Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) గద్వాల జిల్లా కార్యదర్శి వెంకటస్వామి
- ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు
నవతెలంగాణ- అలంపూర్
వీర తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను నేటి పాలకులు వక్రీకరిస్తున్నారని సీపీఐ(ఎం)జోగులాంబ గద్వా ల జిల్లా కార్యదర్శి వెంకటస్వామి ఆన్నారు. తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా గురువారం సీపీఎం నాయకులు ఆలంపూర్ పట్టణంలో చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వెంకటస్వామి జండా ఊపి బైక్ ర్యాలీనీ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఓట్ల, సీట్ల కోసం చరిత్రను వక్రీకరిస్తే చరిత్రకు చెదలు పట్టదన్నారు. గడీిల పాలన అంతం కావా లని, వెట్టిచాకిరి పోవాలని, బలహీన వర్గాలతో బందూకు లు పట్టించి కమ్యూనిస్టుల న్యాయ కత్వంలో 1946 నుండి 1951వరకు వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరిగిందని గుర్తు చేశారు. అలాంటి చరిత్రను బీజేపీ నాయ కులు విమోచన పేరుతో వక్రీకరిస్తున్నారన్నారు. వీర తెలం గాణ సాయుధ పోరాటానికి కమ్యూనిస్టులు నిజమైన వార సులన్నారు. ఆలంపూర్ పట్టణంలో ప్రారంభమైన బైక్ ర్యాలీ క్యాతూర్, లింగనవాయి గ్రామాల మీదుగా ఉండవల్లి మండల కేంద్రానికి చేరుకుంది. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీి సభ్యులు రాజు, రేపల్లె దేవదాసు, ఈదన్న అలంపూర్ మండలం కార్యదర్శి నరసింహ, నాయకులు రఫీ, నజీర్, వెంకటేష్, సోమశేఖర్, రాముడు, భీచుపల్లి, మంద భాస్కర్, నాగేష్, మద్దిలేటి, శ్రీను, రాము, వెంకటేష్, అశో టక్, సుధాకర్, రామాంజనేయులు పాల్గొన్నారు.
ఉండవెల్లి: మండల కేంద్రంతో పాటు కంచుపాడు, తక్కశిల, మునగాల తదితర గ్రామాల్లో బైక్ ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కమిటీ సభ్యు లు రాజు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ సాయుధ పోరాటాన్ని వక్రీకరించి ప్రచారం చేయడం తగదన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకే ర్యాలీ నిర్వహిస్తున్నా మన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం కమిటీ సభ్యులు వెంకటేశ్వర్లు, ఈదన్న, నరసింహ, మద్దిలేటి, రఫీ తదితరు లు పాల్గొన్నారు.
కందనూలు: బీజేపీ నాయకులు తెలంగాణ సాయుధ పోరాటాన్ని వక్రీకరిస్తూ విలీనం పేరుతో తెలంగాణ ప్రజల పై కపట ప్రేమ చూపిస్తోందని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు కందికొండ గీత అన్నారు. నాగర్కర్నూల్ మండలం మంతటి గ్రామంలో గురువారం వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విమోచన దినం నిర్వహించాలని రాద్ధాంతం చేస్తున్న బీజేపీ హిందూ ముస్లింల మధ్య కొట్లాటగా సాయుధ రైతాంగ పోరాటాన్ని చిత్రీకరించే ప్రయత్నం చేస్తోందన్నారు. బిజెపి నాయకులు టీవీ డిబేట్లో మాట్లాడుతూ సాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్యను కించపరుస్తూ వారి పోరాటాన్ని ఒక గ్రామం లో నిర్వహించిన పోరాటంగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం ఆక్షేపనీయమన్నారు. భూమి కోసం భుక్తి కోసం జరిగిన సాయుధ రైతంగా పోరాటానికి కమ్యూనిస్టులే నిజ మైన వారసులన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బిజెపి చేస్తున్న కుయుక్తులను ప్రజలు గమనించాలన్నారు. గవర్నర్ కూడా విమోచన దినమే నిర్వహించాలని చెప్పడం దుర్మార్గమని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి అశోక్, నాయకులు తిరుపతయ్య, బాలరాజు, వెంకటయ్య , నిరంజన్, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
అమరచింత: తెలంగాణ సాయుధ పోరాట వారోత్స వాల్లో భాగంగా మండల పరిధిలోని పామి రెడ్డిపల్లి గ్రామం లో బుధవారం రాత్రి సీపీఎం మండల కమిటీ ఆధ్వర్యంలో అమర వీరులకు కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. ఈ సందర్బంగా పార్టీ మండల నాయకులు బి.వెంకటేష్ మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించా లని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయ కులు శంకర్, మోహన్, నరసింహ రాజు, మల్లేష్, రఘు తదితరులు పాల్గొన్నారు.
