Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ- కోస్గి
వివిధ రకాల మానవ ప్రమేయంతో రోజు రోజు కీ పెరిగిపోతున్న వివిధ రకాల కాలుష్యాల వల్లే పర్యావరణంలో వాతావరణ మార్పులు చోటుచేసుకోని జీవ జాతులు మనుగడ ఇబ్బంది కరముగా మారుతున్నదని పాఠశాల హరిత దళ సమన్వయకర్త వార్ల మల్లేశం అన్నారు. ప్రపంచ ఓజోన్ పొర సంరక్షణ దినోత్సవం పురస్కరించుకొని శుక్రవారం మండలంలోని ముశ్రీఫా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఓజోన్ పొర ఆవశ్యకత - జీవుల మనుగడ.. అనే అంశం పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అంతకు ముందు ఖగోళ వాతావరణ పరిస్థితులు, ఓజోన్ పొర వల్ల కల్గుతున్న ఉపయోగాల గూ ర్చి వీడియో చిత్ర ప్రదర్శన విద్యార్థులు తిలకించారు. అనంతరం భూమిని కాపాడే ఓజోన్ పొర ను కాపాడుకుంటామని విద్యార్థులు ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు.