Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జాతీయ రహదారులు, ముఖ్యపట్టణాలలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల విషయంలో ట్రాఫిక్ అధికారులు ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదు. ముఖ్యంగా హైబీమ్ పోగస్ లైట్ల వల్ల అనేక వాహనాలు ప్రమాదాలకు గురౌతున్నాయి. గతంలో బైక్ అద్దాలకు పైభాగాన నల్లటి రంగు పూసేవారు. దీంతో వెలుతురు కిందికి పడి ఎదురుగా వస్తున్న వాహనదారిడికి ఏమాత్రం ఇబ్బంది కలిగేది కాదు. ఇప్పుడు ద్విచక్రవాహనాలకు రెండు బల్భులు అమర్చుతున్నారు. దీంతో సమీపంలోని వాహనాన్ని గుర్తించడానికి దూరంలో ఉన్న వాటిని గుర్తించడానికి రెండు బల్భులుంటాయి. హైబీమ్ ఉపయోగించడం వల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయని పలువురు ఆరోపించారు
- హైబీమ్ లైట్లతో పెరుగుతున్న ప్రమాదాలు
- మోటారు వాహన చట్టం 177కి తిలోదకాలు
- నియంత్రించని ట్రాపిక్ అధికారులు
- గాలిలో కలుస్తున్న ప్రాణాలు
నవతెలంగాణ-మహబూబ్నగర్ ప్రాంతీయప్రతినిధి
రోడ్డుపై ఒకటి దగ్గరగా వెలుతురు పడుతోంది. మరోటి దూరంగా వెలుతు పడుతుంది.కొన్ని సార్లు అయితే వాహనం నిలిపేసే అవకాశాలు ఉంటాయి. రాత్రి పూట జరిగే ప్రమాదాలు 90 శాతం హైబీమ్ లైట్లతోనే జరుగు తాయని అధికారులే చెబుతున్నారు. గతేడాది కాలంగా జరిగిన ప్రమాదంలో హైబీమ్ వల్లనే జరిగాయని రికార్డులే చెబుతున్నాయి. జనవరి నుండి ఇప్పటి వరకు నాగర్ కర్నూల్ జిల్లాలో 75 బైక్ ప్రమాదాలు జరిగాయి. ఇందులో రాత్రి పూట హైబీమ్తో చనిపోయిన వారే అధికంగా ఉన్నారు. గద్వాల జిల్లాలో 57,వనపర్తిలో 40, మహబూ బ్నగర్లో 89, నారాయణపేటలో సుమారు 45 ప్రమా దాలు జరిగాయని అధికారుల చేప్తున్నారు. ఇందులో 120 మందికిపైగా చనిపోయారు.
స్పోర్ట్సు ద్వీచక్రవాహనాలను యువత అధికంగా నడుపుతున్నారు. అధిక వేగంతో పాటు ముందు, వెనక చక్రాలను పైకి లేపి ప్రదర్శిస్తుంటారు. నెల రోజుల క్రితం కల్వకుర్తిలో ఓ కుర్రాడు స్పోర్ట్సు వాహనం నడుపుతూ... పట్టు జారి పడి చనిపోయాడు. హైదరాబాద్లో ఓ సినిమా హారో సైతం స్పోర్ట్సు వాహనం నడిపి చనిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పటికైనా ప్రభుత్వం అతివేగంగా పోయే స్పోర్సు వాహనాలను నిలిపేయడంతో పాటు హైబీమ్ లైట్లను నియంత్రించాలని పలు స్వచ్చంద సంస్థలు కోరు తున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం యేటా రోడ్డు వారోత్సవాలు ప్రభుత్వం చేస్తోంది. రోడ్డు వారోత్సవాలలో కలెక్టర్, ఎస్సీతో ముఖ్య అధికారులు వస్తుంటారు. అనేక సూచనలు సలహాలు ఇచ్చి వాహన దారులకు చైతన్యం నింపుతారు. ఇంత జరుగుతున్న స్పోర్ట్సుతో పాటు హైబీమ్ను ఎందుకు నియంత్రించడం లేదో అధికారులే చెప్పాలి. ఇప్పటికైనా ప్రభుత్వం మోటారు వాహన చట్టం 177ను అమలు చేసి ప్రమాదాలను నివారించాలని పలువురు కోరారు.