Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ -నారాయణపేట టౌన్
బిజెపి నాయకుడు అధికార ప్రతినిధి ప్రకాశ్ రెడ్డి తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి డిమాండ్ చేశారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ చేసిన మహత్తర పోరాటాన్ని చిట్టెలకల పోరాటమని, దొడ్డి కొమరయ్య అమరత్వాన్ని అవహేళనగా మాట్లాడిన బిజెపి అధికార ప్రతినిధి ప్రకాశ్ రెడ్డి తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి డిమాండ్ చేశారు. ప్రజా సంఘాలు, రజక సంఘం ఆధ్వర్యంలో దామరగిద్ద మండల కేంద్రం చౌరస్తాలో ప్రకాష్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి జి. వెంకటరామరెడ్డి మాట్లాడుతూ అధిష్టానం ప్రకాశ్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలపై స్పందించి పార్టీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గోపాల్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి అంజి లయ గౌడ్, సిఐటియు మండల కార్యదర్శి జోషి, రజక సంఘం మండల అధ్యక్షులు రాములు, శివకుమార్ ,రామకష్ణ, కాజా ,నర్సింలు పాల్గొన్నారు.
కందనూలు: దొడ్డి కొమరయ్య చాకలి ఐలమ్మ పోరాటాలను బీజీపీ నాయకుడు ప్రకాష్ రెడ్డి కించపరచడం దుర్మార్గమని తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతే అమిత్ షా తెలంగాణలో అడుగు పెట్టాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి జి అశోక్ డిమాండ్ చేశారు. శుక్రవారం దేశికళలో ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఛానల్లో ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ దొడ్డి కొమరయ్య చాకలి ఐలమ్మ కేవలం తమ సొంత ప్రయోజనాల కోసమే పోరాటం చేశారనే విధంగా మాట్లాడడం సిగ్గుచేటని అన్నారు. సాయిధరైతంగా పోరాటంలో ఏ ఒక్కరోజు పాల్గొనని బీజేపీ నాయకులు ఈరోజు విమోచన దినం పేర సభలు నిర్వహించడం తెలంగాణ ప్రజలను వంచించడమేనని అన్నారు హిందువులు ముస్లింలు కులాలతో భేదం లేకుండా నైజాం రాజుకు దొరలకు జాకీర్దారులకు వ్యతిరేకంగా పోరాటం చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) శాఖ నాయకులు శివ మహేందర్, గోపి, రాజు వెంకటేష్, రాము తదితరులు పాల్గొన్నారు.