Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొల్లాపూర్: పట్టణంలో ఉన్న ఎస్బీఐ రెండు బ్రాంచ్‌లను కొనసాగించాలని మహిళా సమైక్య సభ్యులు డిమాండ్ చేశారు. శనివారం అంబేద్కర్ చౌరస్తాలో ఉన్న ఎస్బిఐ తొలగించొదంటూ కొల్లాపూర్, పెంట్లవెల్లి మండలాలకు చెందిన మహిళా సమైక్య సభ్యులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీఎం తిరుపతయ్య, వీఓఏ కె.రాజ్ కుమార్, వివోఏ చంద్రకళ మాట్లాడుతూ దశాబ్దాల కాలంగా ఎస్బిహెచ్గా సేవలందిస్తూ ఎస్బిఐగా మారిన బ్రాంచ్‌ను తొలగిస్తే ఏడు మండలాలకు చెందిన ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారన్నారు. ఈ బ్రాంచ్‌లో వివిధ మండలాల మహిళా సమైక్య సంఘాల ఖాతాలు ఉన్నాయన్నారు. కొల్లాపూర్ పురపాలక సంఘం కావడంతో పట్టణంలోని ప్రజల అకౌంట్స్ , లావాదేవీలు పెరగాయన్నారు. దీంతో తప్పనిసరిగా కొల్లాపూర్ పట్టణంలోని వేరువేరు ప్రదేశాల్లో ప్రస్తుతం ఉన్న విధంగానే కొనసాగించేలా జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కోరారు. సాకులు చెప్పి తొలగించాలని చూస్తే మహిళా సమైక్య ఆధ్వ ర్యంలో ధర్నా చేపడతామన్నారు. అనంతరం మేనేజర్ బి.శ్రీకాంత్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘాల నాయకులు శాంతమ్మ, లలిత, కృష్ణకుమారి, తారకేశ్వరి, వరలక్ష్మి, రాజమ్మ, చిట్టెమ్మ, ఎల్లం భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.