Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఎం జిల్లా కార్యదర్శి ఏవెంకటస్వామి
నవతెలంగాణ- గట్టు
అర్హులందరికీ ఇండ్ల స్థలాలు ఇవ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఏవెంకటస్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలోని గొర్లఖాన్దొడ్డి ఆరగిద్ద, ఆలూరు గ్రామానికి చెందిన దళితులు ఇండ్ల స్థలాలు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలంటూ గురువారం సీపీఎం ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట స్వామి మాట్లాడుతూ దేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలైన పేద ప్రజలు కూడు ,గూడు, గుడ్డ కొరకు అడుక్కునే పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రజలు ఓట్లతో గద్దెనెక్కి వారి సమస్యలు పట్టించుకోకుండా ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అర్హులైన వారి కి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇస్తామని చెప్పి ఇప్పటివరకు ఇవ్వలేద న్నారు. ఒక ఇంటిలో మూడు నాలుగు కుటుంబలు నివాసం ఉంటున్నా యన్నారు. ఇంటి స్థలాల కోసం దరఖాస్తు చేసుకున్న అర్హులైన ప్రతి ఒక్కరికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా నాయకు లు వివి నరసింహ, నర్మదా, మండల కార్యదర్శి ఆంజనేయులు, కమిటీ సభ్యులు బద్రి నారాయణ, ఉరుకుందు, నరసింహ, ఏసన్న, రెడ్డప్ప మరియ మ్మ తదితరులు పాల్గొన్నారు.