Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహబూబ్‌నగర్ ప్రాంతీయప్రతినిధి :
అప్పంపల్లి ఘటనను వక్రీకరించడాన్ని ప్రతి ఒక్కరు ఖండించాలని సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు కిల్లెగోపాల్, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎ. రాములు, సీపీఐ జిల్లా కార్యదర్శి బాల్కిషన్ పిలుపునిచ్చారు. గురువారం అప్పంపల్లి ఘటనలో అమరులైన వారి కుటుంబాలను పర మార్శించి, ఘటన ప్రాంతాన్ని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎ. రాములు, సీపీఐ జిల్లా కార్యదర్శి బాలకిషన్, రాజు, సీపీఐ(ఎం) జిల్లా నాయకులు వేణుగోపాల్ పరిశీలించారు. అనంతరం అప్పంపల్లి రాగిచెట్టు దగ్గర సభ నిర్వహించి గ్రామ అమర వీరులకు ఘనంగా నివాళ్లు అర్పించారు.ఈసందర్బంగా వారు మాట్లా డుతూ మహబూబ్‌నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం అప్పంపల్లిలో 1947 అక్టోబర్ 7న నాటి రజాకర్లు చేసిన దాడిలో 11మంది అమరులయ్యారని గుర్తుచేశారు. . భారత దేశానికి 1947 ఆగస్టు 15న స్వతంత్య్రం వచ్చినా... తెలంగాణ జిల్లాలో నిజాం నిరంకుశ పాలనలో ఉండేవి. భారత దేశంలో విలీనం కోసం చైతన్యవంతమైన యువకులు ఎక్కడికక్కడ పోరాటాలు చేశారు. అనాటి నల్లగొండ ఖమ్మం, కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట, నాగర్ కర్నూల్ కల్వకుర్తి ప్రాంతాలలో కమ్యూనిస్టు దళాలు నిజాం పాలనపై విరోచిత పోరాటాలు జరుగుతున్న కాలం. దాని ప్రభావం ఇక్కడి యువత ఉత్తేజం పొందు తారని ఈ ప్రాంతం దోరలు, భూస్వాములు, ముక్తాదారులు నైజాం రజాకార్ల సహకారంతో ఎదురుతిరిగి యువకు లపై దాడులు చేయించారు. అమ్మా పురం సంస్థానం రజా కర్లను ఆహ్వ నించింది. రజాకర్లదళం నెల్లికొండ కిష్టారెడ్డి బెల్లనాగన్న లాంటి యువనేతలను లక్ష్యంగా తీసుకున్నారు. నెల్లికొండ కిష్టారెడ్డిని మటు ్టపెట్టడానికి అప్పంపల్లిలో పరమాల శేఖర్‌రెడ్డి ఇంట్లో గడిలో రక్షణ పొందారని తెలిపారు. ఈవిషయం గ్రహించిన అప్పంపల్లి యువకులు కారంపొడి గుతుపలతో గుడిదగ్గరకు చేరారు. గుడికి ఎండుకంప వేసి మంటబెట్టే ప్రయత్నం చేశారు. బయపడిన రజాకర్లు యువకులపై విచ్చలవిడిగా కాల్పులు చేశారు. ఈకాల్పుల్లో 11మంది చనిపోయారు. చనిపోయిన వారిలో తంగడి రాంరెడ్డి, తంగడి లక్ష్మారెడ్డి, తంగడి బాల్‌రెడ్డి, చాకలి కొమరన్న, పోతుల ఈశ్వరయ్య, కటికె నర్సమ్మ, హరిజన్ కిష్టన్న, హరిజన్ తిమ్మన్న, గొల్లగజ్జలన్న వడ్డెమాన్ నర్సన్న, కురుమ నాగన్న ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు. ఈ సంఘటన హిందూ ముస్లీం ఘర్షనగా చిత్రీకరించి కొన్ని పార్టీలు కొందరు వ్యక్తులు బాద్యతా రహితంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. బెల్లం నాగన్న కుమారుడు అంజనేయులు గ్రామ పెద్దలు కలసి బీజేపీ చేస్తున్న వక్రీకరణ దుష్పచారాన్ని ఖండిస్తూ.. అప్పంపల్లి గ్రామ అమర వీరులకు నివాళ్లు అర్పించారు.