Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు తెలంగాణ విలీన దినోత్సవంపై సభ
- విలేకర్ల సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి యం.డి జబ్బార్
వనపర్తి : తెలంగాణ సాయుధ పోరాటం భారత దేశాన్నే కాకుండా ప్రపంచాన్ని మొత్తాన్ని ఆకర్షించిందని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండీ జబ్బార్ అన్నారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యాలయంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బాల్‌రెడ్డితో కలిసి తెలంగాణ విలీన దినోత్సవాలపై ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం 1946లో ప్రారంభమై 1951 వరకు కొనసాగిందన్నారు. అందులో కీలకంగా సెప్టెంబర్ 17, 1948లో భారతదేశంలో నైజాం ఎస్టేట్ విలీనం కావడం చారిత్రాత్మకమైనదన్నారు. ఆనాటి ఉద్యమంతో సంబంధం లేని పార్టీలు, నాయకులు సాయుధ పోరాటంపై నేటికీ వక్రభాష్యాలు చేస్తూనే ఉన్నారని విమర్శించారు. విముక్తి, విమోచన, విలీనం, విద్రోహం అంటూ ఎవరికి తోచిన నినాదాన్ని వారు ప్రచారం చేస్తున్నారన్నారు. శనివారం వనపర్తి జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీతో పాటు సభ ఉంటుం దన్నారు. జమీందార్లు, జాగీర్దార్లు, నైజాములకు వ్యతిరేకంగా ఆనాడు ఐలమ్మ పోరాటం చేసిందన్నారు. ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన ఐలమ్మ కొన్ని వేల ఎకరాల భూములను పంచిందన్నారు. ఆమె పోరాటాల ఫలితంగానే తెలంగాణకు విముక్తి లభించిందన్నారు. శనివారం జిల్లా కేందంలో ర్యాలీ నిర్వహించి, కొత్తకోట రోడ్డులోని దాచ లక్ష్మయ్య ఫంక్షన్ హాలులో సభ ఏర్పాటు చేశామన్నారు. ఈ సభకు సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు బి.వెంకట్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని ప్రజలు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలోపాల్గొనాలని ఎం.డి.జబ్బార్ పిలుపునిచ్చారు.