Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీడీఎస్యూ ఆధ్వర్యంలో విద్యార్థుల ధర్నా
నవతెలంగాణ- గట్టు
మండల కేంద్రంలోని కేజీవీబీ ఎస్ఓని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని పీడీఎస్యూ జిల్లా అధ్య క్షుడు హలీం పాష డిమాండ్ చేశాడు. మంగళవారం ఎస్ఓ గోపిలతను విధుల్లోకి తీసుకోవాలంటూ పీడీ ఎస్యూ ఆధ్వర్యంలో విద్యార్థినులు ఆందోళన చేప ట్టారు. ఈ సందర్భంగా హలీంపాష మాట్లాడుతూ ఇటీవల ప్రభుత్వం మోడల్ స్కూల్ హాస్టల్ నిర్వాణ బాధ్యతలు ఎస్ఓలకు అప్పజెప్పుతూ ఉత్తర్వులు జారీ చేయడంతో తమకు అదనపు భారం అవు తందని ఎస్ఓ గోపిలత అనడంతో ఆమెను విధు ల నుంచి తొలగించడం సరికాదన్నారు. తెలంగా ణ ప్రభుత్వం కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల మీద ఇలాంటి చర్యలు పాల్పడడం విరమించుకోవా లని డిమాండ్ చేశారు. ఎస్ఓను మళ్లీ విధుల్లోకి తీసుకు నేంతవరకుపోరాటాలు చేస్తామని హెచ్చరిం చారు. విద్యార్థినులు మాట్లాడుతూ మా ఎస్ఓను మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకు న్నారు. ఈ కార్యక్రమములో పీడీఎస్యూ నాయ కులు శివకుమార్, విష్ణు, వీరేష్, జయంత్, వీరేష్, నవీన్, వెంకటేష్ బీమేష్, నారాయణ, నరేష్, ఎమ్మా ర్పీఎస్ సీనియర్ నాయకులు ఏలియా, ఎంఎస్ఎఫ్ మండల అధ్యక్షుడు డేవిడ్ తదితరులు పాల్గొన్నారు.