Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - తిమ్మాజిపేట
మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన లంబాడి ప్రజా ప్రతినిధులు అధికారులు శనివారం ఆదివాసి గిరిజన సమ్మేళనానికి తరలి వెళ్లారు. ఆదివాసి గిరిజన సమ్మేళనానికి మండలానికి రెండు బస్సులు కేటాయిస్తున్న విషయం పై సమాచారం ఇవ్వలేదని మాజీ ఎంపీపీ జయలక్ష్మి అధికారులపై సంతృప్తి వ్యక్తం చేశారు. హైదరాబాదులో సీఎం కేసీఆర్ ఆదివాసి బంజారా భవన్ లను ప్రారంభించేందుకు తిమ్మాజిపేట మండలాల నుంచి వార్డు సభ్యులు సర్పంచులు అధికారులు మొత్తం 75 మంది గాను రెండు బస్సులలో తరలిరా అని రావాలని జిల్లా అధికారులు రెండు రోజుల ముందు మండల అదికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు మాత్రం బయలుదేరే ముందు సమాచారం ఇవ్వడం పట్ల తాము మండలంలోని గిరిజన ప్రజా ప్రతినిధులకు ఇంత తొందరలో ఎలా సమాచారం ఇవ్వగలమని కొందరు గిరిజన నాయకులు అసంతృప్తీర్థం చేశారు. ఎంపీపీ రవీంద్రనాథ్ రెడ్డి జెడ్పిటిసి సభ్యులు దయాకర్ రెడ్డి సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు వేణుగోపాల్ గౌడ్, పార్టీ మండల అధ్యక్షుడు జోగు ప్రదీప్ అధికారుల తీరు పట్ల అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు అధికారులు సమాచారాన్ని ఇవ్వకపోవడంతో అద్దె వాహనాలు మాట్లాడుకున్నామని ఇప్పుడు బస్సులు వచ్చాయని చెప్తే ఎలా అని బస్సులు తమ గ్రామానికి వస్తేనే సీఎం మీటింగ్ కు వస్తామని కొందరు గిరిజన నాయకులు చెప్పడంతో అధికారులు ఆర్టీసీ బస్సును పుల్లగిరి తండాలకు పంపించారు. తాసిల్దార్ కార్యాలయం సమీపంలో ఆర్టీసీ బస్సులో గిరిజన ప్రజా ప్రతినిధులను ఎక్కించి పంపించే వరకు మండల ప్రజా ప్రతినిధులు అక్కడే ఉండి పంపించారు. ఎంపీడీవో భాస్కర్, ఎంపీ ఓ బ్రహ్మచారి, గిరిజన నాయకులు హర్యానాయక్, తారసింగ్, చందు నాయక్, కృష్ణ, లోకేష్, రవి నాయక్, కేశ్యా, పాండు, ఇద్దరు పోలీసులు ఆదివాసి గిరిజన సమ్మేళనానికి తరలి వెళ్లిన వారిలో ఉన్నారు.
బాలానగర్: హైదరాబాద్ నడిబొడ్డున బంజారాహిల్స్ లో :సంత్ సేవాలాల్ బంజారా భవన్, ఆదివాసీ భవన్ 43కోట్లతో నిర్మాణం చేపట్టి నేడు ప్రారంభోత్సవాలు చేసి గిరిజన జాతికి అంకితం చేసిన అనంతరం ఎన్టీఆర్ స్టేడియంలో గిరిజన సమ్మేళనం, బహిరంగ సభ లో శనివారం ముఖ్యమంత్ర కెసి ఆర్ ప్రసంగిస్తు వారం రోజులో గిరిజన రిజర్వేషన్ 10 శాతం పెంచుతు జిఓ జారీ చేస్తానని, ఆలాగే గిరిజన బంధు పథకం అమలు, పొడు భూముల పట్టాలు ఇస్తామని సభలో ప్రకటించడం సంతోషాదాయకం, చారిత్మక నిర్ణయం, యావత్తు గిరిజన జాతి సిఏం కేసీఆర్ గారికి రుణపడి ఉంటామని తెలిపారు.
మిడ్జిల్: తెలంగాణ రాష్ట్రంలో గిరిజన తెగ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర రాజధాని హైదరాబాదులో నిర్మించిన సేవాలాల్ బంజారా భవనం ప్రారంభోత్స వానికి మిడ్జిల్ మండలం నుండి గిరిజన భారీ సంఖ్యలో బయలుదేరారు. ఈ సందర్భంగా జెడ్పిటిసి శశిరేఖ బాలు తాసిల్దార్ శ్రీనివాసులు ర్యాలీని ప్రారంభించారు. గిరిజనుల అభివృద్ధి కోసం పాటుపడుతున్న కేసీఆర్ ప్రభుత్వానికి తప్పకుండా అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో , సాయి లక్ష్మి ఎంపీ ఓ అనురాధ ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు లక్ష్మణ్ పవర్ విజయ్ నాయక్, అధికారులు, ప్రజా ప్రతినిధులు. పాల్గొన్నారు.
పానగల్ : రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు నిర్మించిన కుమ్రంభీం ఆదివాసి సేవలాల్ బంజారా భవనాలు ప్రభుత్వం ప్రారంభం కార్యక్రమాన్ని పాన్గల్ మండలం నుండి అన్ని గ్రామ పంచాయతీలో ప్రజాప్రతినిధులు గిరిజన సంఘాలు నాయకులు తరలి వెళ్లారు ఈ సందర్భంగా తెలంగాణ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు బాలు నాయక్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గిరిజ నులకు భవనం నిర్మించడానికి చేసిన కృషిని వారు అభినందనలు తెలిపారు దాంతోపాటు గిరిజనులకు రావాల్సిన 10 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని గిరిజన తండాల్లో మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఆ గ్రామాల సర్పంచులు శాంతమ్మ దేవ్ సింగ్ ,రంగ నాయక్ ,గిరిజనుల ప్రజాప్రతినిధులు ఉద్యోగ సిబ్బంది మహిళా సంఘాలు పాల్గొన్నారు.