Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాక్షస పాలనలో ఖైదీల కోసం ప్రత్యేక గదులు
- లింగాల, మన్ననూరు,అప్పంపల్లిల ప్రత్యేకం
- అండమాన్‌ను తలపిస్తున్న జైల్కానాలు
అండమాన్, నికోబార్ దీవులలో ఉండేవిదంగా నైజం కాలం నాటి జైల్కానాలు తలపిస్తున్నాయి.వారి రాక్షస క్రీడలకు ఇవి సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఎదురుతిరిగినా.. ప్రశ్నించినా... జైలులో పెట్టి చిత్రహింసలకు గురిచేసే వారని తెలుస్తోంది. ముఖ్యంగా అటవీ ప్రాంతమైన మన్ననూరు, లింగాలతో పాటు అప్పంపూర్లో సైతం జైల్కానాలు ఉండేవి. ఇప్పటికీ వాటి ఆనవాళ్లు మనకు కనిపిస్తాయి. గాలి, వెలుతు లేకుండా బయటి సమాజానికి ఎటువంటి సంబందం లేకుండా వీరిని ఖైదీలను నిర్బందిస్తారు. తెలంగాణ సంబరాల సందర్బంగా నవతెలంగాణ ప్రత్యేక కథనం.
నవతెలంగాణ-మహబూబ్‌నగర్ ప్రాంతీయప్రతినిధి
నైజాం కాలంలో అప్పటి పాలనకు అద్దంపటే జైలుకానాలు నేటీకీ దర్శన మిస్తాయి. ముఖ్యంగా నల్లమల అటవీ ప్రాంతంలోని మన్ననూరులో నైజాం కాలంలో ఏర్పాటు చేశారు. జిల్లాలో ఎక్కడ అల్లర్లు జరిగినా దట్టమైన అటవీ ప్రాంతమయిన ఈ జైల్కానాలో వేస్తారు. ఇందులో ఉన్నట్లు ఎవరికీ ఎటువంటి సమాచారం ఉండదు. ఇక్కడ సెల్‌పోన్, రవాణా సౌకర్యం ఉండేది కాదు. ఇక్కడ నిర్బందిస్తే...ఎవరికీ తెలియదు. అప్పట్లో రాజాకర్ల వ్యవస్థకు ఎదురుతిరిగిన వారిపై నిర్బందాలు పెట్టి జైలుకు పంపే వారు. ఇక సీసి కుంట మండలం కౌకుంట్ల గ్రామం లోనూ ఓ జైలు ఉంది. నైజాం పాలనకు వ్యతిరేకంగా ఈ ప్రాంతంలో అనేక ఉద్యమాలు చేసేవారు. ఉద్యమంలో పనిచేసిన వారిని గుర్తించి ఇదే జైలులో వేసేవారు. అప్పట్లలో అప్పంపల్లి, కౌకుంట్ల, వడ్డెమాన్ దాసర్లపల్లి తధితర ప్రాంతాలలో అనేక పోరాటాలు చేసేవారు. ఒక వైపు దేశ స్వతంత్య్రం కోసం మరో వైపు స్వతంత్య్ర తెలం గాణ కోసం చేసే పోరాటాలు చేసిన వారిని కటకటాలలో వేసేవారు. నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండల కేంద్రంలోనూ.. ఓ జైలు ఉంది. ఇక్కడ దొంగతనాలు చేసిన వారితో పాటు ఉద్యమాలు చేసిన వారిని జైలులో పెట్టే వారు. ఉద్యమ కారుల కోసం ఏర్పాటు చేసిన జైలుకానాలు నేటికి మనకు దర్శనమిస్తాయి. ఈ కానాలు చూస్తే... మనకు నైజాం పాలన ఎంతటి వికృతంగా సాగిందో మనకు అవగతం అవుతుంది.
ఉద్యమాలకు అనచడానికే పెద్దపీట
పోలీసు స్టేషన్ల సంఖ్య పెరుగుతుందంటే పాలనలో పారదర్శకంగా జరగడం లేదనేది వాస్తవం. పాలకులపై ప్రజలకు నమ్మకం కోల్పోయిందంటే అందోళనలు మొదలవుతాయి. దాంతోనే ఉద్యమాలు ఉద్బవిస్తాయి. అందుకే పోలీసు స్టేషన్ల సంఖ్య పెంచడంతో పాటు సిబ్బందిని రెట్టింపు చేస్తారు.నైజాం కాలం నుండి నేటి వరకు పోలీసుల చేత ఉద్యమాలను అనిచవేసేందుకు కుటిల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికైన పాలకులు నిర్బందాన్ని పెట్టకుండా ప్రజాసామ్మ బద్దంగా వ్యవహరిస్తే... ఈ పోలీసులు రక్షణ వ్యవస్థ అవసరము లేదు. తెలంగాణ సాయుదపోరాటం మొదలుకొని తెలంగాణ ఉద్యమం తధిత ఏ ఉద్యమాలు అయినా... పాలకుల పద్ధతి మార్చుకోకపోవడం వల్లనే పోరాటాలు పుట్టుకవస్తాయని పలువురు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.