Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెప్టెంబర్ 17 కు బిజెపికి ఏంటి సంబంధం.
- కేసీఆర్ ,మోడీలపై మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి ధ్వజం.
- దేశం, రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నది ఆ ఇద్దరే.!!
నవతెలంగాణ- కందనూలు.
దేశంలో రాష్ట్రంలో సమానత్వం పేదరిక నిర్మూలన భిన్నత్వంలో ఏకత్వం పరిపాలించేలా అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచిస్తే నేడు దేశం రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కూని చేస్తున్న వ్యక్తులు మోడీ కేసీఆర్ అని మాజీమంత్రి నాగం జనార్దన్ రెడ్డి అన్నారు శనివారం సెప్టె ంబర్ 17 విలీన దినోత్సవాన్ని జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆవరణలో జాతీయ జెండా ఎగరవేశారు. అనంతరం వారు మాట్లాడుతూ బీజేపీకి సెప్టెంబర్ 17 ఎలాంటి సంబంధం లేకపోయినా కేవలం పొలిటికల్ మైలేజ్ కోసమే చేస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట సమయంలో బీజేపీకి ఎక్కడ ఉందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఒక పార్టీ సింబల్ మీద గెలిచిన ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి విలీనం చేసుకొని ప్రశ్నించే తత్వాన్ని పూర్తిగా నొక్కిస్తూ టీిఆర్ఎస్, బీజేపీ పార్టీలు ప్రజాస్వామ్యాన్ని పొందబెడుతున్నారని విమర్శించారు. దేశంలో రాష్ట్రంలో రెండు పార్టీల ముఖ్య నేతలు ముందుగా ప్రజలను సమానత్వంగా చూసుకోవాలని ఇతవు పలికారు కులాలుగా మత చిచ్చులు పెట్టి విభజిస్తూ పాలిస్తూ అవకాశ రాజకీయాలకు తరరేపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు కరోనా మహమారి యావత్ ప్రపంచాన్ని అప్పుల ఊబిలోకి నడితే భారత దేశంలో మాత్రం ప్రధాని అంబానీల ఆస్తులు లక్షల కోట్లకు ఎలా పెరిగాయని ప్రశ్నించారు. తమ పార్టీ ముఖ్య నాయకుడు రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర ద్వారా దేశం వ్యాప్తంగా బిజెపి చేస్తున్న అరాచకాలపై అవగాహన కల్పిస్తున్నారని రాబోయే కాలంలో ప్రజలు బీజేపీకి బుద్ధి చెప్తారని ఆశాభావం వ్యక్తం చేశారు తెలంగాణ తొలి ఉద్యమంలో కేసీఆర్ పాత్ర ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. టిఆర్ఎస్ నాయకులను గ్రామాల్లో బట్టలు విప్పి కొట్టే రోజులు ప్రతి దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు .కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిపాలన విధానంలో తీవ్ర మార్పులు జరగాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్న అవసరం ప్రజలపై యువతపై ఉందని ఉద్యమ బాట నడవాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అర్థం రవి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తాడూరు జడ్పీటీసీ రోహిణి రెడి,్డ నాయకులు భార్గవి, కాంగ్రెస్ నాయకులు కౌన్సిలర్లు కార్యకర్తలు పాల్గొన్నారు
