Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ- నారాయణపేట టౌన్
1946 నుండి 1951 వరకు చేసిన తెలంగాణ సాయుధ పోరాటం నిజాం నిరంకుశ పాలనపై విసునూర్ రాంచంద్రారెడ్డి వంటి దేశ్ ముఖ్ దౌర్జన్యాలపై మహత్తరపోరాటం జరిగిందే కానీ హిందూ ముస్లీమ్ కొట్లాట కాదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు టి సాగర్ అన్నారు. శనివారం నారా యణపేట జిల్లా కేంద్రంలో తెలంగాణ సాయుధ పోరాట వారోత్స వాల సందర్బంగా సీపీఐ(ఎం) నిర్వహించిన బైక్ ర్యాలీకి, బహిరంగ సభకు అయన ముఖ్యతిథిగా హాజరై ప్రసంగించారు. భూమికోసం, భుక్తి, వెట్టిచాకిరి విముక్తి కోసం జరిగిన ఆ పోరాటం కమ్యూనిస్టులు నడిపారు. 10లక్షల ఎకరాలు సాగు భూమి పేదప్రజలకు పంచి నిజాం నిరంకుశ పాలన నుండి 3వేల గ్రామాలకు విముక్తి కల్పించి గ్రామ స్వరాజ్యాలను ఏర్పాటు చేశారని తెలిపారు. . కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి జి వెంకట్రామిరెడ్డి ,జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బాల్ రామ్ , జిల్లా కార్యదర్శి వర్గ నాయకులు అంజిలయ్య గౌడ్,దామరగిద్ద మండల నాయకులు మహేశ్ కుమార్‌గౌడ్,నాయకులు జోషి,నాయకులు కాశప్ప దస్తప్ప,నరహరి, అశోక్, వెంకటప్ప, సాయిలు,మల్లేష్, కోస్గి శ్రీను ఉన్నారు.
మహబూబ్‌నగర్ : తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరణ చేస్తున్న బీజేపీ అబద్ధ ప్రచారాన్ని ఖండించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు కే గోపాల్ విమర్శించారు. శనివారం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు సందర్భంగా సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్ పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించి బోయపల్లి గేటు, తెలంగాణ చౌరస్తాలో సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు కిల్లె గోపాల్ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను బిజెపి దాని అనుబంధ సంస్థలు అబద్ధ ప్రచారం చేస్తున్నాయని తెలిపారు.సాయుధ పోరాటంలో రావి నారాయణరెడ్డి మగ్డుం మొహియుద్దీన్, షోయబుల్లా ఖాన్, పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావు, భీమిరెడ్డి నరసింహారెడ్డి, మల్లు స్వరాజ్యం, మల్లు వెంకట నర్సింహ రెడ్డి, కష్ణమూర్తి, చాకలి ఐలమ్మ , దొడ్డి కొమరయ్య తదితర నాయకులు తెలంగాణలో నైజాం రజాకార్లకు వ్యతిరేకంగా జాగిర్దారులు దేశ్ముకులు పటేల్ పట్వారిలా దౌర్జన్యాలపై సంఘం ఆంధ్ర మహాసభల నాయకత్వంలో కమ్యూనిస్టులు పోరాటం చేశారని వివరించారు. .కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎన్ కురుమూర్తి, బి చంద్ర కాంత్, జిల్లా కమిటీ సభ్యులు జులపల్లి నర్సింహులు, ఎం మోహన్, లక్ష్మయ్య, సీపీఐ(ఎం) పట్టణ నాయకులు అనురాధ , విష్ణు వర్ధన్, జహంగీర్, మాణిక్‌రావు,వెంకటమ్మ , మాణిక్యం రాజు , రాములు , సత్యం, గాలేన్న పాల్గొన్నారు.
