Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- మక్తల్
మండల పరిధిలోని భూత్పుర్ రిజర్వాయలో గురువారం ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి చేపపిల్లలను వదిలారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో మత్స్యకారులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. ప్రభుత్వం ప్రతి ఏటా వంద శాతం సబ్సిడీతో ఉచి తంగా చేప పిల్లలను సరఫరా చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్య శాఖ అధికారిని సుజాత, టీఆర్ఎస్ నాయకులు కాట్రపల్లి అంజయ్య, అనంద్, శేేఖర్, రాయప్ప, మైపాల్ రెడ్డి, నేతాజీరెడ్డి, నరసింహనాయుడు భూత్పూరు గ్రామ నాయకులు పాల్గొన్నారు.