Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టులే కీలక పాత్ర
- రైౖతు సంఘం జాతీయ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి
నవ తెలంగాణ -కల్వకుర్తి
తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న ఘనత కమ్యూనిస్టుల కే దక్కుతుంది, తెలంగాణ సాయుధ పోరాటం మహత్తరమైనదని రైతు సంఘం జాతీయ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి అన్నారు. గురువారం రాత్రి కల్వకుర్తి పట్టణంలోని టీఎస్ యూటీఎఫ్ భవన్లో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17 తెలంగాణ విద్రోహమా లేక విలీనమా అన్న అంశంపై సెమినార్ నిర్వహి ంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1946 నుంచి 51 వరకు నైజాం ప్రభుత్వ ఆగడాలను నిరంకుశత్వాన్ని వ్యతిరేకిస్తూ కమ్యూనిస్టు నాయకులు ఎంతోమంది ఉద్యమాలు చేశారన్నారు. నేడు బీజేపీ నాయకులు చరిత్రను వక్రీకరించి ఎందుకు కుట్రలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు ఏపీ మల్లయ్య, బి ఆంజనేయులు, బాలస్వామి, బాల్ రెడ్డి, సదానందం గౌడ్, టీడీపీ నాయకులు బ్రహ్మం, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు రేష్మా బేగం ,తదితరులు పాల్గొన్నారు.
జడ్చర్ల : కమ్యూనిస్టు పోరాటాల వల్లే నిజాం లొంగుబాటు జరిగిందని సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకుడు కిల్లెగోపాల్ అన్నారు. శుక్రవారం సీఐటీయూ ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్ యార్డులో తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా ఆయన మాట్లాడారు. కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలోని ఆంధ్ర మహాసభ, సంఘం పేరుతో బాంచన్ దొరనీ కాల్మొక్తన్న సాధారణ ప్రజలనే సాయుధలను చేసి నైజాం నవాబు అరాచకాలకు వ్యతిరేకంగా వీరోచితంగా పోరాడినచరిత్ర తమదని చేప్పారు. భూస్వాములను జాగిర్దారూలను, దొరలను ఊర్ల నుంచి తరిమి కొట్టిన చరిత్ర కమ్యూనిస్టు పార్టీకి ఉందన్నారు. తెలంగాణలో పుచ్చలపల్లి సుందరయ్య నాయకత్వంలో చండ్ర రాజేశ్వరరావు,రావి నారాయణరెడ్డి, మల్లు స్వరాజ్యం ,భీంరెడ్డి నరసింహారెడ్డి,కృష్ణమూర్తి అనేకమంది కమ్యూనిస్టుల నాయకత్వంలో పోరాటం చేశారని గుర్తుచేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి, సీఐటీయూ నాయకులు తెలుగు సత్తయ్య, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి పోలే జగన్, నాయకులు నాగరాజు, పెంటయ్య సత్యం ఇర్ఫాన్ అంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
హన్వాడ : భూమి కోసం భుక్తి కోసం నిజాం పాలన అంతం కోసం వెట్టి చాకిరీ విముక్తి కోసం చేసిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం మహత్తర మైనదని సీపీఐ(ఎం) జిల్లా కమిటి సభ్యులు లక్ష్మయ్య తెలిపారు. పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తెలంగాణ రైతాంగ పోరాట వారోత్సవాల్లో భాగంగా శుక్ర వారం హన్వాడ మండలం మాదారం , తిరుమలగిరి లలో ఆయా గ్రామ కమిటీల ఆధ్వర్యంలో తెలంగాణ వారోత్సవ సభలు చేశారు.కార్యక్రమంలో మండల కార్యదర్శి లక్ష్మయ్య ,మాదరం, గ్రామ కార్యదర్శి రమణయ్య, నాయకులు రేకమయ్య , గోపాల్ , తిరుమల గిరి గ్రామ సీపీఐ(ఎం)కార్యదర్శి రాములు,వెంకటయ్య పాల్గొన్నారు.
కోడేరు : మండలంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో శుక్రవారం వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భాన్ని పురస్కరించుకొని బైకు ర్యాలీ నిర్వహించారు. సీపీఐ(ఎం) మండల కార్యదర్శి పినరసింహ జెండా ఊపి బైక్ ర్యాలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా రజాకర్ల దాస్టికానికి ఎదురొడ్డి ఎర్ర జెండా నాయకత్వంలో రైతులు కూలీలు వెట్టి చాకిరికి వ్యతిరేకంగా వీరోచిత పోరాటం చేసి తమ దాస్య సుంకలాలను తెచ్చుకున్నారని అన్నారు. కమ్యూనిస్టుల నాయ కత్వంలో గ్రామాలలో భూస్వాములు ఆక్రమన ల్లో ఉన్న భూములను పేదలు స్వాధీనం చేసుకొని భూస్వాముల గుండెల్లో వణుకు పుట్టించారని తెలిపారు. ఈకార్యక్రమంలో సీపీఐ(ఎం) కోడేరు మండల కార్యదర్శి పి నరసింహ, మండల కమిటీ సభ్యులు ఎండి మాలిక్ వివిధ ప్రజాసంఘాల నాయకులు పి రవి, శివుడు, బుచ్చన్న, రాజు, కాకము లక్ష్మయ్య, కాకము వెంకటయ్య ,మరాటి వెంకటయ్య, సింగయ్యపల్లి శివ, ఎత్తం గ్రామ శ్రీను, వి రామచందర్ ,శివ, రవి, రాజాపూర్ నాగేంద్రం, కోడేరు గ్రామ నాయకులు పర్వతాలు, ఈశ్వర్, కష్ణ, వి లక్ష్మయ్య, పాల్గొన్నారు.