కొల్లాపూర్ రూరల్: తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ పాత్ర శూన్యమని సీపీఎం మండల కార్యదర్శి బి.శివవర్మ అన్నారు. గురువారం కొల్లాపూర్ పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో జెండా ఊపి బైక్ ర్యాలీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ర్యాలీ కొల్లాపూర్ మండలంలో అన్ని గ్రామాల్లో సాయుధ రైతంగ పోరాట అసలైన వారసులు కమ్యూనిస్టులే అని ప్రజలకు తెలియజేస్తూ, చైతన్య పరుస్తూ ఈ ర్యాలీ కొనసాగుతుందన్నారు. సంబంధంలేని బిజెపి విమోచన దినం, టిఆర్ఎస్ సమైక్య దినం నిర్వహి స్తామంటూ ప్రకటించుకోవడం సిగ్గుచేటన్నారు. విలీన విమోచన దినాల పేరుతో రాష్ట్రంలో ప్రజల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ప్రజల సమస్యల్ని పక్కదోవ పట్టించేందుకే బిజెపి టిఆర్ఎస్ అడుతున్న నాటకాన్ని ప్రజలు గమనించాల్సిన అవసరం ఉందని అన్నారు. వీర తెలంగాణ పోరాట స్ఫూర్తితో తెలం గాణ అభివద్ధి కోసం ఉద్యమిస్తామని అన్నారు ఈ కార్యక్ర మంలో సిపిఎంమండల కమిటీ సభ్యులు బాలపీరు, సలీం, కిరణ్ కుమార్, పుట్టపోగు రాజు, రాముడు, సురేష్, బత్తిని రాజు, సమీవుల సంజీవ్, రవికుమార్, సతీష్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
వంగూరు: మండలంలో సీపీఎం ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ జాజాల, పోతారెడ్డిపల్లి, రంగా పూర్, పోల్కంపల్లి, చౌదర్పల్లి, మాచినపల్లి, వెంకటాపూర్ నుండి వంగూరు మీదగా కల్వకుర్తి వరకు కొనసాగింది. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు చింత ఆంజనేయులు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం భూమికోసం భుక్తి కోసం పీడి త జన విముక్తి కోసం జరిగిన ఉద్యమం అని ఉద్యమానికి కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం వహించిందన్నారు. బిజెపి, దాని మాత సంస్థ ఆర్ఎస్ఎస్కు ఈ పోరాటంతో ఏమాత్రం సంబంధం లేదన్నారు. విమోచన పేరుతో ప్రజ ల మధ్య మత కల్లోలాలు సష్టిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య, షేక్ బందగీ, ఆరుట్ల కమలాదేవి వంటి సామా న్య ప్రజలు కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో చైతన్యవంతమై నిజాం నియంతత్వాన్ని, స్థానిక భూస్వాముల అరాచకా లను అంతం చేయటానికి పోరాడారన్నారు. ఈ కార్యక్ర మంలో మండల కార్యదర్శి బాలస్వామి, మండల నాయ కులు అశోక్, సురేష్, సత్యనారాయణ, లక్ష్మయ్య శ్రీను రామస్వామి సురేషు భాను రామకష్ణ బాల నారాయణ తదితరులు పాల్గొన్నారు.
జడ్చర్ల: పట్టణంలో సీపీఐ మండల సమితి ఆధ్వర్యం లో వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం వారోత్స వాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్య దర్శి బాలకష్ణ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరా టంలో సంబంధం లేని బీజేపీ, టీఆర్ఎస్ మజ్లిస్ పార్టీలు చరిత్రను వక్రీకరిస్తూ రాజకీయ లబ్ధి కోసం ఆరాట పడు తున్నాయని ప్రజలు తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉం దన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి బా గి కష్ణయాదవ్ , రాష్ట్ర సహాయ కార్యదర్శి రాజు, రాజు, భాను, ఈశ్వర్, సతీష్, ప్రకాష్, శ్రీను పాల్గొన్నారు.