Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు దేశానికి తెలంగాణ ఆదర్శం
- రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్
- రాచరిక పాలన నుండి ప్రజాస్వామ్యంలోకి: మంత్రి నిరంజన్‌రెడ్డి
- జాతీయ దినోత్సవంగా జరుపుకుందాం: రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదరు రాజీవ్ శర్మ
- అమరుల స్ఫూర్తిని కొనసాగిద్దాం: ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు
- ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా సమైక్యత వజ్రోత్సవ వేడుకలు
నవతెలంగాణ-మహబూబ్‌నగర్
70 ఏళ్ల స్వాతంత్ర భారతదేశంలో తెలంగాణ ప్రాంతం అస్తిత్వం కోసం ఆరాటపడిందని రాష్ట్ర ఎక్సైజ్ క్రీడలు సాంస్కృతిక సమాచార శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శనివారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పోలీస్‌పెరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన జాతీయ సమాఖ్యత వజ్రోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్ర మంలో పాల్గొన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ జాతీయ జెండా ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన అభివద్ధి శకటాలు, విద్యార్థుల కళా ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అనంతరం మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ దేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాల వజ్రోత్సవ వేడుకలను జరుపుకుం టున్నా తెలంగాణ ప్రాంతం తన అస్తిత్వాన్ని నిలబెట్టుకో వడానికి ఇన్నేళ్లు ఆరాటపడడం తప్ప అభివృద్ధి జరగలేద న్నారు. భూమి కోసం, భుక్తి కోసం పోరాడిన నేల ఈ తెలంగాణ ప్రాంతమన్నారు. దొడ్డి కొమరయ్య అమరుడ య్యాక తెలంగాణ ప్రాంతంలో జాగీర్, జమీందార్లకు వ్యతి రకంగా పెద్ద ఎత్తున వీరోచిత పోరాటం సాగిందన్నారు. ఆనాటి పోరాటం తెలంగాణ పోరాటానికి నాంది పలికింద న్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆంధ్ర పాలకుల చేతిలో తెలంగాణ అభివృద్ధి చెందలేదని ఆరోపించారు. తెలంగాణ ఏర్పడిన ఏడు సంవత్సరాల తర్వాత ముఖ్య మంత్రి ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ ఫలాలు ప్రజలకు నేరుగా చేరు తున్నాయని గుర్తు చేశారు. ఇక్కడి పథకాలు వివిధ రాష్ట్రాల్లో అమలు చేయడం మనకెంతో గర్వకారణంగా ఉందన్నారు. రాష్ట్రంలో అతి వేగంగా అభివృద్ధి చెందు తున్న జిల్లాలో మహబూబ్‌నగర్ మొదటి వరుసలో నిలబడ డం ఎంతో గర్వంగా ఉందన్నారు. ప్రజలిచ్చిన ఈ స్ఫూర్తి తో ఈ ప్రాంతాన్ని మరింత వేగంగా అభివృద్ధి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీ వెంకటేశ్వర్లు, జడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్‌రెడ్డి , అదన కలెక్టర్లు తేజస్ నందలాల్ పవర్ , సీతారామయ్య ఇతర జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
