Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కేంద్రాలల్లో భారీ ర్యాలీలు
- మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్‌రెడ్డి ,కలెక్టర్లు, ప్రజా ప్రతినిధులు, నాయకులు హజరు
నవతెలంగాణ- వనపర్తి
ప్రభుత్వ ఆదేశాల మేరకు ''తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల'' వేడుకల ర్యాలీని ఘనంగా నిర్వహించినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సూచించారు. శుక్రవారం వాజ్రోత్సవాలలో భాగంగా వనపర్తి పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానం నుండి పాల శీతలీకరణ కేంద్రం వరకు నిర్వహించిన భారీ ర్యాలీలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ లోకనాథ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా, ఎస్పీ అపూర్వ రావుతో కలిసి ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణకు స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వజ్రోత్సవ వేడులకలను ఈ నెల 16వ. తేది నుండి 18వ. తేది వరకు మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆయన సూచించారు. ఆగస్టు నెలలో ''భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల'' ను 15 రోజుల పాటు విజయవంతంగా నిర్వహించామని ఆయన గుర్తు చేశారు. ''తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ ర్యాలీ'' ని భారీ సంఖ్యలో విద్యార్థులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజల భాగస్వామ్యంతో విజయవంతం చేసినట్లు ఆయన తెలిపారు.. నిజాం పాలనలోనే ఉస్మానియా ఆసుపత్రి, సాగునీటి ప్రాజెక్టులు, రైల్వేలు, సిమెంటు, షుగర్, పేపర్ ఫాక్టరీలను ఏర్పాటు చేశారని ఆయన అన్నారు. 1948 సెప్టెంబర్, 17న భారత్ లో తెలంగాణ కలిసిన 8 సం.లకు భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరుతో ఆంధ్రప్రదేశ్ ను ఏర్పాటు చేశారని ఆయన అన్నారు. జిల్లా అధికారులు, సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు, ప్రజల సమన్వయంతో ర్యాలీని విజయవంతం చేసినందుకు ఈ సందర్భంగా ఆయన కతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ ఆర్. లోకనాథ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష, జిల్లా ఎస్పీ అపూర్వ రావు, జిల్లా అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, జిల్లా అధికారులు, ఎమ్మార్వో రాజేందర్ గౌడ్, ప్రజా ప్రతినిధులు, కౌన్సిలర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.
మహబూబ్ నగర్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి నేటి తెలంగాణ రాష్ట్రం వరకు జిల్లాలో రెండు జీవనదులు ప్రవహిస్తున్న నీటి కోసం కొట్లాడుతున్న పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నాయని రాష్ట్ర ఎక్సైజ్ క్రీడలు సాంస్కతిక సమాచార శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో తెలంగాణ వజ్రోత్సవ వేడుకలను పురస్కరించుకొని జిల్లా పరిషత్ మైదానం నుండి అంబేద్కర్ చౌరస్తా గడియారం చౌరస్తా పాత బస్టాండు తెలంగాణ చౌరస్తా మీదుగా బాలురాజ్ జూనియర్ కళాశాల మైదానం వరకు లక్షలాది మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ ఉద్యోగులు మహిళా సంఘాల ప్రతినిధులు వివిధ రంగాలలో నిపులైనా కళాకారులు ఈ ర్యాలీ అగ్రభాగాన నడిచారు. బాలరాజ్ జూనియర్ కళాశాల మైదానంలో జరిగిన భారీ బహిరంగ సభలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ స్వతంత్రం వచ్చిన తర్వాత ఏర్పడిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు మొదటి ముఖ్యమంత్రి పాలమూరు జిల్లాకు చెందిన బూర్గుల రామకష్ణారావు అయినారు తెలిపరు. . ఈ సభలో మహబూబ్‌నగర్ పార్లమెంటు సభ్యులు మన్నే శ్రీనివాస్ , జిల్లా పరిషత్ చైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి రెడ్డి, జిల్లా కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీ వెంకటేశ్వర్లు స్థానిక సంస్థల అదనాపు కలెక్టర్ తేజస్, నందలాల్ పవర్ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో గ్రంధాలయ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్ మూడా చైర్మన్ గంజి వెంకన్న మున్సిపల్ చైర్మన్ పోరంబోని నరసింహులు పాల్గొన్నారు.