కందనూలు : వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్రను వక్రీకరించే పనిలో బిజెపి ఉన్నదని దానిని కమ్యూనిస్టు పార్టీలు కచ్చితంగా ఎదుర్కొంటాయని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి పర్వతాలు అన్నారు. జిల్లా కేంద్రంలో వీర తెలంగాణ పోరాట వార్షికోత్సవ సభను నిర్వహించారు. ముందుగా సాయుధ పోరాటంలో పాల్గొన్న వారి చిత్రపటాలకు పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు అబ్దుల్లా ఖాన్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కే గీత, మండల కార్యదర్శి అశోక్ కాశన్న ,నాయకులు మోహన్ రామయ్య నరసింహ నరేందర్ రెడ్డి జయలక్ష్మి రవి రామకష్ణ లో ఉన్నారు
మహబూబ్‌నగర్ ప్రాంతీయ ప్రతినిధి : కేంద్ర ప్రభుత్వ మతమౌట్యం నుండి బయటపడాలంటే వీర తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదామని సీపీఐ(ఎం) వనపర్తి జిల్లా కార్యదర్శి ఎండి జబ్బర్ పిలుపునిచ్చారు. వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా వనపర్తి పట్టణంలోని దాచా లక్ష్మయ్య ఫంక్షన్ హాల్ లో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నైజాం నవాబు ఆధ్వర్యంలో ఉన్న సామంతులు అత్యధికులు హిందువు లేనని గుర్తు చేశారు.అందుకే మతోన్మాద ఆర్ఎస్ఎస్ బీజేపీ శక్తులు తెలంగాణ ప్రాంతాన్ని విమోచన దినం అనడంలో అర్థం లేదన్నారు.సర్దార్ వల్లభారు పటేల్ సైన్యంతో వేలాదిమంది పోలీసులు వచ్చి 2,500 మందిని పొట్టన పెట్టుకున్న విషయం గుర్తు చేశారు. కార్యక్రమానికి సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు బి వెంకట్ , జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొత్త ఆంజనేయులు, డి బాల్‌రెడ్డి, లక్ష్మి ,అమరచింత మున్సిపల్ వైస్ చైర్మన్ జిఎస్ గోపి, మేకల ఆంజనేయులు, గోపాలకష్ణ, దేవేందర్ రాజు, రాజేందర్, ఉమా, గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు బాల్యానాయక్ పాల్గొన్నారు.
పెంట్ల వెళ్లి : మండల పరిధిలోని గోపాళపూర్ గ్రామంలో సీపీఐ(ఎం) పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాల ముగింపు సందర్భంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ బైక్ ర్యాలీని సీపీఐ(ఎం) పార్టీ జిల్లా కమిటీ సభ్యులు డి ఈశ్వర్ జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి కురుమయ్య, సభ్యులు హనుమంతు, ఎల్లగౌడ్, శ్రీనివాసులు,రాజు,ఈశ్వర్, తరుణ్, లక్ష్మణ్, ప్రవీణ్, నడిపి కాజా, రాంబాబు పాల్గొన్నారు.
మహమ్మదాబాద్: సాయుధ పోరాటం గురించి ఒక్కొక్క పార్టీ ఒక రకంగా మాట్లాడుతున్నాయని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు గుండాల నర్సింహులు అన్నారు. శనివారం మండల కేంద్రంలోని సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు లక్ష్మయ్య, రాజు, రమణయ్య, వెంకటయ్య నాయకులు పాల్గొన్నారు.
వీపనగండ్ల : తెలంగాణ విముక్తి పోరాట చరిత్ర కమ్యూనిస్టులని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మే కల ఆంజనేయులు అన్నారు. మండల పరిధిలోని దొడ్లేరు గ్రామంలోని సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో తెలంగాణ నుంచి పోరాట వారోత్సవాల్లో భాగంగా జెండాను సీపీఐ(ఎం) నాయకులు తాజా వెర్షన్ ఎగరవేశారు.కార్యక్రమంలో సీపీఐ(ఎం) గ్రామ కార్యదర్శి మహబూబ్ బాషా నాయకులు మౌలాలి రవి ప్రసాద్ వెంకటేష్ బుచ్చన్న పాల్గొన్నారు
కొల్లాపూర్ రూరల్ :నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండల కేంద్రంలో రాజా గారి బంగ్లా ముందు బైకు ర్యాలీని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి బి శివ వర్మ జండా ఊపి ప్రారంభించారు. సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను శనివారం నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణం లో బైక్ ర్యాలీ నిర్వహించారు. .ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కమిటీ సభ్యులు ఎండి సలీం, బి బాలపిరు, తారా సింగ్, నాయకులు రాజు సత్యం, మైముద్, పి రాజకుమార్, బంకల సతీష్, లక్ష్మణ్, రామచంద్ర, పకీర, రమేష్, పాల్గొన్నారు.