మహబూబ్‌నగర్ ప్రాంతీయ ప్రతినిధి : భారతదేశ నిర్మాణంలో తెలంగాణా భాగం పంచుకున్న ఈ రోజును జాతీయ సమైక్యత దినంగా నిర్వహించుకుంటున్నామని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు డాక్టర్ రాజీవ్ శర్మ అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన సమైక్యతా వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జిల్లా పరిషత్ చైర్ప ర్సన్ సరితా తిరుపతయ్య, జిల్లా అదనపు కలెక్టర్ శ్రీహర్ష, జిల్లా ఎస్పీ రంజన్ రతన్‌కు మార్, ఎమ్మెల్యేలు డాక్టర్ అబ్రహం, బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో కలిసి ఆయన జాతీయ పతాకం ఎగుర వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 74 సంవత్సరాల క్రితం ఇదే రోజున మన తెలంగా ణ భారతదేశంలో అంతర్భాగం గా మారిందన్నారు. భార తదేశ నిర్మాణంలో తెలంగాణ భాగం పంచుకున్న రోజును జాతీయ సమైక్యతా దినోత్సవం గా ఘనంగా నిర్వహించు కుంటున్నామన్నారు. 75 ఏళ్ళ స్వతంత్ర భారతంలో తెలం గాణ 60 సంవత్సరాల పాటు అస్తిత్వం కోసం ఉద్యమించిం దని, నేడు స్వరాష్ట్రమై అన్ని రంగాల్లో అద్భుతమైన అభివృద్ధిని సాధిస్తూ, అనతికాలం లోనే దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా రూపుదాల్చిందని అన్నారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతి క కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బి.ఎస్.కేశవ్, జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
ధరూర్: గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు పురస్క రించుకొని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి జాతీయ జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బి యస్, కేశవ్ జిల్లా గ్రంధాలయ ఛైర్మన్ జంబు రామన్ గౌడ్, వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ రామేశ్వరమ్మ, ఎంపీపీ ప్రతాప్ గౌడ్, వైస్ చైర్మన్ బాబర్, కౌన్సిలర్స్, గద్వాల టౌన్ పార్టీ అధ్యక్షుడు గోవిందు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ధరూర్ మండలం బూరెడిపల్లి గ్రామంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ బండ్ల జ్యోతి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రంగస్వామి, వార్డు మెంబర్లు సత్యనారాయణ రెడ్డి, రామన్న, టీఆర్ఎస్ నాయకులు విజరు,రఘునాథ్ రెడ్డి,శివశంకర్ రెడ్డి,ఆనంద్ రెడ్డి,వీరయ్య,సత్యన్న,నర్సిములు, మధుమతి తదితరులు పాల్గొన్నారు.
వనపర్తి : పట్టణంలోని ఐడిఓసి ప్రాంగణంలో జిల్లా పరిషత్ చైర్మన్ ఆర్. లోకనాథ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా, జిల్లా ఎస్పీ అపూర్వరావుతో కలిసి వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి జాతీయ పతాకం ఎగుర వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ చరిత్రలో 1948 సెప్టెంబర్ 17న తెలంగాణ భారతదేశంలో అంతర్భాగంగా మారిందన్నారు. ఈ సంద ర్భంగా జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటున్నామన్నారు. ఆగస్టులో భారత స్వాతం త్య్ర వజ్రోత్సవాల వేడుకలను దేశంలో ఏ రాష్ట్రం నిర్వహిం చనంత ఘనంగా ప్రజలందరి గుండెల్లో దేశభక్తి భావన పెల్లుబికేలా 15 రోజులపాటు వైభవంగా జరుపుకున్నామని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం మూడు రోజుల పాటు జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల వేడుకలను నిర్వహించు కుంటున్నట్లు ఆయన సూచించారు. తెలంగాణ ప్రజా స్వామిక స్వేచ్ఛను పొందడం కోసం ఆనాటి యోదుల త్యాగాలు వెలకట్టలేనివన్నారు. వారిని స్మరించుకోవడం మనబాధ్యత అని అన్నారు. తెలంగాణ అనతికాలంలోనే దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా రూపుదాల్చిందన్నారు. ఈ కార్యక్రమంలో దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, జిల్లా అధికారు లు, ప్రజా ప్రతినిధులు తదతరులు పాల్గొన్నారు.
