Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తహసీల్దార్ తిరుపతయ్య
నవతెలంగాణ- ఉట్కూర్
దళారులకు ఆశ్రయించకుండా పనులు ఉంటే నేరుగా కార్యాలయంలో వెళ్లి అధికారుల దృష్టికి తీసుకుని వచ్చి వాటిని పరిష్కారం చేయించుకోవాలని తహసీల్దార్ తిరుపతయ్య అన్నారు. దరఖాస్తుదారులు ఆన్లైన్లొ నమోదు చేసిన తర్వాత కార్యాలయంలో పత్రాలిచ్చి పనులు చేయించుకోవాలని సూచించారు. నవతెలంగాణకు తహసీల్దార్ తిరుపతయ్య ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు.
నవతెలంగాణ : మండలంలో ఎన్ని చౌక దుకాణాలు,
రేషన్ కార్డులున్నాయి ?
తహసీల్దార్ : మండలంలో 26 చౌక ధర దుకాణాలున్నాయి. 13,277 రేషన్ కార్డులున్నాయి.
నవతెలంగాణ: చౌక ధార దుకాణంలో ఏన్ని రకాల
నిత్యవసర వస్తువులు పంపిణీ చేయాల్సింది. ?
తహసీల్దార్ : పస్తుతం బియ్యం ఒకటే సరఫరా చేస్తున్నాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు అప్పుడప్పుడు పండుగలు సమయంలో బియ్యం, చక్కర పంపిణీ చేస్తున్నాం.
నవతెలంగాణ : నెలలో ఎన్ని రోజుల వరకు
నిత్యవసర వస్తువులు పంపిణీ చేస్తారు?
తహసీల్దార్ :ప్రతి నెల ఒకటో తేదీ నుంచి 15తేదీ వరకు లబ్ధిదారులకు నిత్యవసర వస్తువులు పంపిణీ చేయాల్సి ఉంది. ప్రతిరోజు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు, మళ్లీ సాయంత్రం నాలుగు నుంచి రాత్రి 8 గంటల వరకు చౌక ధర దుకణాలు తెరుస్తాం. రేషన్ కార్డుదారులకు పంపిణీ చేయాల్సి ఉంటుంది
నవతెలంగాణ : వర్షానికి ఎన్ని ఇల్లు కూలిపోయాయి ?
తహసీల్దార్ : మండలంలోవర్షానికి దాదాపు 26 ఇల్లు కూలిపోయినట్లు తమకు దరఖాస్తులు వచ్చాయి.
నవతెలంగాణ : బాధితులకు నష్టపరిహారం వచ్చింది ?
తహసీల్దార్ :కూలిపోయిన ఇండ్ల వివరాల నివేదిక తయారుచేసి పై అధికారులకు పంపించాం. ఇంతవరకు ఎలాంటి నష్టపరిహారం రాలేదన్నారు.
నవతెలంగాణ : ధరణి వచ్చిన తర్వాత డిజిటల్ సంతకం
కానీ ఖాతాలున్నాయా ?
తహసీల్దార్ : అలాంటివి లేవు. కాకపోతే ఆధార్ కార్డు నెంబర్ తప్పులు తడాఖా తదితర సమస్యలతో దరఖాస్తుదారులు తమ దృష్టికి తీసుకుని వస్తున్నాం.
నవతెలంగాణ : గతంలో అసైన్డ్ చేసి భూములు
రైతులు సాగులో లేకపోతే వాటికి తిరిగి తీసుకునే పరిస్థితి ఉందా ?
తహసీల్దార్ : సాగులో లేకుంటే వాటిని పరిశీలించి ప్రభుత్వానికి అవసరమున్నప్పుడు తీసుకుంటాం.
నవతెలంగాణ :కార్యాలయంలో ఎంతమంది సిబ్బంది ఉండాలి.
ఎన్ని పోస్టులు ఖాళీలున్నాయి ?
తహసీల్దార్ : కార్యాలయంలో సిబ్బంది కొరత సమస్య ఎక్కువగా ఉంది. దీనితో ఉన్న సిబ్బందిపై పని భారం పడుతోంది.గిర్దవారిలు ఇద్దరు ఉండాల్సిన ఉండగా వారు లాంగ్ లీవ్ పై వెళ్లారు. ఒక జూనియర్ అసిస్టెంట్ పోస్టు, ఏఎస్ఓ,ఆఫీస్ సబానిటర్ మూడు పోస్టులు, టైపిస్టు ఖాళీ ఉన్నాయి. సర్వే పోస్ట్ ఉన్న డిప్యూటేషన్ పై వెళ్లారు. వెలుగు (మహిళా సంఘాలు) ద్వారా సర్వేరు ఉన్న పూర్తి స్థాయిలో పనులు కావడం లేదు.
నవతెలంగాణ : మన ఊరు మనబడి నిర్మాణం పనుల నిమిత్తం
ఇసుక రవాణా కోసం పర్మిషన్లు ఇచ్చారా ?
తహసీల్దార్ : మన ఊరు మనబడి నిర్మాణం పనులకు గాను ఇసుకకు ఎలాంటి అనుమతి ఇవ్వలేదు.
మనబడి మన పోస్ట్ ఆఫీస్‌ను సద్వినియోగం చేసుకోవాలి.