Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహబూబ్ నగర్
ఈనెల 14 నుండి 16వ తేదీ వరకు కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరిగిన ఎస్ఎఫ్ఐ రాష్ట్ర 4వ మహాసభలు మహబూబ్నగర్ జిల్లా కార్యదర్శి ప్రశాంత్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఎన్నుకున్నారని జిల్లా అధ్యక్షులు భరత్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మూడు రోజులపాటు రాష్ట్ర మహా సభలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారం చేపట్టి ఎనిమిది సవత్సరాలు గడిచిపోయిన విద్యార్థుల సమస్యలు పరిష్కరించడంలో విఫలమైనాయని అభిప్రాయం వ్యక్తం అయినట్లు వారు తెలిపరు. కొత్తగా ఎన్నుకోబడ్డ రాష్ట్ర కమిటీ విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం సమరశీల పోరాటాలు చేయాలని తీర్మానించినట్లు వారు తెలిపారు.