Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ- వనపర్తి
పట్టణంలోని వివిధ కాలనీలో నివాసముంటున్న అర్హులైన నిరుపేదల అందరికీ డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వనపర్తి పట్టణంలోని 18, 19, 20వ వార్డులలో ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పుట్ట ఆంజనేయులు మాట్లాడుతూ ఇళ్లస్థలాలకు పట్టాలిచ్చిన వారికి డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని లేదా స్థలం చూపి ఇల్లు నిర్మాణానికి లోను రూ.5 లక్చలు మంజూరు చేయాలన్నారు. అర్హులైన పేదలకు వద్ధులు, వితంతువులు, వికలాంగులకు ,57 దాటిన వాళ్ళందరికీ వద్ధులకు కూడా పింఛన్లు ఇవ్వాలన్నారు. పెళ్లిళ్లైనా కుటుంబాలలో అందరికీ రేషన్ కార్డులు ఇవ్వా లన్నారు. తదితర సమస్యలతో పాటు అరులైన పేదలందరికీ ఇళ్లస్థలాలు ఇవ్వాలన్నారు. ఈనెల 20న తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టనున్నట్టు తెలిపారు. అందులో భాగంగా అన్ని ఏరియాలలో వ్యక్తిగత దరఖాస్తులు రాయడం జరుగుతోందన్నారు. ఈ దరఖాస్తులతోనా తాసిల్దార్ కు వినతిపత్రం వ్యక్తిగత దరఖాస్తులు ఇవ్వనున్నట్లు తెలిపారు. మంత్రి నిరంజన్ రెడ్డికి, జిల్లా కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ సమస్యల పరిష్కారం అయ్యేవరకు దశల వారీగా పోరాటాలు నిర్వహిస్తామని ఆంజనేయులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎం.రాజు, సీఐటీయూ జిల్లా నాయకులు గోపాలకృష్ణ, డి.కురుమయ్య, ఎన్.రాములు, ఏ.రమేష్, కవీపీఎస్ జిల్లా నాయకులు గంధం గట్టయ్య, రైతు సంఘము జిల్లా ఉపాధ్యక్షులు పరమేశ్వరాచరి,భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.