Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ- జడ్చర్ల
బంగారు తెలంగాణ అంటే డిగ్రీలు చదువు కున్న నిరుద్యోగులు హమాలి పని చేసుకోవడమా అని వై ఎస్ ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. వై ఎస్ ఆర్ పార్టీ తరుపున ఆమె చేపట్టిన పాదయాత్ర శుక్రవారం జడ్చర్ల మండలం లోకి ప్రవేశించింది. 2100 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకున్న సందర్భంగా పట్టణంలోని నేతాజీ చౌరస్తాలో ఏర్పాటు చేసిన రోడ్డు షోలో ఆమె మాట్లాడారు.ఈ జడ్చర్ల నియోజక వర్గానికి రామన్ పాడు నుంచి మంచి నీళ్ళు, పోలేపల్లి సెజ్ ఏర్పాటు తో దాదాపు 40 వేల ఉద్యోగాలు వచేలా చేసిన ఘనత ఆయనది అన్నారు. రెండు రూపాయల కిలో బియ్యం పథకం వైఎస్ఆర్ ఈ జడ్చర్ల నుంచే ప్రారంభించారని ఉమ్మడి పాలమూరు జిల్లాకు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చిన నాయకుడు వైఎస్సార్ అని గుర్తుచేశారు.పాలమూరు ప్రాజెక్ట్ వైఎస్సార్ కట్టాలని అనుకున్న ప్రాజెక్ట్ అని రిడీజనింగ్ చేసిన కేసీఅర్ 35 వేల కోట్ల నుంచి 65 వేల కోట్లకు పెంచార అన్నారు. కమీషన్లు తిన్నారు కానీ..ప్రాజెక్ట్ మాత్రం పూర్తి చేయలేదు విమర్శించారు.