అచ్చంపేట రూరల్ : తెలంగాణలో మనం జరుపుకుంటున్న జాతీయ సమైఖ్యతా దినోత్సవాలను దేశమంతటా స్పూర్థిని నింపుతున్నాయని అచ్చంపేట ఎమ్మేల్యే, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు అన్నారు. శుక్రవారం తెలంగాణా జాతీయ సమైఖ్యతా దినోత్సవాలలో మొదటి రోజు సందర్భంగా అచ్చంపేటలోని బస్టాండ్ నుండి ఎన్టిఆర్ మినీ స్టేడియం వరకు పెద్ద ఎత్తున నిర్వహించిన ర్యాలీలో పాల్గొని అనంతరం నిర్వహించిన బహిరంగా సభలో ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తెలంగాణ ఐక్యతను దేశ, ప్రపంచ వ్యాప్తంగా అభివర్ణించలేని విధంగా చేపట్టిన సంబరాలను కొన్ని పార్టీలు జీర్ణించుకోలేక తెలంగాణా విమోచన దినోత్సవం అంటూ వేరే విధంగా పేర్లు పెట్టి మన ఐక్యతను దెబ్బతీస్తు వారి మనుగడను కాపాడుకునే కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు, ఉద్యోగస్తులు, పాల్గొన్నారు.
కందనూలు : రాజరిక పాలన నుండి ప్యాజాస్వామ్యంలో అడుగిడిన తెలంగాణా ప్రజలకు సెప్టెంబర్ 17 సువర్ణాక్షరాలతో లిఖించిన రోజని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అభివర్ణించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న ఈ తరుణంలో సెప్టెంబర్ 17న 16 జిల్లాల తెలంగాణ సమైక్య భారత దేశంలో విలీనం అయిన రోజును పురస్కరించుకొని సెప్టెంబర్ 16 నుండి 18 వరకు తెలంగాణా జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను జిల్లాలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగా శుక్రవారం తొలి రోజు 15 వేల పైచిలుకు జనాలతో స్థానిక లిటిల్ ఫ్లవర్ హైస్కూల్ నుండి జిల్లా పరిషత్ మైదానం వరకు కిక్కిరిసిన జనసందోహంతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జడ్పి మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జిల్లా పరిషత్ చైర్మన్ పి. పద్మావతి, జిల్లా కలెక్టర్ పి. ఉదరు కుమార్, జిల్లా ఎస్పీ కె.మనోహర్ తో కలిసి పాల్గొన్న బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ భారత దేశానికి స్వాతంత్య్రం 15 ఆగష్టు, 1947 నాడు సిద్దిస్తే అప్పటికి ప్రత్యేకంగా రాజరిక వ్యవస్థలో ఉండి భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి సంకెళ్ళ నుండి బయట పడటానికి ఎందరో మహానుభావులు తమ ప్రాణాలను లెక్కచేయకుండా పోరాడిన ఫలితంగా సర్దార్ వల్లభారు పటేల్ తెగువతో 1948 సెప్టెంబర్ 17 న తెలంగాణ భారత దేశంలో విలీనమయ్యిందని పేర్కొన్నారు. అందుకే సెప్టెంబర్ 16 నుండి 18 వరకు 3 రోజుల పాటు తెలంగాణా జాతీయ సమైక్యత వజ్రో త్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ పెద్దపల్లి పద్మావతి. జిల్లా కలెక్టర్ పి. ఉదరు కుమార్ ,జిల్లా ఎస్పీ కె. మనోహర్ డైరెక్టర్ జక్క రఘునందన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ కల్పన భాస్కర్, మార్కెట్ కమిటి చైర్మన్ గంగన మోని కుర్మయ్య, నాయకులు రాష్ట్ర కార్యదర్శి బైకాని శ్రీనివాస్ యాదవ్, జడ్పీటీసీలు, ఎంపీపీ లు జిల్లా అధికారులు, మహిళా సంఘాల ప్రతినిధులు, పాల్గొన్నారు.
