Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -అమరచింత
భూస్వామ్య పెత్తందార్ల పెట్టుబడిదారీ వ్యవస్థను అంతమొందించేందుకు వీర తెలంగాణ సాయుధ పోరాటం పుచ్చలపల్లి సుందరయ్య సారధ్యంలోని ఉద్యమం కొనసాగిందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ వీరయ్య, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జాన్వేస్లీ అన్నారు. శుక్రవారం అమరచింత మండల కేంద్రంలోని జిఎస్ భవనం నుంచి భారీ ర్యాలీ నిర్వహించి జడ్.పి.హెచ్ఎస్ పాఠశాల ముందు భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు సభాధ్యక్షులుగా సీపీఐ(ఎం) మండల కార్యదర్శి, మున్సిపల్ వైస్ చైర్మన్ జిఎస్ గోపి, వహించారు. ఈ సభకు ఆయన ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ. భూస్వాములు జమీందార్ల దేశ్ ముఖ్ ల దోపిడీలకు వ్యతిరేకంగా రూపుదిద్దుకున్నది అన్నారు. నైజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో ఎర్రజెండ నాయకత్వంలో వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కొనసాగింది అన్నారు. ఉధతమైన ఉజ్వలమైన అటువంటి పోరాటం అది ఈ పోరాటంలో పాల్గొన్న టువంటి యోధులు హైదరాబాద్ సంస్థానాన్ని ఆదుకునే ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతంలో ఉన్న జిల్లాలల కూడా పోయి అక్కడ స్వాతంత్ర ఉద్యమంలో కూడా పాల్గొని వచ్చినటువంటి యోధులు అర్హులు వారు అన్నారు. తమ రాజ్యంలో భూస్వామ్య వ్యతిరేక పోరాటంలో పాల్గొన్నారు. తమ రాజ్యాన్ని ఆనుకొని ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రాంతాలు బ్రిటిష్ ఇండియాలో స్వతంత్ర ఉద్యమంలో కూడా పాల్గొన్నారు అని అన్నారు. అది తెలంగాణ సాయుధ పోరాటం వీర గా యొక్క ప్రత్యేకత చరిత్ర అని ఆయన అన్నారు. అందుకే ఈ పోరాటం వెట్టిచాకిరికి వ్యతిరేకంగా సాగిన పోరాడిన పోరాటం భూస్వాములకు వ్యతిరేకంగా దోపిడీకి వ్యతిరేకంగా సాయి నటువంటి పోరాటం రాచరికానికి వ్యతిరేకంగా నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాగిన ఉన్నటువంటి పోరాటం తెల్ల దొరలకు వ్యతిరేకంగా సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా సాగిన టువంటి పోరాటం కూడా అది తెలంగాణ సాయుధ పోరాట పోరాటం ప్రత్యేకత అని అన్నారు. మోటో 1946 లో ప్రారంభమై1951 అక్టోబర్ 21 వరకు కొనసాగింది అన్నారు. ఈ పోరాట ఫలితమే నిజాం నిరంకుశ పాలన అంతం కావడం హైదరాబాద్ సంస్థానం రాచరికం అంతం కావడం ఈ పోరాట ఫలితమే తెలంగాణ ఇండియా లో యూనియన్ విలీనం కావడం ఇప్పుడు ఉన్నటువంటి భారతదేశంలో విలీనం కావడమే ఇది చరిత్రలో ముఖ్యమైనటువంటి ఘట్టం హరి అన్నారు. ఎందుకు మొదలైంది ఆ సాయుధ పోరాటం రైతాంగ పోరాటం1951 దాకా ఎందుకు కొనసాగింది అదికూడా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం అన్నారు. నవాబు పరిపాలిస్తున్న కాలంలో తెలంగాణలో భూస్వామ్య దోపిడీ అడ్డు అదుపు లేకుండా కొనసాగింది అన్నారు. రైతు లు ముందుగా భూస్వాముల పొలాలను దున్నిన తర్వాతే రైతుల పొలాలను దున్ను కోవాల్సిన పరిస్థితి ఉంది. అప్పటికి రైతుల పొలాలు కు గిట్టుబాటు ధర రాక ఆర్థిక శోభ లో రైతులు నాశనం అవుతున్నారని ఆయన అన్నారు. రైతులు వచ్చినవెంటనే పొలం లోనే ఉండాలి విత్తనాలు వేయాలన్నారు. ఆ తర్వాత మాత్రమే తమ పొలాలను తమ పొలాల్లో దున్ను కోవా లి అప్పటికి పగుళ్లు పోయి అంత పెద్దగా రాదు భూస్వాములకు రైతులు అప్పుల పాలు అవుతారని ఆయన అన్నారు. ఆ భూస్వామికి గొడ్డు చాకిరీ చేస్తూ బ్రతకాల్సిందే మొత్తం