Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- అమరచింత
లబ్ధిదారులు చేపట్టిన గుడిసెల కార్యక్రమాని ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం నశిం చాలని సీపీఐ(ఎం) పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జాన్ వెస్లీ అన్నారు. మంగళవారం అమరచింత మున్సిపాలిటీ కేంద్రంలోని ధూమ్ పాయి కుంటలో జరుగుతున్న భూ పోరాటానికి ఆయన సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ మాట్లా డుతూ. ధూమ్ పాయి కుంటలో సీపీఐ(ఎం) పోరాట ఫలితంగా 1997 లో సర్వే నెంబర ్586,587 లో గల 14.37 ఎకరాల గుంటల భూమిలో 400 అర్హులైన లబ్ధిదారులకు రెండు సెంట్లు ఫ్లాట్ లను ఇవ్వడం ఫ్లాట్ లను ఇవ్వడం జరిగిందన్నారు. అయితే ప్లాట్లు ఇచ్చి 25సం వత్సరాలు గడుస్తున్న ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ లబ్ధిదారులకు పొజిషన్ పొజిషన్ హద్దు పత్రాలు ఎంత వరకు ఇవ్వక పోవడం దుర్మార్గమైన చర్యగా భావిస్తున్నామన్నారు. ప్రభుత్వాలు మారినా అధికారులు మారిన ఈ సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదని అందుకోసమే గత వారం రోజులుగా సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో గుడిసెలు వేసుకున్నామని తెలిపారు. భూ పోరాటం చేస్తున్న లబ్ధిదారుల దగ్గరికి తహసీల్దార్ సింధుజ వచ్చి ఒక నెలలో మీ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం కూడా జరిగిందని అయినప్పటికీ ప్రభుత్వ అధికారుల పై నమ్మకం లేక లబ్ధిదారులు అదేవిధంగా గుడిసెల ప్రోగ్రాం పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగు తుందని గత వారం రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క అధికారి కూడా ఈ సమస్యను పరిష్కరించడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద ప్రజలంటే ఏమనుకుంటున్నారు పెద్దల పట్ల నిర్లక్ష్య ధోరణి వీడాలని పేదల సమస్యలను పరిష్కరించే దిశలో పరిపాలన కొనసాగించాలని కానీ అన్ని పక్కన పెట్టి భూస్వా ములకు పెత్తందార్లకు ప్రైవేటు కార్పొరేటు సంస్థల యజమానులకు కొమ్ము కాస్తూ పేదల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని ఆయన మండిపడ్డారు. తక్షణమే అది కారులు స్పందించి భూమిని సర్వే చేయించి పొజిషన్ హద్దులు చూపించాలని ఆయన డిమాండ్ చేశారు. హద్దులు చూపి ంచేంత వరకు ఈ భూ పోరాటం ఆగే ప్రసక్తే లేదని ఆయన అన్నారు.లేనిపక్షంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో వివిధ రూపాలలో పోరాటాలను ఉద్ధతం చేస్తామని ప్రభుత్వానికి ఆయన హెచ్చరించారు.కార్యక్రమంలో సీపీఐ(ఎం) పార్టీ మండల కార్యదర్శి, మున్సిపల్ వైస్ చైర్మన్ జిఎస్ గోపి, మండల నాయకులు ఆర్యన్ రమేష్, బి వెంకటేష్, ఎస్ అజరు, కాకి శ్రీను, విజరు, తిరుమలేష్ ,రమేష్, లక్ష్మణ్ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.