అమరచింత: మక్తల్ నియోజకవర్గంలో తలపెట్టిన జాతీయ సమైక్యత భారీ ర్యాలీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన పిలుపు మేరకు మక్తల్ నియోజకవర్గ టెన్ రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయ సమైక్యత భారీ రాలి కి అమరచింత నియోజకవర్గం నుంచి టిఆర్ఎస్ నాయకులు భారీ సం ఖ్యలో ప్రజా ప్రతినిధులు ముఖ్య నాయకులు కార్యకర్తలు వాహనాలలో ప్రైవేట్ బస్సులలో శుక్రవారం తరలివెళ్ళారు. తరలి వెళ్లిన వారిలో టిఆర్ఎస్ నాయకులు మార్కెట్ చైర్మన్ ఎస్ ఏ రాజు, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రమేష్ ముదిరాజ్, కో ఆప్షన్ సభ్యులు షాన్ వాజ్ ఖాన్, రఫీ, పట్టణ ఉపాధ్యక్షులు మహిపాల్, రత్నం, ఆటో ఖదీర్, మైనార్టీ మండల సీనియర్ నాయకులు తరలి వెళ్లారు.
ఉట్కూర్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రత్వంలో భాగంగా మక్తల్ లో జరిగే ర్యాలీ సభకు మండలం నుండి ప్రజాప్రతినిధులు అధికారులు అంగన్వాడీ టీచర్స్ ఆశ వర్కర్స్ టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు బయలుదేరారు ఈ కార్యక్రమంలో జడ్పిటిసి అశోక్ గౌడ్ మాజీ జెడ్పిటిసి అరవింద్ కుమార్ ఎంపీడీవో కాళ్ళప్ప. శ్రీను వేణుగోపాల్ రెడ్డి ఎల్లయ్య ఏపీఎం నర్సింలు ఎంఈఓ వెంకటయ్య తోపాటు వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు టిఆర్ఎస్ నాయకులు లక్ష్మారెడ్డి జగదీష్ గౌడ్ వెంకట్ గౌడ్ సమీ అనిల్ రెడ్డి ఎస్ ఎం షకీల్ ఈర్షత్ తో పాటు వివిధ గ్రామాల నాయకులు కార్యకర్తలు, అభిమానులు మహిళలు తదితరులు పాల్గొన్నారు
ఉట్కూరులో ర్యాలీ : తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా మండల కేంద్రమైన ఉట్కూరులో ర్యాలీ నిర్వహించారు ర్యాలీని ఎంఈఓ వెంకటయ్య జండా ఊపి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సురేష్ ఉపాధ్యాయుల బందం స్పందన రాములు వెంకట్ రాములు అశోక్ బాబు సిఆర్పి భీమన్న తో పాటు తదితరులు పాల్గొన్నారు
ధరూరు : రజాకార్ల పాలన నుంచి స్వతంత్ర భారతదేశంలో హైదరాబాద్ సంస్థానం విలీనం అయినందున శుక్రవారం నుంచి మూడు రోజులపాటు జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు నిర్వహిస్తున్నట్లు జడ్పీ చైర్మన్ సరిత తిరుపతయ్య అన్నారు. శుక్రవారం జాతీయ సమైక్యత వజ్రోత్సవాల తొలిరోజు వైఎస్సార్ చౌక్ నుండి మార్కెట్ యార్డ్ వరకు భారీ సంఖ్యలో విద్యార్థులు, యువతి, యువకులు, అధికారులు, పోలీస్ శాఖ, ప్రజలు తరలిరాగా రాజీవ్ మార్గ్ నుండి మార్కెట్ యార్డు వరకు జాతీయ పతాకం చేతపట్టి భారత్ మాతాకీ జై, జై తెలంగాణ అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ వెళ్ళింది. ర్యాలీని జడ్పీ చైర్మన్ సరిత తిరుపతయ్య, జిల్లా అదనపు కలెక్టర్ శ్రీహర్ష (లోకల్ బాడీస్),గద్వాల ఎమ్మెల్యే బండ్ల కష్ణమోహన్ రెడ్డి, ఏఎస్పీ రాములు, వైస్ చైర్మన్ సరోజమ్మ జండా ఊపి ప్రారంభించారు. ఎమ్మెల్యే బండ్ల కష్ణ మోహన్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో మూడు రోజులపాటు జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు ఒక పండుగ వాతావరణంలో నిర్వహించామన్నారు. కార్యక్రమంలో ఏఎస్ పి రాములు నాయక్, అదనపు కలెక్టర్ శ్రీ హర్ష మున్సిపల్ చైర్మన్ బి.ఎస్ కేశవ్ ,జాడ్ విజయ నాయక్, ఇడిఎస్సి కార్పోరేషన్ అధికారి రమేష్ బాబు, డీపీఓ శ్యాం సుందర్, కన్జ్యూమర్ ఫోరం చైర్మన్ గట్టు తిమ్మప్ప, వైస్ చైర్మన్ సరోజమ్మ, మార్కెట్ చైర్మన్ రామేశ్వరమ్మ, గ్రంధాలయ చైర్మన్ రామన్ గౌడ్, పాల్గొన్నారు.
