Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వనపర్తి : ఇండ్ల స్థలాలకు పట్టాలిచ్చిన వారికి డబల్‌బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని లేదా స్థలం చూపి ఇల్లు నిర్మాణానికి లోను మంజూరు చేయా లని సీఐటీయూ జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు డిమాండ్ చేశారు. వనపర్తి పట్టణ ంలోని దళితవాడలో 21వ వార్డు, భగత్ సింగ్ నగర్‌లోని 22వ వార్డులో 12, 14 వార్డుల్లో రామ్‌నగర్, రాజనగరం వడ్డెగేరి, పీర్లగుట్ట తదితర వార్డుల ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన పుట్ట ఆంజనేయులు మాట్లాడుతూ అర్హులైన పేదలకు వద్ధులు, వితంతువులు, వికలాంగులకు, 57 దాటిన వాళ్ళందరికీ కూడా పింఛన్లు ఇవ్వాలన్నారు. పెళ్లిళ్లైనా కుటుంబాలలో అందరికీ రేషన్ కార్డులు ఇవ్వా లన్నారు. తదితర సమస్యలతో పాటు అరులైన పేదలందరికీ ఇళ్లస్థలాలు ఇవ్వాలన్నారు. ఈ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈనెల 20న తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించనున్నట్టు తెలిపారు.తర్వాత తహసీల్దార్, మంత్రి నిరంజన్ రెడ్డికి, జిల్లా కలెక్టర్‌కి కూడా వివతిపత్రం ఇవ్వనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎం. రాజు, జిల్లా సహాయ కార్యదర్శి గోపాలకృష్ణ, జిల్లా నాయకులు డి.కురుమయ్య, రాబర్ట్, ఎన్.రాములు, ఏ.రమేష్, పురుషోత్తం, తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పరమేశ్వరా చారి, ఐద్వా మహిళా సంఘం నాయకులు సాయి లీల, కేవీపీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి గంధం గట్టయ్య, తదితర ప్రజా సంఘాల నాయకులు, పాల్గొన్నారు.