Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అడవి ఫలాలు.. 60 రోజులు లభ్యం
- పాలమూరు నుండి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి
- పళ్ళ నుండి గుజ్జు తీసి ఆహార పదార్థాల తయారీ
- నవాబ్‌పేట్ దామరగిద్దలో ప్రాసెసింగ్ సెంటర్లు
- ఈ సీజన్లో పెరుగుతున్న ఉపాధి అవకాశాలు
పోషకాల గని సీతాఫలం. రుచితో పాటు ఔషధ గుణాలు ఉండడంతో మార్కెట్లో డిమాండ్ ఉంది. అందులోనూ పాలమూరు మధురం అంటే మరీనూ. సీతాఫలాలు... ఆరోగ్య పరిష్కారానికి చక్కటి మార్గాలు. ఎలాంటి రసాయన పదార్థాలు వాడకుండా అడవులను సేకరించేటివే సీతాఫలాలు. శీతాకాలంలో లభించే ఈ పండ్లను సీతాఫలాలంటారు. సెప్టెంబర్ రెండో వారం నుంచి అక్టోబర్ చివరి వరకు పాలమూరు ఉమ్మడి జిల్లాలో విస్తారంగా సీతాఫలాలు లభిస్తాయి. ఈవారం వాటి యొక్క ప్రత్యేకత చూద్దాం.
నవ తెలంగాణ-మహబూబ్ నగర్
మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా అంటే అందరికీ వెంటనే గుర్తుకొచ్చేది వలసలు పోతారని. కానీ లక్షల రూపాయలు ఖర్చు చేసిన లభించని పోషకలు అధికంగా ఉండే సీతాఫలాలు ఏ జిల్లాలోని ఉంటాయని చాలామందికి తెలియదు. మీడియా అభివృద్ధి తర్వాత పాలమూరు సీతాఫలాల గురించి ప్రపంచానికి ప్రత్యేకంగా తెలిసి వస్తుంది.
ఎక్కడి నుండి సీతా ఫలాలు : మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాలో మైదానం అడవులు ఏజెన్సీ అడవులు కలిసి ఉంటాయి. నల్లమల్ల అడవులు మొదలుకొని కర్ణాటక దగ్గరలోని నారాయణపేట మైదాన అడవుల వరకు ఈ సీతా ఫలాల చెట్లు అడవుల్లో పెరుగుతుంటాయి. గత నాలుగు సంవత్సరాలుగా వర్షాలు క్రమం తప్పకుండా కురుస్తుండడంతో సీతాఫలాల ఉత్పత్తి బాగా పెరిగింది. ముఖ్యంగా మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రానికి అతి సమీపంగా ఉన్న నవాబ్‌పేట మండలంలో సీతాఫలాలకు పెట్టింది పేరు. రైతులు వారి పొలాలు గట్ల పైన తాపల చెట్లను పెంచుతారు. పాలమూరు జిల్లా వాసులతో పాటు ఇతర ప్రాంత ప్రజలకు మొదటిగా రుచిచూసే పళ్ళు నవాబ్‌పేట ప్రాంతానికి చెందినవి కావడం విశేషం. రైతులు గ్రామీణ ప్రాంత పేదలు అడవుల వెళ్లి కష్టాలు పడుతూ సీతాఫలాలను సేకరించి. విక్రయించడానికి పట్టణాలకు తీసుకువస్తారు. 60 రోజులపాటు సీతాఫల ప్రియుల అందుబాటులో ఉంటాయి.
ఔషధ గుణాల గని సీతాఫలాలు : మనుషులలో ఉండే ఐఫోన్ థైరాయిడ్. చిగుళ్ల వాపులు. కాళ్ల నొప్పులు. కాల్షియం లోపాన్ని నివారించడంలో సీతాఫలాలు ఎంతో తోడ్పడతాయని నిపుణుల అభిప్రాయం. బక్కగా ఉన్నవారు లావు పెరగడానికి సీతాఫలాలు తినాలని పలువురు చూసి ఇస్తారు. గర్భిణీ స్త్రీలు ఈ సీతాఫలాలు తినడం ద్వారా పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉంటారని పలువురి తెలిపారు.
సీతాఫల గుజ్జు నుండి తయారీ : సీతాఫలం తినడంతో పాటు వాటి నుండి గుజ్జు తీసి ఐస్ క్రీమ్. మిల్క్ షేక్ లు. జ్యూసుల తయారీలో ఉపయోగిస్తున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో అప్పటి కలెక్టర్ రోనాల్డ్ రోజ్ దామరగిద్ద నవ పేట మండల కేంద్రాలలో సీతాఫలం నుండి గుజ్జు సేకరించి సెంటర్లను ప్రారంభించారు.
ఎగుమతులు : మహబూబ్ నగర్ జిల్లాలో విస్తారంగా లభించే సీతాఫలాలు ఇప్పుడు ఇతర రాష్ట్రాలకు ప్రాంతాలకు ఎగుమతి అవుతున్నాయి. కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు రాష్ట్రాలకు కూడా పాలమూరు సీతాఫలాలు ఎగుమతి చేస్తున్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాదులో 60 రోజులపాటు పాలమూరు సీతాఫలాలు కనువిందులు చేస్తాయి. షాద్‌నగర్. జడ్చర్ల నియోజకవర్గం ఇప్పుడు ఈ సీతాఫలాల సాగు ఒక వ్యాపారంగా మారింది. ఎక్కువ భూములలో సీతాఫల పంటలను పెంచుతున్నారు.
60 రోజులు పని ఉంటుంది...
దసరా పండుగ నాటి వరకు సీతాఫలాలు పుష్కలంగా లభిస్తాయి ఆ తర్వాత అక్టోబర్ మాసంలో కూడా ఈ పనులు సేకరించుకోవడానికి అవకాశం ఉంటుంది. మా పొలం గట్ల తో పాటు అడవుల్లోకి వెళ్లి సీతాఫలాలను సేకరిస్తాం. కానీ మా కష్టానికి తగ్గ ఫలితం రాదు. ఎందుకంటే ఇవి తెంచిన తర్వాత ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. ప్రభుత్వం సీతాల గిడ్డంగులు నిర్మిస్తే మాలాంటి వారికి ఎంతో లాభంగా ఉంటుంది.
చెన్నమ్మ తీగలపల్లి. నవాబ్‌పేట మండలం.