కందనూలు: నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన వేడుకలకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణా సాయుధ పోరాటంలో అసువులు బాసిన ఉద్యమకారుల స్ఫూర్తిని కోనసాగిస్తు జిల్లాను అభివద్ధి పథంలో ఉంచేందుకు కృషిచేస్తున్నా మన్నారు. తెలంగాణ రాష్ట్రం ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి జాతీయ స్థాయిలో అవార్డులు సాధిస్తూ ఆదర్శవంతంగా నిలుస్తుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకా లను జిల్లాలో సమర్థవంతంగా అమలు చేస్తూన్న జిల్లా యంత్రాంగానికి, జిల్లా లో శాంతిభద్రతలు కాపాడుతున్న పోలీస్ శాఖకు ఆయన అభినందనలు తెలిపారు. అనంతరం పోలీస్‌ల గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిలా ఎస్పీ కె.మనోహర్, జిల్లా పరిషత్ చైర్మన్ పి. పద్మావతి, ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, అదనపు కలెక్టర్లు మనుచౌదరి, మోతిలాల్, డి.ఎఫ్.ఓ రోహి త్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, పోలీస్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలో అదనపు కలెక్టర్ యస్. మోతిలాల్ జాతీయ పతాకాన్ని ఎగుర వేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు సీతారాం, అనిల్ ప్రకాష్, భూపాల్ రెడ్డి, చంద్రశేఖర రావు, నర్సింగరావు, కలెక్టరేట్ ఏవో శ్రీనివాసులు, కలెక్టరేట్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
డీిఈఓ కార్యాలయంలో డీిఈఓ గోవిందరాజులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సెక్టోరల్ అధికారులు సతీష్‌కుమార్, బరపటి వెంకటయ్య సూర్య చైతన్య, సైన్స్ అధికారి కృష్ణారెడ్డి, ఎస్జి ఎఫ్ ప్రసాద్ గౌడ్, కార్యాలయ సిబ్బంది అధికారులు ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
తెలకపల్లి: మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ కొమ్ము మధు, తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ కే.తబితారాణి, పోలీస్ స్టేషన్లో ఎస్సై వి.ప్రదీప్ కుమార్, సింగిల్ విండో కార్యాలయంలో చైర్మన్ డి భాస్కర్ రెడ్డి, సిఎల్ఆర్ విద్యాసంస్థలో కే లక్ష్మారెడ్డి, గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో సర్పంచ్‌లు సురేఖ బాలగౌడ, శైలజ భాస్కర్ రెడ్డి , సుగుణ బాబు గౌడ్ జాతీయ జెండా ఎగురవేశారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీడీవో చెన్నమ్మ, ఎంపిటిసిలు ఆర్.రమేష్, లక్ష్మమ్మ, విజయలక్ష్మి, నారాయణమ్మ , రైతుబంధు మండల అధ్యక్షులు జి మాధవరెడ్డి, సింగిల్‌విండో వైస్ చైర్మన్ మామిళ్ళపల్లి యాదయ్య, టిఆర్ఎస్ మండల అధ్యక్షులు ఈదుల నరేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కోట్ల శ్రీనివాస్, ఉపసర్పంచ్ ఆర్ కృష్ణయ్య, పంచాయతీ కార్యదర్శులు, వార్డు సభ్యులు, అధ్యాపకులు, ఉపాధ్యాయు లు తదితరులు పాల్గొన్నారు.
ఆత్మకూరు: పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయాలతో సంబంధిత అధికారులు జాతీయ పతాకాలు ఎగుర వేశారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీడీఓ అబ్దుల్ మతిన్, మున్సిపల్ చైర్మన్ గాయత్రి రవికుమార్, ఎంపీపీ బంగారు శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ రమేష్, వైస్ చైర్మన్ విజయ భాస్కర్ రెడ్డి ,కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, టీఆర్ఎస్ మండల అధó్యక్షులు రవికుమార్ యాదవ్,పోలీస్ సిబ్బంది బాలేశ్వర్ రెడ్డి, రామకృష్ణ ,కృష్ణారావు ,అశోక్, ఇమామ్, తదితరులు పాల్గొన్నారు.