ఆత్మకూరు : ఆత్మకూరు పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్గర నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కే ప్రశాంత్ రెడ్డి గారు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కొన్ని రాజ్యాలు భారతదేశంలో కాలేదు అయితే ఆపటి సర్దార్ పటేల్ ఘనతని కొనియాడారు. ఆయన నేతత్వంలో కేంద్ర బల గాలనులన నిజాం నవాబు మీదకు పంపడంతో నిజాం లొంగీ భారత దేశంలో విలీనం చేయబడిందన్నారు. అదేవిధంగా 2014 నందు తెలంగాణ ఏర్పాటు సందర్భంగా సోనియగాంధీ పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టి తెలంగాణకు ఎంతో దోహద పడిందని పేర్కొన్నారు.కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు నల్గొండ శ్రీని వాసులు,గణేష్ ,రవీందర్,బుచ్చన్న,వినరుకుమార్రెడ్డి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
వనపర్తి టౌన్: వనపర్తి జిల్లా కేంద్రంలో తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా వనపర్తి జిల్లా , పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డి కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం ఘనంగా నిర్వహి ంచారు.తెలంగాణ విమోచన దినోత్సవం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వనపర్తి జిల్లా అధ్యక్షులు శంకర్ ప్రసాద్ హాజరై మాట్లాడుతూ, నిజాం కబంధ హస్తాల నుండి హైదరాబాద్ సంస్థానం విముక్తి సెప్టెంబర్ 17 న సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలంగాణ విమోచన దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతయ్య, రాష్ట్ర నాయకురాలు ధనలక్ష్మి, రాష్ట్ర మైనార్టీ నాయకులు అక్తర్, మైనార్టీ నాయకులు అనిస్ జిల్లా మహిళా అధ్యక్షురాలు కమ్మర్ రెహమాన్ మత్స్యకార జిల్లా చైర్మన్ యాదయ్య మున్సిపల్ కౌన్సిలర్ ఫ్లోర్ లీడర్ రాధాకృష్ణ, మాజీ కౌన్సిలర్ చీర్ల చందర్, ద్యారపోగు శివ, ద్యారపోగు శివశంకర్, ఇంద్ర నాగన్న, బి వెంకటేష్ యాదమ్మ తదితరులు పాల్గొన్నారు
బిజినాపల్లి : మండల కేంద్రంలోని మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కూచుకుల్ల సుహాసన్ రెడ్డి మాట్లాడుతూ దేశానికి స్వతంత్రం వచ్చిన నాటికి దేశంలో 584 స్వతంత్ర సంస్థానాలు ఉండేవి ఆ సంస్థానాలను నేటి భారతదేశంలో ఐక్యం చేయాలని సంకల్పించింది. నవభారత రూపశిల్పి తొలి ప్రధాని జవహరలాల్ నెహ్రూ ఆ కార్యాన్ని ఒక దీక్షతో పూర్తిచేసిందన్నారు.కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారి పర్వతాలు, ఉపసర్పంచి మిద్దె రాములు, నెల్లికంటి గోపాల్ రెడ్డి, వార్డు మెంబర్ పండ్ల భాష వెంకటేష్ గౌడ్,మహేందర్, మంగనూరు బాలరాజు, సోషల్ మీడియా ఇంచార్జి మ్యాటర్ సత్యం, గంగారం శీను, బాల్య నాయక్ తదితరులు పాల్గొన్నారు.
మహబూబ్ నగర్ : తెలంగాణ ప్రాంతంలో నిజాం నవాబుకు వ్యతిరేకంగా సాగిన సాయుధ పోరాటం ఒక చారిత్రాత్మక ఘట్టమని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కొత్వాల్ అన్నారు. శనివారం పార్టీ కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేసి తెలంగాణ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణలో రజాకాలు నిజాం నవాబుకు వ్యతిరేకంగా భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం సాయుధ పోరాటం సాగిందని తెలిపారు. ఈ పోరాటంలో బిజెపి పార్టీ పాల్గొనలేదని వారు తెలిపారు. నేడు స్వార్ధ రాజకీయాల కోసం టిఆర్ఎస్ బిజెపి పార్టీలు ప్రజలకు తప్పుడు సమాచారాన్ని చేరవేయడం అన్యాయమని ఆరోపించారు. ప్రజలు వాస్తవాలను తెలుసుకొని ఈ రెండు పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సత్తూరు చంద్రశేఖర్ గౌడ్. సంజీవ్ ముదిరాజ్. సి జే బెనర్. లక్ష్మణ్ యాదవ్. సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.