మక్తల్ : విలీన దినాన్ని రాజకీయాలు చేస్తున్నారు, ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి . హైదరాబాద్ నైజాం సర్కార్ తన రాజ్యాన్ని భారతదేశంలో విలీనం చేస్తె దాన్ని కొన్నిరాజకీయ పార్టీల వారు అవకాశ వాద రాజకీయలకు ఉపయోగించుకుంటున్నారని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అన్నారు.శుక్రవారం మక్తల్ లో తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్స వాలో బాగంగా మొదటి రోజు మినిస్టేడియం మైదానం నుండి దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలో ప్రవేటు ఫంక్షన్ హాల్ వరకు నియోజక వర్గంలోని కష్ణ.మాగనూరు.మక్తల్. ఉట్కుర్.నర్వ. అమరచింత. ఆత్మకూర్ మండలాల్లోని హైస్కూల్ పాఠశాల విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ నిర్వ హించారు.అనంతరం ద్వారక ఫంక్షన్ హల్లో భహిరంగా సభకు ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్ రెడ్డి,జడ్పీ చెర్ పర్సన్ వనజ, డీసీసీబీ చెర్మాన్ నిజాం పాషా, అదనపు కలెక్టర్ చంద్ర రెడ్డి, డిఎస్పీ సత్యనారాయణ,సీఐ సీతయ అధికారులు అన్నారు. ఏడు మండలాల మండల అధ్యక్షులు జడ్పీటీసీలు మక్తల్.అమరచింత.ఆత్మకూరుమున్సిపల్ చైర్మన్లు. కమిషనర్లు, సర్పంచులు,ఎంపీటీసీ లు మండల అధ్యక్షులు.పార్టీ కార్యకర్తలు నాయకులు. సిఐ సర్కిల్లోని ఎస్ఐలు పోలీస్ సిబ్బంది భారీ ర్యాలీకి బందోబస్తు కల్పించారు.
కల్వకుర్తి : దేశంలో రాష్ట్రంలో ప్రజల మధ్య చిచ్చు పెట్టి లబ్ధి పొందేందుకు భారతీయ జనతా పార్టీ నాయకులు పెద్ద ఎత్తున కుట్రలకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఆరోపించారు. శుక్రవారం పట్టణంలో జాతీయ సమైక్యత వారోత్సవాల సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బిఎస్ఎన్ఎల్ గ్రౌండ్లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రసంగించారు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని బిజెపి నాయకులు రాజకీయం చేయడం సిగ్గుచేటన్నారు తెలంగాణ రాష్ట్రంలో వారి ఆటలు సాగవని హెచ్చరించారు టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివద్ధి సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేని విధంగా జరుగుతున్నాయని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సత్యం ఎంపీపీ మనోహర వైస్ ఎంపీపీ గోవర్ధన్ జిల్లా జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బాలాజీ సింగ్ వివిధ శాఖల అధికారులు ప్రజా ప్రతినిధులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
తిమ్మాజిపేట : నాగర్ కర్నూల్ పట్టణంలో తెలంగాణ సమైక్యత వారోత్సవాల సందర్భంగా తిమ్మాజిపేట కు చెందిన మహిళలు బతుకమ్మలతో తిమ్మాజిపేట మహిళలు అదనపు కలెక్టర్ మను చౌదరికి స్వాగతం పలికారు. తిమ్మాజిపేటలోని ఐకెేపీ కార్యాలయం వద్ద పలు రకాల పూలతో రూపొందించిన బతుకమ్మను మండల మహిళా సమైక్య మహిళలు నాగర్ కర్నూల్ వెళ్లి జాతీయ సమైక్యత వారోత్సవాలలో శుక్రవారం పాల్గొనేందుకు వచ్చిన అదనపు కలెక్టర్ మను చౌదరికి స్వాగతం పలకడంతో ఆయన మహిళాలను అభినందించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల శాఖ అధ్యక్షుడు జోగు ప్రదీప్, సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడు వేణుగోపాల్ గౌడ్ ఐకెపి సీసీల మంగమ్మ, రుద్రమ్మ, యాదమ్మ, తిరుపతమ్మ, తదితరులు పాల్గొన్నారు.
