Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నారాయణపేట టౌన్ : కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను రద్దు చేయాలనిసీఐటీయూ రాష్ట్ర నాయకులు శ్రీకాంత్ అన్నారు. జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన జిల్లా కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా సిఐటియు రాష్ట్ర నాయకులు శ్రీకాంత్ హాజరై మాట్లాడుతూ కార్మికులను కట్టు బానిసలుగా మార్చే కార్మిక కోడ్లను వెంటనే రద్దు చేయాలని అన్నారు. అసెంబ్లీలో ప్రకటించిన విధంగా వీఆర్ఏలకు పే స్కేల్ వెంటనే అమలు చేయాలని వీఆర్ఏల సమ్మెను విరివింప చేయాలని అన్నారు. బడా కార్పొరేట్ శక్తులకు లక్షల కోట్ల రూపాయలు లాభాలను రాయితీలను అందిస్తున్న పాలకులు శ్రమ చేసే కార్మికులకు మాత్రం కనీస వేతనం అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ తదితర ధరలు మోడీ వచ్చిన తర్వాత రెట్టింపు స్థాయిలో పెరిగాయని అన్నారు. ఈ సమావేశంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు జి. వెంకటరామరెడ్డి సిఐటియు జిల్లా కార్యదర్శి బలరాం ఉపాధ్యక్షులు పి. ఆంజనేయులు జోషి నాయకులు కాశీనాథ్, కృష్ణయ్య, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఈర నాగూర్, శంకర్ ,మధ్యాహ్న భోజన సంఘం నాయకులు క్షేత్ర సహాయకుల సంఘం నాయకులు బి. కాశీనాథ్ ,భీమేష్ పాల్గొన్నారు.