జడ్చర్ల : తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలలో భాగంగా శనివారం జడ్చర్ల పట్టణంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.సీపీఐ(ఎం) జిల్లా సీనియర్ నాయకుడు రాంరెడ్డి జ్యోతిరావు పూలే డాక్టర్ బి ఆర్ అంబెడ్కర్ విగ్రహాలకు పూల మాలలు వేసి బైక్ ర్యాలీ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎ.రాములు మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం 1946లో ప్రారంభమై 1951 వరకు కొనసాగిందన్నారు. కార్యక్రమంలో.జిల్లా నాయ కులు దీప్లానాయక్,మండల కార్యదర్శి జగన్, మండల నాయకులు, తెలుగు సత్యయ్య, పరుశురాం,మున్నా నాగరాజు, లక్ష్మీదేవి, నాయకుడు సుంకసారి కురుమూర్తి, పార్టీ నాయకులు.శంకర్ ,సాయిలు,కల్యాణి,రాము,నాగయ్య, బాలరాజు, మధు, పాల్గొన్నారు.
ఉండవల్లి : సెప్టెంబర్ 17న విలీనం తప్ప విమోచన దినం కాదని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వెంకటస్వామి అన్నారు. శనివారం అలంపూర్ చౌరస్తా లో వ్యవసాయ మార్కెట్ యార్డులో వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం వక్రీకరణ వాస్తవాలు అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. దున్నేవాడిదే భూమి ఇవ్వాలని వెట్టిచాకిరి రద్దు చేయాలని నిజాం నిరంకుశ పాలన అంతం కావాలని కమ్యూనిస్టుల నాయకత్వంలో మతాలకు అతీతంగా హిందువులు ముస్లింలు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేశారని అన్నారు.ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు రాజు. వెంకటేశ్వర్లు రఫిక్ నజీర్ రాఘవేంద్ర పాల్గొన్నారు..
రాజాపూర్ :తెలంగాణ రైతాంగా సాయుధ పోరాట వారోత్సవాలలో శనివారం బాలానగర్, రాజాపూర్ మండలాల్లో సీఐటీయూ జిల్లా ఉపాధ్యాయులు దీప్లా నాయక్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.
పెద్దకొత్తపల్లి : హైదరాబాద్ ప్రభుత్వ నియంత పాలనకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణ త్యాగాలు చేసింది ఒక కమ్యూనిస్టులేనని మండల సీపీఐ(ఎం) కార్యదర్శి దశరథం అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవ సభను నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన కార్యక్రమంలో బంగారి ,రాముడు, లక్ష్మి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
బాలానగర్ : బాలానగర్ రాజాపూర్ మండల కేంద్రాలలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల లో భాగంగా శనివారంబైక్ ర్యాలీని జెండా ఊపి సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు దీప్లా నాయక్ బాలానగర్ రాజాపూర్ జాతీయ రహదారులపై జెండా ఊపి ప్రారంభించాడు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు చెన్నయ్య.బల్ చెన్నయ్య, రమేష్. బాలరాజు,భీంల ,పాండు పాల్గొన్నారు..
ధరూరు : జోగులాంబ గద్వాల జిల్లాలోని శనివారం టి ఎన్ జి ఓ భవన్ గద్వాలలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో నిర్వహించిన చర్చగొస్టులో సదస్సులో సీపీఐ జిల్లా కార్యదర్శి బి ఆంజనేయులు అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమానికి జేఏసీ న్యాయవాది మధుసూదన్ బాబు, పాలమూరు అధ్యయన వేదిక జిల్లా కన్వీనర్ ఎగ్బల్ పాషా,సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వెంకటస్వామి, టీపీఫ్ రాష్ట్ర కోశాధికారి ప్రభాకర్, రచయిత అవనిశ్రీ, రైతుసంఘాలు కార్మిక సంఘాలు, విద్యార్థి, యువజన, ప్రజా సంఘాలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు గోపాలరావు ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి బి నర్సింలు, బహుజన రాజ్యసమితి వినోద్ కుమార్, రైతాంగ సమితి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఖాజా, కష్ణయ్య, సీఐటీయూ జిల్లా కార్యదర్శి వీవీ నరసింహులు, సీపీఐ ,సీపీఐ(ఎం) , ఎన్‌టిఎఫ్ లక్ష్మీనారాయణ ఇతర ప్రజా సంఘాలు విద్యార్థి యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.
తెలకపల్లి :మహత్తర పోరాటం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను బీజేపీ వక్రీకరిస్తుందని సీపీఐ(ఎం)జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్ శ్రీనివాసులు విమర్శించారు. శనివారం మండల కేంద్రంలోని తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలను నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు విజయ గౌడ్, మండల సభ్యుడు భాస్కర్, జగదీష్ ,బాబు, బండారు, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.