Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బాలరాజు
నవతెలంగాణ- మహబూబ్నగర్
ప్రభుత్వం అమలు చేస్తున్న దళిత బంధు పథకంలో జనాభా ప్రాతి పధికన మాలలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాడం బాలరాజు, మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా అధ్యక్షు డు కానుగడ్డ యాదయ్య డిమాండ్ చేశారు. శనివారం దేవరకద్ర మండలం బసాపురం గ్రామంలో మాల మహానాడు మండల అధ్యక్షుడు రాజశేఖర్ అధ్య క్షతన నిర్వహించిన సమావేశానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యా రు. ముందుగా తెలంగాణ విలీనోత్సవం సందర్భంగా తెలంగాణతల్లి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈసారి దళిత బందు పథకంలో మాలలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా రాజ్యాంగంలోని 3 ఆర్టికల్ ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిం దన్నారు. కొత్త పార్లమెంటు భవనానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరు పెట్టా లని వారు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ డబ్బా రాములు, ఉపా ధ్యక్షులు దాదర్ శ్రీనివాసులు, కార్యదర్శి గోకం చెన్నయ్య, నాయకులు రాజేందర్ రాజు మధు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.