Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహబూబ్ నగర్ : 1940 8 సెప్టెంబర్ 17వ తేదీన జరిగిన ఘటనకు సంబంధించిన సుందర్లాల్ కమిషన్ నివేదికను బహిర్గతం చేయాలని పలువురులు నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని విజన్ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో సెప్టెంబర్ 17 వాస్తవాలు అబద్ధాలు అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశానికి అనీఫ్ అహ్మద్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ 1948 సెప్టెంబర్ 13 వ తేదీ నుండి 17వ తేదీ వరకు తెలంగాణ స్టేట్ లో భారత ప్రధాని నెహ్రూ కేంద్ర హౌమ్ మినిస్టర్ సర్దార్ వల్లభారు పటేల్ నాయకత్వంలో తెలంగాణ పల్లెల్లో కాల్పులు ఊచకోతలు జరిగినట్లు ఆ వక్తలు గుర్తు చేశారు. విలీనం అనే పేరుతో భారత సైన్యం పోలీసులు జరిపిన కాల్పుల్లో 50 వేల నుండి లక్ష మంది ప్రజలు చనిపోయినట్లు ఆ నివేదికలో ఉందని వారు అనుమానం వ్యక్తం చేశారు.దొడ్డి కొమరయ్య అమర అనంతరం తెలంగాణ సాయుధ రైతంగా పోరాటం పల్లెల్లో వెల్లువెరిసిందని వారు తెలిపారు దాదాపు 3000 గ్రామాల్లో ఈ పోరాటం జరిగినట్లు వారు గుర్తు చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సుందర్లాల్ కమిషన్ నివేదికను బయటపెట్టి ప్రజలకు వాస్తవాలు తెలుపాలని వారు కోరారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో రాఘవాచారి ఖాళీ బుచ్చిరెడ్డి అనిమల్ ప్రసంగించారు.