Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు
నవతెలంగాణ-అచ్చంపేట రూరల్
క్రీడలు ప్రజల ఆరోగ్యాన్ని, వ్యక్తిత్వాన్ని మెరుగుపరుస్తాయని ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాలలో భాగంగా అచ్చంపేట పట్టణంలోని పబ్లిక్ క్లబ్ వారు నిర్వహించిన క్యారమ్స్, షటిల్ టౌర్నమెంట్ పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతి ప్రధాన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యేగా కన్నా నాలోని క్రీడాకారున్ని గుర్తించి, నన్ను నిత్యం ప్రోత్సహిస్తూ పూర్తి స్థాయి క్రీడాకారున్నిగా తీర్చిదిద్దిన ఘనత మీదే క్రీడాకారులదేనని అన్నారు. అన్ని రంగాలలో గుర్తింపు పొందిన క్రీడాకారులున్నారని, నియోజ కవర్గానికి ఎమ్మెల్యేను కావడం నా అదష్టమన్నారు. క్రీడలను ప్రోత్సహించేందుకే స్వంత డబ్బులతో దాదాపు 16 లక్షల రూపాయలతో ఇండోర్ స్టేడియంలలో సింథటిక్ ఉడెన్ కోర్టులు ఏర్పాటు చేయించానని గుర్తుచేశారు.విఘ్నేష్ అనే యువ కుడికి మెరుగైన నైపుణ్యం కోసం గుత్తా జ్వాలా అకాడమీలో స్వంత ఖర్చులతో ట్రెనింగ్ను ఇప్పిస్తున్నాని తెలిపారు. ఇదే స్ఫూర్తితో యువత క్రీడల పట్ల మక్కువ పెంచుకొని రాణించి మరింత ముందుకు పోవాలని కోరారు. ఎంచుకున్న క్రీడలలో అంకితభావంతో కష్టపడి సాధన చేసినప్పుడే పరిపూర్ణమైన ఆటగానిగా రాణించి పేరు ప్రఖ్యాతలు పొందుతారన్నారు. క్రీడలంటే అచ్చంపేట క్రీడా కారులే అనేలా ఎదగాలన్నారు. అచ్చంపేట క్రీడా రంగానికి నా వంతు సహాయ, సహకారాలు ఎల్ల ప్పుడు ఉంటాయని హామీ ఇచ్చారు. షటిల్ డబు ల్స్‌లో ప్రథమ బహుమతిని కంప శంకరయ్య, విఘ్నేష్, ద్వితియ బహుమతిని ఇబ్రహీం, కేశవ రావులు, తతీయ బహుమతిని జేజే కర్ణాకర్, కె.ఎల్. నారాయణ రావులు కైవసం చేసుకున్నారు. క్యారమ్స్ సింగిల్స్‌లో ప్రథమ బహుమతిని నాచా, ద్వితీయ బహుమతిని కలాంలు డబుల్స్‌లో ప్రథమ బహుమతిని కలాం, ప్రభాకర్, ద్వితీయ బహు మతిలో డి. సతీష్‌కుమార్, వినోద్ పటేల్ కైవసం చేసుకున్నారు. కార్యక్రమంలో పబ్లిక్ క్లబ్ అధ్యక్షుడు డి. సతీష్‌కుమార్, ప్రధాన కార్యదర్శి ఎ. గోపాల్, కోశాధికారి జి. చంద్రశేఖర్, క్రీడా కార్యదర్శి జి. వసంత్ కుమార్ యాదవ్, కార్యవర్గ సభ్యులు, జడ్పీటీసీ సభ్యులు మంత్రియా, నాయకులు లోక్యానాయక్, రాజేశ్వర్ రెడ్డి, కౌన్సిలర్లు మన్ను పటేల్, తగురం శ్రీను, విద్యుత్ శాఖ ఎడి కామేశ్వర రావు, కే. అశోక్ ప్రసాద్, వార్డెన్ నాగరాజు, పీఈటీ మల్లయ్య, మాలమహానాడు రాష్ట్ర బాధ్యులు పాత్కుల శ్రీశైలం, క్రీడాకారులు, పాల్గొన్నారు.