Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ధరూర్: మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు మరువ లేనివని గద్వాల జడ్పీ చైర్పర్సన్ సరితా తిరుపతయ్య అన్నారు. గద్వాల జిల్లా కేంద్రంలోని విశ్వేశ్వరయ్య మెమోరియల్ హై స్కూల్లో గురువారం విశ్వేశ్వరయ్య జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై విశ్వేశ్వరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులఅర్పించి పాఠశాలలో ఏర్పాటు చేసిన చిల్డ్రన్ పార్కును ప్రారంభిచి మాట్లాడుతూ మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ప్రపంచం, దేశంలోని ఇంజనీర్లు అందరూ ఆయన సేవలను స్మరించుకుంటారన్నారు. భారతరత్న బిరుదు పొందిన ఏకైక ఇంజనీర్ విశ్వేశ్వరయ్య అన్నారు. బ్రిటిష్ కాలంలో వేసిన తిరుమల ఘాట్ రోడ్డు ఇప్పటికీ వినియోగంలో ఉందంటే అది విశ్వేశ్వరయ్య ఘనతేనన్నారు. ఆయన ఒక్క ఇంజనీరింగ్ విభాగానికే పరిమితం కాకుండా అనేక రంగాల్లో తనదైన ముద్ర వేసిన వ్యక్తి మోక్షగుండం విశ్వేశ్వరయ్య అన్నారు. ప్రతి ఇంజనీర్ ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ రాధాకష్ణ, వైస్ చైర్మన్ తిమ్మారెడ్డి, ప్రిన్సిపాల్ భారతి, వైస్ ప్రిన్సిపాల్ రాఘవేంద్ర , ఉపాధ్యాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.