Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ- పెబ్బేరు
తెలంగాణ ప్రభుత్వం నూతనంగా నిర్మిస్తున్న సచివా లయానికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరును పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చినందుకు టిఆర్ఎస్ పట్టణ మండల కమిటీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి నిరంజన్ రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. శుక్రవారం తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో క్షీరాభిషేకం చేశారు. తెలంగాణ శాసనసభ సమావేశాల్లో తీర్మానం చేయడంతో హర్షం వ్యక్తం చేశారు. పార్టీ అధ్యక్షులు వనం రాములు, దిలీప్ కుమార్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ ఎద్దుల కరుణ శ్రీ సాయి, వైస్ చైర్మన్ కర్రి స్వామి, ఎంపీపీ ఆవుల శైలజ కురుమూర్తి, జెడ్పిటిసి పెద్దింటి పద్మా వెంకటేష్, తో పాటు సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, డైరెక్టర్లు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
వనపర్తి టౌన్ : అంబేద్కర్ చౌక్ లోని నూతనంగా స్థాపన చేసిన అంబేద్కర్ విగ్రహం దగ్గర అఖిలపక్ష ఐక్యవేదిక సభ్యులు పూలమాలలు తో నివాళులర్పించారు. అనంతరం,అఖిలపక్ష ఇక్యవేదిక జిల్లా అధ్యక్షుడు సతీష్ యాదవ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ నూతన సెక్రటేరియట్ భవనానికి, రాజ్యాంగ నిర్మాత, అంబేద్కర్ పేరు పెడుతూ తీర్మానం చేశారు. దీనిపై హర్షిస్తూ, భారతదేశంలోని అన్ని రాష్ట్రాల అసెంబ్లీ భవనాలకు, మరియు సెక్రటేరియట్ భవనాలకు కూడా అంబేద్కర్ పేరు పెట్టాలని, తెలిపారు. భారత దేశ అత్యున్నత పార్లమెంట్ కు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేస్తూ ,అఖిలపక్ష ఐక్యవేదిక వనపర్తి జిల్లా అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వచ్చి నివాళులు అర్పిస్తూ భరత దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత వజ్రోత్సవాలు చేస్తున్న ఈ సందర్భంలో ముఖ్యమంత్రి ఈ ప్రకటన చేయడం హర్షించదగ్గ విషయమన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సతీష్ యాదవ్ తో పాటు ఉపాధ్యక్షులు వెంకటేష్, జయ రాములు, మైనార్టీ ప్రెసిడెంట్ షఫీ, కార్యదర్శి రమేష్, టౌన్ కార్యదర్శి భాస్కర్,అడ్వకేట్ ఆంజనేయులు దళిత సంఘం నాయకులు పాల్గొన్నారు.
అచ్చంపేట రూరల్ : నూతన పార్లమెంట్ భవనానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరును పెట్టాలని అంబేద్కర్ యువజన సంఘం డివిజన్ అధ్యక్షులు పి శ్రీశైలం డిమాండ్ చేశారు. శుక్రవారం అచ్చంపేట పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం ముందు తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా నిర్మిస్తున్న సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టినందుకు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసిన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ముఖ్య సలహాదారు బీసమోల్ల ఆనంద్, కంకి విజరు, మీసాల ప్రభాకర్, శ్యామ్, గుండ మహేష్, నారుమల్ల శ్రీశైలం, పిల్లి వెంకటస్వామి, వెంకట్ కళ్యాణ్, శ్రీనివాసులు, టీచర్ జానయ్య, కష్ణ, పరమేష్ పాల్గొన్నారు.