Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు బి వెంకట్
- దున్నేవాడికి భూమి కోసం పోరాటం చేసిన ఘనత
- 3వేల గ్రామాలల్లో 10 లక్షల ఎకరాల భూమిని పెదలకు పంచిన చరిత్ర
నవతెలంగాణ- మహబూబ్నగర్ ప్రాంతీయ ప్రతినిధి
3000 గ్రామాలలో 10 లక్షల ఎకరాల సాగు భూమిని పేదలకు పంచింది ఎర్రజెండా అని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు బి.వెంకట్ అన్నారు. శనివారం వనపర్తి జిల్లా కేంద్రంలోని దాచ లక్ష్మయ్య మీటింగ్ హాల్లో వీర తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల బహిరంగ సభ నిర్వహించారు. సభకు సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి జబ్బార్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా బి వెంకట్ మాట్లాడుతూ వెట్టిచాకిరికి వ్యతిరేకంగా దున్నేవాడికే భూమి కోసం నిర్వహించిన భూపోరాటంలో 3వేల గ్రామాలల్లో 10 లక్షల ఎకరాలను పేదలకు సీపీఐ(ఎం) పంచిందని ఆయన గుర్తు చేశారు.నైజాం పాలనతో పాటు జాగిర్దారి వ్యవస్థను కూకటి వేళ్లతో పెకిలించింది కమ్యూనిస్టులేనన్న విషయం మరిచిపోరాదన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంతో ఏ సంబంధం లేని బీజేపీ శ్రేణులు ఈ ఉద్యమానికి మతం రంగు పులిమెందుకు చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నైజాం నవాబు కింద ఉండి అనేక దారుణాలు జరిపింది సంస్థానాలలో క్రియాశీలకంగా ఉన్నది హిందువులే నన్న విషయం మర్చిపోరాదన్నారు. 560 సంస్థానంలో కేవలం 25 మాత్రమే ముస్లిములున్నారని తెలిపారు. చారిత్రక తప్పిదానికి ఒడిగడుతున్న హిందూ మతం మాత శక్తులను ఓడించడమే కమ్యూనిస్టుల ముందున్న కర్తవ్యమన్నారు. నాటి ఆంధ్ర మహాసభలో మొట్టమొదట సంపూర్ణ స్వాతంత్రంతో పాటు అనేక హక్కుల గురించి మాట్లాడింది కమ్యూనిస్టు లేదని గుర్తు చేశారు. విసునూరు దేశముకు అయిన రామచంద్రారెడ్డికి లక్ష్యా 50వేల ఎకరాలు ఉండేవి అన్నారు. అందుకే ఆంధ్ర మహాసభలో భూస్వాముల దగ్గర ఉన్న భూములను పేదలకు పంచాలని నిర్ణయించారని తెలిపారు. పేదల చేత వెట్టిచాకిరి చేయించుకోవడమే గాక కులవత్తులైన చాకలి, మంగలి, కుమ్మరి, తదితర వత్తిదారుల నుంచి ఉచితంగా అవసరాలు తీర్చాలని హుకుం జారీ చేసేవారని ఆయన గుర్తుచేశారు.తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ కు చెందిన భూమిలో పండిన పంటను అక్రమంగా రామచంద్రారెడ్డి సైన్యం తీసుకెళ్లడాన్ని అడ్డుకోవడంతో ఉద్యమం తీవ్ర రూపం దాల్చిందన్నారు. వేలాదిమంది సంఘ సభ్యులు కదిలి పంటను రక్షించుకున్నారని ఆయన అన్నారు. ఈ పోరాటంలో మొట్టమొదట నవాబు సైన్యం చేతిలో దొడ్డి కొమరయ్య అమరుడయ్యాడని ఆయన తెలిపారు. నైజాం నవాబుతోపాటు జాగీర్దార్ జమీందారులకు వ్యతిరేకంగా ప్రజలు ఆయుధాలు పట్టాలని పిలుపునిచ్చారని తెలిపారు. ఆయుధాలు కలిగిన బలమైన పోలీసు వ్యవస్థకు ప్రతిఘటన చేయాలంటే ఆయుధాలతోనే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని వారు గుర్తు చేశారు. ఈ క్రమంలోనే దున్నేవాడికే భూమన్న పిలుపును ఇచ్చారని తెలిపారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట ఉద్యమం ప్రపంచానికే స్ఫూర్తిదాయకమన్నారు. ఈ ఉద్యమంలోనే భూస్వామ్య వ్యవస్థ రద్దు కావాలని కోరారు. మూడు నెలల చంటి పిల్లలను వదిలేసి ఆయుధాలతో ఉద్యమంలో చేరారని ఇలాంటి ఉద్యమం బీజీపీ వారు ఎక్కడ చేశారో తెల్పులని ప్రశ్నించారు. మతం పేరుతో ఈ ప్రాంత ప్రజలను చీల్చి రాజ్యాధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ మళ్లీ కలలు కటుందన్నారు. ఐలమ్మ ఉద్యమ స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ కోనసాగించాలని ఆయన కోరారు.కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఫుట్ట ఆంజనేయులు, డి బాల్రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ జిఎస్ గోపి, గోపాలకృష్ణ ,దేవేందర్, రాజు, రాజేందర్,ఉమా,గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు బాల్యానాయక్ తదితరులు పాల్గొన్నారు.