Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నడిగడ్డ హక్కుల పోరాట సమితి నాయకులు రంజిత్‌కుమార్
నవతెలంగాణ-ధరూర్
గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పాలకులు, అధికారులు పట్టించుకోవడం లేదని నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా నాయకులు గొంగళ్ల రంజిత్‌కుమార్ ఆరోపించారు. గద్వాల మండలం పూడూరు గ్రామంలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో శుక్రవారం పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామంలో రాత్రి బస చేసి, శనివారం ఉదయం వడ్డే వీధి, కుమ్మరి వీధి, గొల్ల, కురువ, బోయవీధి , ఎస్సీ కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు తమ వార్డుల లో సిసి రోడ్లు , మురుగు కాలువల లేక ఇండ్ల మధ్య మురుగు నీరు చేరడం, పిచ్చి మొక్కలు పెరగడంతో విషసర్పాలు సంచరిస్తున్నాయని, ఈగలు, దోమలు అధికమై రోగాలబారిన పడతున్నామని వివరించారు. మా సమస్యలు తీర్చండని నాయకులను ప్రశ్నిస్తే అణగదొక్కే ప్రయత్నం చేస్తు న్నారని వాపోయారు. ఆయా వార్డులలో చాలామంది పింఛన్లు రావడం లేదని వివరించారు. పూడూరు మెయిన్ స్టేజ్ దగ్గర ట్రాన్స్ ఫార్మర్ ప్రమాదకరంగా ఉందన్నారు. మేజర్ గ్రామపంచాయతీ అయి ఉండి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా గ్రామ సభ వారే నిర్వహించుకుంటున్నారని ప్రజలు అగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైనా ఉన్నతాధికారులు వచ్చినా కూడా సమా చారం ఇవ్వడం లేదన్నారు. ఈ సందర్భంగా రంజిత్‌కుమార్ మాట్లాడుతూ గ్రామంలో అనేక సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. గ్రామస్తుల సమస్యలను అధికారులు, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. అధికారులు సమస్యలను పరిష్కరించకుంటే నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్ర మంలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా కార్యదర్శి లవన్న, ప్రేమ్ రాజ్ ఉలిగేపల్లె తిమ్మప్ప, రంగస్వామి,లక్ష్మన్న, దాసరి పల్లె రాముడు, గోపాల్ రమేష్, నేతన్న, ఆశన్న, ఆలూరు వెంకట రాములు, రామాంజనేయులు దొడ్డన్న, తిరుమలేష్, భీమయ్యగౌడ్ ఏసు,అంజి, ఎల్లేష్, రవి, శేఖర్, పరుష , గ్రామస్తులు సవారన్న నరేష్,అంజి,నాగన్న,చాకలి రామకృష్ణ,రాముడు, జంగంపల్లి లక్ష్మన్న, తదితరులు పాల్గొన్నారు.