Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కందనూలు : ప్రభుత్వ విద్యారంగ ఉపాధ్యా యుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యుఎస్పీసి) ఆధ్వర్యంలో సెప్టెంబర్ 13 న తలపెట్టిన ''ఛలో అసెంబ్లీ'' కార్యక్రమంలో ఉపాధ్యాయులను అరెస్టులు చేయడం అప్రజాస్వామికమని ఉపా ధ్యాయ సంఘాల పోరాట కమిటీ యుఎస్పీసి నాగర్ కర్నూల్ జిల్లా స్టీరింగ్ కమిటీ ఖండించింది. ఆమేరకు స్టీరింగ్ కమిటీ నాయకులు పి.వహీద్ ఖాన్, యం.శ్రీధర్ శర్మ (టియస్ యుటిఎఫ్) జె.రామస్వామి, కె.లక్ష్మణ్ (డిటిఎఫ్) సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. గత ఏడేళ్లుగా పదోన్నతులు లేక నాలుగేళ్లుగా బదిలీలు లేక ప్రభుత్వ విద్యారంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని కనుక దసరా సెలవుల్లో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల నిర్వహణకు షెడ్యూల్ విడుదల చేయాలని కోరుతూ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ యుఎస్పీసి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 11 నుండి తలపెట్టిన నిరాహార దీక్షలకు ప్రభుత్వం, పోలీసుల అనుమతి నీయకపోగా అనివార్యంగా ఉపాధ్యాయుల ప్రభుత్వ విద్యారంగ సమస్యలను ప్రభుత్వం దష్టికి తీసుకు పోవడానికి సెప్టెంబర్ 13 న ''ఛలో అసెంబ్లీ'' కార్యక్రమాన్ని తలపెట్టామని అయితే దీనిని అడ్డుకో వడానికి ప్రభుత్వం పోలీసు శాఖ ద్వారా నిన్న ఉదయం నుండే పలువురు యుఎస్పీసి నాయకులను ఉపాధ్యాయులను ముందస్తుగా అరెస్టులు చేసిందని అయి నప్పటికీ తీవ్ర నిర్బంధాన్ని దాటుకుని వేల మంది ఉపాధ్యాయులు హైదరాబాద్ చేరుకుని తమ శాంతియుత నిరసనను చేపడితే అరెస్టు చేయడం పోలీసు స్టేషన్లలో నిర్భందించడం సహేతుకం కాదని విమర్శించారు. ఇప్పటికైనా ఉపాధ్యాయుల తీవ్ర అసంతప్తిని, విద్యారంగ సంక్షోభాన్ని గుర్తించి దసరా సెలవుల్లో బదిలీలు ప్రమోషన్ల షెడ్యూల్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.