Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వనపర్తి రూరల్ : వనపర్తి జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో ముందర స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ సీఐటీయూ ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవ వారోత్సవాలు పురస్కరించుకొని ఎస్‌డబ్ల్యూఎఫ్ వనపర్తి డిపో సీనియర్ నాయకులు యండి ఖయ్యం టీఎస్ఆర్టీసీ ఎస్‌డబ్ల్యూఎఫ్ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా వనపర్తి డిపో సీఐటీయూ జిల్లా నాయకులు గోపాలకృష్ణ హాజరయ్యారు ఈసందర్భంగాఆయన మాట్లాడుతు 43. సంవత్సరాలు పూర్తి చేసుకుని.44వ సంవత్సరంలో అడుగుపెడుతున్నమని. ఐక్య ఉద్యమాలు ఎస్, డబ్ల్యూ, ఎఫ్, తోనే సాధ్యమన్నారు ఆర్టీసీ కార్మికులు తమ న్యాయమైన సమస్యల కోసం ప్రభుత్వంతో పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు .కార్మికులు ఎలాంటి పోరాటాలు చేసినా సిఐటియు ఎల్లవేళలా అండగా ఉంటుందన్నారు. అదేవిధంగా డిపో కార్యదర్శి జె.వి.స్వామి మాట్లాడుతూ ఆర్టీసీలో కార్మికుల హక్కుల సాధనకోసం కార్మిక వర్గాని యేకం చేయటంకోసం 1979 సెప్టె0బరు 16 వ తేదీన ఎస్ డబ్ల్యూ ఎఫ్ ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఏజి కృష్ణ , కోశాధికారి. బి కృష్ణ సహాయకార్యదర్శి , టీఎంయూ. నాయకులు చలపతి రెడ్డి, కేఎంపిఎల్ ,రమేష్. తదితరులు పాల్గొన్నారు.