అయిజ : అయిజ పురపాలక సంఘం నుండి తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలలో భాగంగా శాంతినగర్ లో శాసన సభ్యులు డా''వి యం అబ్రహం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ర్యాలీ కి మునిసిపల్ కమిషనర్ గోల్కొండ నర్సయ్య ఆధ్వర్యంలో ఆర్ పిలు, మహిళలు,మరియు మునిసిపల్ సిబ్బంది పెద్ద సంఖ్యలో బయలుదేరి వెళ్లారు. కార్యక్రమంలో మునిసిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ గోపాల్,మేనేజర్ రాజేష్ ,సీనియర్ అసిస్టెంట్లు రమేష్ ,లక్ష్మన్న,బి వీరేందర్, సిబ్బంది ఆర్పీలు, పట్టణ మహిళలు తదితరులు పాల్గొన్నారు
ధరూర్ :వజ్రోత్సవాల ర్యాలిలో కదం తొక్కిన ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు గద్వాల నియోజక వర్గంలో తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు పురస్కరించుకొని ర్యాలీ సమావేశం నిర్వహించారు. . జెండా ఊపి ర్యాలిని ప్రారంభించిన ఎమ్మెల్యే గద్వాల జిల్లా కేంద్రంలో తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు సందర్భంగా పాత బస్టాండ్ లో ఏర్పాటు చేసిన ర్యాలీ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు బండ్ల కష్ణమెహన్ రెడ్డి , జడ్పీ చైర్మన్ సరిత రాష్ట్ర వినియోగదారుల ఫోరం చైర్మన్ గట్టు తిమ్మప్ప, జిల్లా అదనపు కలెక్టర్ శ్రీ హర్ష , అడిషనల్ ఎస్పీ రాము నాయక్ జెండాను ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.రాష్ట్ర ప్రభుత్వం 3 రోజుల పాటు తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలకు పిలుపునిచ్చిందన్నారు .తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నూతనంగా నిర్మాణం చేస్తున్న సచివాలయానికి భారతరత్న బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరును నామకరణం చేయడం జరిగింది హర్షం వ్యక్తం చేశారు.కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ సరోజమ్మ, మున్సిపల్ చైర్మన్ బియస్ కేశవ్ ఉమ్మడి జిల్లా డైరెక్టర్ సుభాన్, వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ రామేశ్వరమ్మ, జిల్లా గ్రంధాలయ ఛైర్మన్ జంబు రామన్ గౌడ, ఎంపీపీలు ప్రతాప్ గౌడ్, విజరు, రాజారెడ్డి, నజూమన్నీసా బేగం, మనోరమ్మ, జెడ్పీటీసీలు రాజశేఖర్, ప్రభాకర్ రెడ్డి పద్మ వెంకటేశ్వర్ రెడ్డి, బాసు శ్యామల, మున్సిపల్ వైస్ చైర్మన్ బాబర్, కౌన్సిలర్స్, వైస్ ఎంపీపీలు సుదర్శన్ రెడ్డి, రామకృష్ణ నాయుడు, సుమతి,వీరన్న, ఛైర్మన్ వెంకటేష్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, సింగల్ విండో డైరెక్టర్స్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
నారాయణపేట టౌన్ :జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియం నుండి శుక్రవారం ఎమ్మెల్యే ఎస్ రాజేందర్ రెడ్డి ,కలెక్టర్ హరిచందన దాసరి, ఎస్పి ఎన్. వెంకటేశ్వర్లు తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. మినీ స్టేడియం నుండి సివిల్ లేన్, మున్సిపల్ పార్క్, అంబేద్కర్ చౌరస్తా, సత్యనారాయణ చౌరస్తా మీదుగా జి పి శెట్టి ఫంక్షన్ హాల్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం శెట్టి ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే ఎస్. రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి దేశానికి ఆదర్శమని కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ కృషి చేస్తున్నారని అన్నారు. రాబోవు రోజులలో దేశానికి తెలంగాణ రోల్ మోడల్ గా మారుతుందని అన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ సమైక్యత వజ్రోత్సవాల సందర్భాన్ని వివరించారు. ర్యాలీలో అధికారులు, టిఆర్ఎస్ నాయకులు, మహిళా సంఘాల మహిళలు, వివిధ పాఠశాలల విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.