కుటుంబం కుటుంబం యావత్తు అని అన్నారు. వ్యవసాయం చేసుకునేటప్పుడు రైతులే కాదు కుమ్మరి కుండలు చేసే వాళ్ళు, ఇంకా చాకలి వాళ్ళు బట్టలు విప్పి పెట్టాలి, మంగలి కుటుంబానికి ఉచితంగా సవరం చేయాలి కుటుంబానికి తడకలు ఇవ్వాలి, మొత్తానికి కుల వత్తులకు సంబంధించిన ప్రతి ఒక్కరూ వారికి ఊడిగం చేయాలని ఆయన అన్నారు. లేనిచో వారికి పుట్టగతులుండవని వారిపై దాడులు చేయడం జరుగుతుందని అన్నారు. ఆపైన మినీ మాత్రమే గ్రామంలోని ఉన్న వారికి ఇవ్వాలని పెత్తందార్ల ఆగడాలు ఆయన అన్నారు. ఇది ఆ భూస్వామ్య పెత్తందార్ల సారాంశం అని అన్నారు. అప్పుడే భూస్వాములకు పెత్తందార్లకు రజాకార్లకు నవాబులకు వ్యతిరేకంగా వీర తెలంగాణ సాయుధ పోరాటం పుచ్చలపల్లి సుందరయ్య ఆధ్వర్యంలో మరో ఉద్యమం నిర్వహిస్తున్నామని తలిపారు. ఈ ఉద్యమానికి ముఖ్యఅతిథిగా పుచ్చలపల్లి సుందరయ్య సారధ్యం వహించడం జరిగిందన్నారు. ఈ వీర తెలంగాణ సాయుధ పోరాటంలో ఎవరితో వచ్చినవారు వంటలు చేసి భోజనాలు అందించడం జరిగిందన్నారు. ఇక్కడ కులమతాలకు తావులేదు కుల వివక్షత అంతమైంది అక్కడ వివక్షతకు అసలే తావులేదని ఆయన అన్నారు. ఇక్కడ కొత్త నాయకత్వం మొదలైంది ఎర్ర జండా సారధ్యంలో వచ్చినటువంటి 3000 గ్రామా స్వరాజ్యం అమల్లోకి వచ్చింది అని అన్నారు. నిజం రాజు పెట్టిన పనులను రద్దయ్యాయి భూస్వాములు జమీందార్లు జాగీర్దార్లు పెట్టినటువంటి బలవంతపు పనులను రద్దు అయ్యాయని అన్నారు. ఇప్పటిదాకా భూస్వాములు మహిళలపై అత్యాచారాలు అత్యాచారాలు అనేక అరాచకాలను చేస్తున్నారు అని అన్నారు. అవన్నీ రజాకార్లు కూడా చేయడం ప్రారంభించారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం వారసత్వాన్ని ఎర్ర జెండా ప్రజల తమ దష్టికి తెస్తూ రానున్న కాలంలో మతోన్మాదం బల పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అమరచింత ప్రజానీకానికి ఆయన కోరారు.ఈ తెలంగాణలో దాదాపు మూడు సంవత్సరాలు పైగా ఒక నెలరోజులు కేంద్ర బలగాలు అంతా కూడా తెలంగాణ ప్రాంతానికి వచ్చి మూడున్నర కిలోమీటర్ల క్యాంపులు ఏర్పాటు చేశారన్నారు. ఆ వివిధ గ్రామాలలో గ్రామాల మీద రోజుకు రెండు సార్లు మూడు సార్లు దాడులు చేశారు. ఆనాడు భూస్వాముల అంతా కూడా పరార్ అయిపోయి పట్టణాలకు వెళ్ళిపోయి పోలీసులంతా మిలటరీ అంతా తీసుకొచ్చి దాడులు చేశారు. మరి భూములను భూస్వాములకు ఇప్పించేందుకు పూనుకున్నారని ఆయన మండిపడ్డారు. ఇలాంటి దాడులకు పాల్పడిందని పటేల్ సైన్యం అని అన్నారు. ఏ భూముల కైతే పోరాడి ఎర్ర జెండా సారధ్యంలో భూస్వాములను పట్టణాలకు వెల్ల గో డితే మళ్లీ వీళ్లు వచ్చి మళ్లీ భూస్వాములకు భూములిప్పించ ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు. ఈ తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇస్తామని ఇవ్వలే ఆ ప్లాట్లు ఇస్తానని ఇవ్వలేదు భూమి ఇస్తామని ఇవ్వలే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వా లే ఇలా చెప్పుకుంటూ పోతే అనేక ప్రజలకు ఏమి శేషం లేదని ఆయన అన్నారు. అందుకోసమే మళ్ళీ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో భూ పోరాటాలు నిర్వహిస్తున్నామని పేదలకు భూములు లేని వారికి ప్రభుత్వ భూములు ఎక్కడ ఉంటే అక్కడ సిపిఎం పాటలు భూములు పంచడం జరుగుతుంది అని ఆయన ప్రభుత్వానికి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) పార్టీ మండల నాయకులు ఆర్యన్ రమేష్, వెంకటేష్ ,అజరు, ఎస్ రాజు, శ్యామ్ సుందర్, వెంకటేష్ నరసింహ వీరితో పాటు పలువురు పాల్గొన్నారు.