Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- వనపర్తి
''తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు''ను పురష్కరించుకొని శుక్రవారం జిల్లా కేంద్రంలో ర్యాలీ చేపట్టనున్న నేపథ్యంలో మర్రికుంటలోని హౌసింగ్ బోర్డ్ గ్రౌండును అదనపు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ గురువారం పరిశీలించారు. గ్రౌండులో ర్యాలీ అనంతరం భోజనాలు వడ్డించేందుకు ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పట్టణంలో శుక్రవారం ర్యాలీ వస్తుందని రహదారిపై చెత్త వేయరాదని హెచ్చరించారు. రోడ్డుకి ఇరు వైపులా ఉన్న చెట్లను కలుపు మొక్కలను తొలగించాలన్నారు. రోడ్లను పరిశుభ్రంగా ఉంచేలా తగు చర్యలు తీసుకోవాలని సానిటరీ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా పాలిటెక్నిక్ కళాశాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మునిసిపాలిటీ అధికారులు పాల్గొన్నారు.