Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఊరుకొండ
వీఆర్ఏల న్యాయబద్ధమైన డిమాండ్లను నెరవేర్చేవరకు వీఆర్ఏల నిరసన దీక్షకు కాంగ్రెస్ పార్టీ మద్దతు పూర్తిగా ఉంటుందని..బహిరంగంగా ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త జనంపల్లి అనిరుధ్ రెడ్డి, అడ్వకేట్ ఉమ్మడి జిల్లా సెక్రటరీ సుభాష్ మాదిగ లు ఆన్నారు. శనివారం 55వ రోజు నిరవధిక సమ్మెలో భాగంగా వారు పూర్తి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వీఆర్ఏలకు పే స్కేల్ జీవోను వెంటనే అమలు చేయాలని, అర్హులైన వారికి ప్రమోషన్స్ కల్పించాలని, 55 సంవత్సరాలు పైబడిన వారి స్థానంలో వారి వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని, మరణించిన వీఆర్ఏల స్థానంలో వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఊరుకొండ మండల వీఆర్ఏ జే ఏ సి చైర్మన్ బీ. సత్తయ్య, కో చైర్మన్ బీ.రమేష్ , జెర్నల్ సెక్రటరీ శేఖర్, కన్వినర్ డీ.శ్రీలత, కో కన్వినర్ లు సుల్తాన్. జంగయ్య, దశరథం. యాదయ్య, యాదమ్మ, నాగమణి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.
బల్మూరు : కేసీఆర్ వీఆర్ఏలకు ఇచ్చిన హామీలను పరిష్కరించాలని కోరుతూ గత 55 రోజులుగా వీఆర్ఏలు కొనసాగిస్తున్న రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం గతంలో వీఆర్ఏలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని గత 55 రోజులుగా వీఆర్ఏలు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం తన మొండి వైఖరిని విడనాడడం లేదని వీఆర్ఏల సంఘం జేఏసీ నాయకులు విమర్శించారు. వీఆర్ఏల సమస్యలను పరిష్కరించే వరకు వీఆర్ఏ జేఏసీ సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు ఆపేది లేదని సంఘం నాయకులు హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏల సంఘం నాయకులు జహంగీర్ వెంకటయ్య నిరంజన్ ఆయా గ్రామాల వీఆర్ఏలు పాల్గొన్నారు.
ఆత్మకూర్ : ఆత్మకూరు పట్టణంలోని మండల తహసీల్దార్ కార్యాలయం ముందర గత 54 రోజులుగా నిర్వహిస్తున్న సమ్మె శనివారంతో 55వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు గోవింద్ మాట్లాడుతూ ఇప్పటివరకు జీవో వస్తుందో లేదో అని దిగులుతో 36 మంది చనిపోయారని కావున ఇప్పటికైనా ప్రభుత్వ స్పందించి ప్రకటన విడుదల చేయాలని కోరినారు. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు బి. శ్రీనివాసులు, పరమేష్, నయుం ,నాగేంద్రం, గటన, పరుశురాం, నాగరాజు, రంగన్న, రాములు, మల్లేష్, తిమ్మక్క, లక్ష్మి, మషన్న, భీమన్న ,తదితరులు పాల్గొన్నారు.