ఉట్కూర్: మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయా ల్లో ఆయా శాఖల అధికారులు, పంచాయతీ కార్యాలయాల్లో సర్పంచ్‌లు, ఆసియా సల్ఫియా మదర్సాలో నిర్వాహకులు జాతీయ జెండా ఎగుర వేశారు. ఆయా కార్యక్రమాల్లో తహ సిల్దార్ తిరుపతయ్య, ఎంఈఓ వెంకటయ్య, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
కొల్లాపూర్: ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి జాతీయ జెండా ఎగుర వేయగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఆయా శాఖల అధికారులు జాతీయ జెండా ఎగుర వేశారు. ఆయా కార్యక్రమాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు , టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మరికల్ : మండల కేంద్రంలోని ఆయా కార్యాలయాల్లో ఎంపీడీవో యశోదమ్మ ,తాసిల్దార్ నాగలక్ష్మి , మరికల్ గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ కె గోవర్ధన్ జాతీయ జెండా ఎగుర వేశారు. ఆయా కార్యక్రమాల్లో ఉప తాసిల్దార్ శ్రీనివాస్, ఆర్ఐ సుధాకర్ రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ గోపాల్ రావు, కార్యాల సిబ్బంది, పంచాయతి సెక్రటరీ శ్రీనివాసరావు, వార్డు సభ్యులు ప్రధానోపాధ్యాయులు మనోరంజని ఉపాధ్యాయ సిబ్బంది, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
తిమ్మాజీపేట : తహసీల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ సరస్వతి, ఎంపీడీవో కార్యాలయం వైస్ ఎంపీపీ శ్రీనివాసులు, సింగిల్ విండో కార్యాలయంలో వైస్ చైర్మన్ రాందేవ్ రెడ్డి, ఎంఆర్సి కార్యాలయం వద్ద ఎంఈఓ శ్రీనివాసులు, పోలీస్ స్టేషన్లో ఎస్సై శంషోద్దీన్, విద్యుత్ కార్యాలయం పై ఏఈ సాయన్న గౌడ్, మద్యం డిపో వద్ద డిఎం లచ్చయ్య, ఆస్పత్రి వద్ద డాక్టర్ ప్రవీణ్, గ్రంథాలయం వద్ద జిల్లా డైరెక్టర్ జయలక్ష్మి, గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ వేణుగోపాల్ గౌడ్ జాతీయ జెండా ఎగురవేశారు. ఆయా కార్యక్రమాల్లో జడ్పిటిసి సభ్యులు దయాకర్ రెడ్డి, ఎంపీపీ రవీంద్రనాథ్ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు జోగు ప్రదీప్, ఎంపీటీసీ సభ్యురాలు లీలావతి, సీఈవో నరేష్, డిప్యూటీ తాసిల్దార్ ఎంపీడీవో భాస్కర్, ఎంపిఓ బ్రహ్మచారి, మార్కెట్ డైరెక్టర్ కవిత ఉప సర్పంచ్ ఇబ్రహీం, నాయకులు స్వామి కొత్త వెంకటేష్ లింగం, సలావుద్దీన్, సైఫ్, కాళ్ల రాజు పాల్గొన్నారు. కాగా ప్రభుత్వ కళాశాలపై ఉదయం 9.30 వరకు జాతీయ జెండా ఎగరేయక పోవడంత మండల ప్రజలు విస్మయం వ్యక్తం చేశారు.