రాజాపూర్ : మండల కేంద్రంలో శుక్రవారం నాడు సిఐటియు ఆధ్వర్యంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలలో భాగంగా సిఐటియు రాష్ట్ర నాయకులు కిల్లె గోపాల్ , సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు దీప్లా నాయక్ పాల్గొని మాట్లాడుతూ భారతదేశానికి 1947 ఆగస్టు15న స్వతంత్రం వచ్చిన తెలంగాణ ప్రాంతంలో నిజాం నవాబు నిరంకుశ పాలన కొనసాగింది. అప్పటికి ఈ ప్రాంతంలో ప్రజలకు విముక్తి లభించలేదన్నారు. వెట్టిచాకిరని శిస్తూ వసూళ్ల ద్వారా పేద ప్రజలను పీడించే నైజాం రజాకార్లు వారికి తొత్తులుగా భూస్వాములు దేశ్ ముఖ్ లు పేద ప్రజలను పీడించి ఆడబిడ్డల మాన ప్రాణాలను రక్షణ లేకుండా చేస్తున్న తరుణంలో కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో వెట్టిచాకిరికి వ్యతిరేకంగా సాయుధ పోరాటం కొనసాగిందన్నారు.
అచ్చంపేట రూరల్ : బీజేపి హిందువులకు, ముస్లింలకు జిరగిన పోరాటాంగా చిత్రీకరిస్తూ తెలంగాణ రాష్ట్రంలో మోసపూరితంగా, దొడ్డిదారిన అధికారంలోకి రావాలని చేస్తున్న కుటిల ప్రయత్నాలను త్రిప్పికొట్టాలని జనవిజ్ఞాన వేదిక జిల్లా నాయకులు నరేందర్, సీపీఐ(ఎం) ,సీఐటీయూ జిల్లా నాయకులు ఎస్. మల్లేష్ల అన్నారు. శుక్రవారం అచ్చంపేట మండలంలోని సింగారం గ్రామంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఆ శాఖ కార్యదర్శి బక్కయ్య అధ్యక్షతన నిర్వహించిన తెలంగాణ రైతాంగా సాయుధ పోరాట వార్షికోత్సవ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాఖ కార్యదర్శి బక్కయ్య, సీనియర్ నాయకులు చిన్న అంజనేయలు, మాజీ సర్పంచ్ బాల్ లింగయ్య, సుందరయ్య,శ్రీను,పెద్ద ఆంజనేయలు, పాల్గొన్నారు.
నారాయణపేట టౌన్ : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఏమాత్రం ప్రమేయం లేని భారతీయ జనతా పార్టీ హిందూ ముస్లిం పోరాటంలో చిత్రీకరించి రాజకీయ లబ్ధి పొందాలని దుర్మార్గమైన చర్యలను ప్రజలందరూ గ్రహించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆర్. వెంకట్రాములు అన్నారు. దామరగిద్ద మండల కేంద్రం లో వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘం ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవ సభకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటం కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో నైజాం రాజుకు వ్యతిరేకంగా గ్రామాలలో భూస్వామ్య పెత్తందారులకు వ్యతిరేకంగా సాగిన మహత్తర పోరాట ఫలితమే తెలంగాణ రాష్ట్రంలో 10 లక్షల ఎకరాల భూములు, పేదలకు పంచిన చరిత్ర కమ్యూనిస్టులదని అన్నారు. అనంతరం సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి జి. వెంకటరామరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటానికి తలోగ్గిన నైజాం రాజు భారత యూనియన్ లో తెలంగాణ విలీనం అయిందన్నారు. తెలంగాణలో పేదల వెట్టి చాకిరి విముక్తి ఎర్రజెండా పార్టీ ఫలితమేనని గుర్తుచేశారు. అన్నారు. పేట జిల్లాలో పేదలు సాగు చేసుకుంటున్నా భూములు కంసాన్ పల్లి ,మరికల్ తదితర గ్రామాలలో పేదలు సాగు చేసుకుంటున్నా భూములకు పట్టాలు ఇవ్వకుండా భూములను బలవంతంగా లాక్కోవాలని రాష్ట్ర ప్రభుత్వం రైతుల మీద దాడి చేస్తుందని అన్నారు. రానున్న రోజులలో తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో భూ పోరాటాలు సాగాలని అన్నారు. కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గోపాల్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి అంజి లయ గౌడ్, జోషి, శివకుమార్, ముస్తాపెట్ సర్పంచ్ లాలప్ప, రాములు, హనుమంతు, నర్సింలు, రామకృష్ణ,అశోక్, పార్వతమ్మ పాల్గొన్నారు.