Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అయిజ : రైతుల పాలిట శాపంగా మారిన ధరణి అని రాష్ట్ర ఓబిసి కార్యదర్శి మాస్టర్ షేక్షావలి ఆచారి అన్నారు. అయిజ పాత బస్టాండ్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో రాష్ట్ర ఓబిసి కార్యదర్శి మాస్టర్ షేక్షావలి ఆచారి టిఆర్ఎస్ ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు.భూ సమస్యలు సరిదిద్దడానికి ధరణి పేరుతో ఎకరాకు 2500 రూపాయలు కట్టించుకుని రెవెన్యూ అధికారులు రిజెక్ట్ కొట్టేస్తూ నెలకు జిల్లాలో యాభై నుంచి అరవై లక్షల రూపాయలను ప్రభుత్వం ...రైతుల నుండి దండు కుంటుందన్నారు. .రైతులను చెప్పులరిగేలా ఎమ్మార్వో కార్యాలయం చుట్టూ రెవెన్యూ అధికారులు తిప్పుతున్నారని తెలిపారు. ,భూ సమస్యలు పరిష్కరిస్తామని ఏర్పాటుచేసిన ధరణి పేరుతో సమస్యలను పెంచి రైతుల పక్షాన శాపంగా మార్చారని షేక్షావలి ఆవేదన వ్యక్తం చేశారు.ఈనెల 22వ తారీకు వరకు రెవెన్యూ అధికారులకు సమయం ఇస్తున్నాము అంతవరకు రైతుల సమస్యలు పరిష్కరించకపోతే ఈ నెల 23న జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ముట్టడి రైతుల పక్షాన చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ఉత్తనూర్ జయన్న నాయకులు మద్దిలేటి, హనుమన్న, మాస్టర్ అడ్వకేట్ మధు ,బసవరాజు,తదితరులు పాల్గొన్నారు.