కొత్తకోట: మున్సిపల్ కార్యాలయం, చౌరస్తాలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. తహశీల్దార్ కార్యాలయం, మండల ప్రజాపరిషత్ కార్యాలయం, సింగిల్ విండో కార్యాల యంలో అధికారులు జాతీయ జెండా ఎగురేశారు. ఆయా కార్యక్రమాల్లో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ వామన్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ పొగాకు సుఖేసిని, ఎంపీపీ గుంత మౌనిక, సీడీసీ చైర్మన్ చెన్నకేషవ రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ వంశిధర్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి గాడిల ప్రశాంత్, ప్రధాన కార్యదర్శి అమ్మపల్లి బాలకృష్ణ, వైస్ ఎంపీపీ వడ్డే శ్రీనివాసులు, మండల పట్టణ ప్రజా ప్రతినిధులు , టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
గట్టు : మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ విజరు కుమార్ జాతీయ జెండా ఎగుర వేసి గాంధీ సర్కిల్ లోని మహాత్మ గాంధీజీ విగ్రహానికి జడ్పిటిసి బాసు శ్యామలతో కలిసి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో చెన్నయ్య, పిఎసిఎస్ చైర్మన్ వెంకటేష్,జడ్పీ కో అప్సన్ ఇమ్మంసాబ్, సింగిల్ విండో వైస్ ఛైర్మెన్ మహాదేవ్,ఎంపీటీసీలు ఆనంద్,రూపవతి,సింగిల్ విండో డైరెక్టర్లు సుధాకర్ గౌడ్,జి తిమ్మప్ప,మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు అంగడి బస్వరాజు,ఎస్ రాము నాయుడు, గాజుల సంతోష్, నరేష్,వెంకటేష్,హౌటల్ శివ, రాయపురం గోవిందు చాగదోన భాస్కర్ మహేష్ జై కుమార్ వెంకటేష్,వీరేష్,ఫోగకు వీరన్న, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
బిజినేపల్లి: మండలంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఆయా శాఖల అధికారులు, పంచాయతీ కార్యాలయాలపై సర్పంచ్‌లు జాతీయ జెండాలు ఎగుర వేశారు. ఆయా కార్యక్రమాల్లో అధికారులు, సిబ్బంది సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు , వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
బిజినాపల్లి మండల కేంద్రంలో సుభాష్ యువజన సంఘం కార్యాలయంలో నైజాం విముక్త స్వాతంత్ర అమృత్యోత్సవ సమితి ఆధ్వర్యంలో జెండా ఎగుర వేసి అమరవీరులను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమం లో సమితి సభ్యులు మలిశెట్టి చంద్రశేఖర్ , శ్రీనివాసులు, శివరాజ్, జానకి రాములు , సూరంపల్లి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
అమరచింత: మున్సిపల్‌కార్యాలయంలో చైర్ పర్సన్ మంగమ్మ నాగభూషణం గౌడ్, తహసిల్దార్ కార్యాలయంలో సింధుజ, ఆయా కార్యాలయాల్లో అధికారులు, పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు జాతీయ జెండా ఎగుర వేసి తెలంగాణ పోరాట యోధులను స్మరించుకున్నారు. ఆయా కార్యక్రమాల్లో మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ ఖాజా, మున్సిపల్ వైస్ చైర్మన్ ఎస్ గోపి, కౌన్సిలర్ సభ్యులు, లక్ష్మి వెంకటేష్, మాధవి, కో ఆప్షన్ సభ్యులు ఏపీ రాజేందర్ షానవాజ్ ఖాన్ , ఆర్ పి లు రాజేశ్వరి ,సంగీత, ఖాజా, గోపాల్ మున్సిపల్ సిబ్బంది ఎం ప్రభాకర్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
మిడ్జిల్: ఎంపీడీవో కార్యాలయంపై ఎంపీపీ కాంతమ్మ బాలస్వామి, తాసిల్దార్ కార్యాలయం పై శ్రీనివాసులు, పోలీ స్ స్టేషన్ కార్యాలయంపై ఎస్సై రామ్‌లాల్‌నాయక్, పిఎసి ఎస్ కార్యాలయంపై చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ,ప్రభుత్వ ఆసు పత్రిపై డాక్టర్ వంశీప్రియ, పాఠశాలల్లో ఉపాధ్యాయులు జాతీయ జెండా ఎగురవేశారు. ఆయా కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, మండల శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
వంగూరు: మండలం లోని ప్రభుత్వ , ప్రైవేటు పాఠ శాలలు, కార్యాలయాలపై అధికారులు జాతీయ జెండాలను ఎగుర వేశారు. ఆయా కార్యక్రమాల్లో తాహసిల్దార్ రాజు నాయక్, ఎంపీడీవో పవన్ కుమార్ , వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు , ఉపాధ్యాయులు టిఆర్ ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మహమ్మదాబాద్: తాసిల్దార్ కార్యాలయంపై తాసిల్దార్ అంజనేయులు, మండల వ్యవసాయ కార్యాలయంపై ఏవో కృపాకర్‌రెడ్డి, పోలీస్ స్టేషన్‌పై ఎస్ఐ రవిప్రకాష్, మండల పరిధిలో ఆయాగ్రామాలలో ప్రభుత్వ కార్యాలయాలపై సర్పంచులు అధికారులు జాతీయ జెండాను ఆవిష్కరిం చారు. ఆయా కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ చంద్రశేఖ ర్, ఆర్ఐ యాదయ్య, ప్రజా ప్రతినిధులు ,ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.
