తూ ఉత్తర్వులు జారీ చేసింది. మొదటి విడతలో రూ.10 వేల రుణం తీసుకొని సక్రమంగా చెల్లించిన వారికి రూ.20 వేలు, రెండవ విడతలో రూ.20 వేల రుణం తీసుకొని సక్రమంగా చెల్లించిన వారికి రూ.50 వేల రుణం పొందేందుకు అవకాశం కల్పిం చింది. జిల్లాలో 5,820 మంది వీధి వ్యాపారులు ఉన్నారు.మొదటి విడతలో 3,990 మందికిరుణం కరోనా, లాక్డౌన్ సమయంలో వీధి వ్యాపారులు దయనీయ పరిస్థితిని ఎదుర్కొన్నారు. వ్యాపారాలు లేక అల్లాడిపోయారు. కరోనా తగ్గుమొఖం పట్టినా వీరి పరిస్థితి మెరుగు పడలేదు. చేతిలో చిల్లిగవ్వ లేకుండా అప్పుల కోసం అల్లాడుతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పీఎం స్వనిథి పథకాన్ని ప్రవేశ పెట్టింది. పట్టణ పేదరిక నిర్మూలన శాఖ (మెప్మా) ఆధ్వర్యంలో వీధి వ్యాపారులపై సర్వే నిర్వ హించింది. జిల్లాలోని గద్వాల, అయిజ, అలంపూర్, వడ్డేపల్లి మునిసి పాలిటీల్లో 5,820 మంది వీధి వ్యాపారులను గుర్తించి, గుర్తింపు కార్డులను ఇచ్చింది. అందులో మొదట విడతగా 3,990 మం దికి రూ.10 వేల రుణం బ్యాంకుల ద్వారా ఇప్పిం చారు. సక్రమంగా అప్పు చెల్లించిన వారు రెండవ విడత రూ.20 వేల రుణం పొందేందుకు అర్హత పొందుతారు. అయితే ఇప్పటి వరకు 1,188 మంది అర్హత సాధించగా, వారికి రూ.20 వేల రుణం బ్యాంకుల ద్వారా ఇప్పించారు. వారిలోనూ సక్రమంగా అప్పు చెల్లించిన వారు రూ.50 వేల రుణం పొందేందుకు అర్హత సాదిస్తారు. ఇప్పటికే చా లా మంది అర్హత సాధించారు. వారికి ఇప్పుడిప్పుడే రుణాలు అందిస్తున్నారు. రూ.6.36 కోట్ల రుణాలు జిల్లాలోని నాలుగు మునిసిపాలిటీల్లో మొదటి విడతలో రుణం పొందిన వారు 3,990 మంది ఉండగా, బ్యాంకులు వారికి రూ.3.99 కోట్ల రుణా లు ఇచ్చాయి. రెండవ విడతలో 1,188 మంది అర్హత సాధించగా వారికి రూ.2.37 కోట్ల రుణాలు అందించాయి. ఈ రుణాలు తీసుకున్న వారు అప్పు లు సక్రమంగా చెల్లిస్తున్నారు. వ్యాపార లావాదేవీల్లో చిల్లర సమస్య లేకుండా వారికి ఆన్లైన్ చెల్లింపులు చేసేలా పోన్‌పే, గూగుల్ పే, పేటీఎం వంటి వాటితో అగ్రిమెంటు చేసుకొని క్యూఆర్ కోడ్లను ఇచ్చారు. రుణాలు సక్రమంగా చెల్లించిన వారికి కొత్తగా రూ.50 వేలు రుణం ఇచ్చేందుకు అధికా రులు సిద్ధం అయ్యారు.కొందరు సద్వినియోగం చేసుకోలేక. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోలేక పోయిన వీధి వ్యాపారులు ఇప్పుడు బాధ పడు తున్నారు. దాదాపు 30 శాతం మంది అంటే 1,300 మంది వరకు తీసుకున్న రూ.10 వేల రుణాన్ని బ్యాంకులకు సక్రమంగా చెల్లించ లేకపోయారు. దీంతో వాళ్లు నాన్ ఫర్మార్మెన్స్ అకౌంట్ లోకి పోయా రు. వారికి అవగాహన కల్పించడంతో దాదాపు 350 మంది తిరిగి చెల్లించారు. దీంతో వారు రూ.20 వేల రుణం పొందేందుకు అర్హత సాధిం చారు. మిగిలిన వారి నుంచి రికవరీ చేసేందుకు మె ప్మా, బ్యాంకు సిబ్బంది సిద్ధమయ్యారు.