పెంట్లవెల్లి :తహసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ దామోదర్, పోలీస్‌స్టేషన్‌లో ఎస్సై రమేష్ ఆయా కార్యాల యాల్లో అధికారులు, పాఠశాలల్లో ఉపాధ్యాయులు, గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీడీవో రామయ్య ,ఆర్ఐ వెంకటేశ్వర్లు, ఏపీఓ గౌస్, సర్పంచ్ సువర్ణమ్మ, రామన్ గౌడ్, సురేందర్ గౌడ్, జిల్లా కోఆప్షన్ మెంబర్ మతిన్, మాజీ మార్కెట్ డైరెక్టర్ హనుమంతు, ఆయా గ్రామాల సర్పంచులు ఖాజా, ఎన్.గోపాల్, తిరుపాటి నాగరాజు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
వెల్డండ: మండలంలోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, గ్రామ పంచాయతీ కార్యాలయాలై అధికారులు, ప్రజాప్రతినిధులు జాతీయ జెండా ఎగురవేశారు. ఆయా కార్యక్రమాల్లో తహసీల్దార్ టి.చంద్రశేఖర్, నయబ్ తాసిల్దార్ వరలక్ష్మి , అధికారులు శైలజ, శంకర్, జెడ్పిటిసి విజితారెడ్డి, ఎంపీపీ విజయ, టిఆర్ఎస్ మండల అధ్యక్షులు యెన్నం భూపతిరెడ్డి, బిజెపి మండల అధ్యక్షుడు విజేందర్‌రెడ్డి, నా యకులు జంగయ్య యాదవ్, జంగయ్య, రైతు సమన్వయ స మితి మండల అధ్యక్షులు భాస్కరరావు పాల్గొన్నారు.
ఊరుకొండ : ఎంపీడీవో కార్యాలయంపై ఎంపీపీ బక్క రాధ జంగయ్య, తహసిల్దార్ కార్యాలయం పై తాసిల్దా ర్ జాకిర్ అలీ, వివిధ కార్యాలయాలలో ఆయా శాఖల అధికా రులు, ప్రజా ప్రతినిధులు జాతీయ జెండాలను ఎగరవేశారు. ఆయా కార్యక్రమాల్లో మండల ప్రజా ప్రతినిధులు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.
బల్మూరు: మండల పరిషత్ కార్యాలయం వద్ద ఎంపీపీ వేనేపల్లి అరుణ నరసింహారావు , తహసిల్దార్ కార్యా లయం వద్ద తహసిల్దార్ కృష్ణనాయక్, గ్రామపంచాయతీ వద్ద సర్పంచులు, ప్రభుత్వ కార్యాలయ వద్ద ఆయా శాఖల అధికారులు, పాఠశాలలపై ప్రధానోపాధ్యాయులు జాతీయ జెండా ఎగుర వేశారు. ఆయా కార్యక్రమాలలో ఆయా శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.